Home » అప్పుడే ఓటీటీలోకి వచ్చేస్తున్న రీసెంట్ సూపర్ హిట్ మూవీ.. !

అప్పుడే ఓటీటీలోకి వచ్చేస్తున్న రీసెంట్ సూపర్ హిట్ మూవీ.. !

by Anji
Ad

ఇటీవలే విడుదలై థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శించబడుతున్న ఓ చిన్న సినిమా త్వరలోనే ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. చాలా రోజుల తరువాత ఒక మంచి మూవీ వచ్చిందని ప్రేక్షకులు ఆ  మూవీ చూసేందుకు బ్రహ్మరథం పడుతుంటే.. ప్రముఖ రెండు ఓటీటీ సంస్థలు మాత్రం ఈ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయాలని తెగ ఆసక్తి చూపిస్తున్నాయి. 

Advertisement

శ్రీవిష్ణు హీరోగా, రెబ్బా మోనికా జాన్ హీరోయిన్ గా, సీనియర్ నటుడు నరేష్ ప్రధాన పాత్రలో నటించిన సామజవరగమన మూవీ గురించి దాదాపు అందరికీ తెలిసిందే. గతంలో కమెడియన్ సత్యను హీరోగా పరిచయం చేస్తూ వివాహ భోజనంబు సినిమాను డైరెక్ట్ చేసిన రామ్ అబ్బరాజు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర ఈ మూవీని ప్రజెంట్ చేయగా.. రాజేష్ దండ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీపై నమ్మకంతో మేకర్స్ సినిమా రిలీజ్ కి ముందే కొన్ని థియేటర్లలో ప్రీమియర్ షోలు వేశారు. మంచి కామెడీ, నిర్మాణ విలువలతో ఈ చిత్రం అందరినీ కడుపు ఉబ్బా నవ్వించగా అదే పాజిటివ్ టాక్ తో జూన్ 29న సామజవరగమన థియేటర్స్ లో విడుదలైంది. చాలా రోజుల తరువాత వచ్చిన కుటుంబ కథా చిత్రం అవ్వడంతో ప్రేక్షకులు ఈ చిత్రానికి బ్రహ్మరథం పట్టారు. 

Advertisement

విడుదలకు ముందే కొనడానికి బయ్యర్స్ కూడా లేని ఈ మూవీ అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఇప్పటివరకు రూ.47కోట్ల వరకు వసూలు చేసింది. ఇంకా థియేటర్స్  మంచి యాక్యుపెన్సీ తో ప్రదర్శించబడుతోంది. ఈ మూవీని 10 రోజుల్లో నెట్ ఫ్లిక్స్, ఆహా ఓటీటీలలో స్ట్రీమింగ్ అవ్వడానికి సిద్ధమైంది. ఈ విషయాన్ని ఇటీవలే ఆహా టీమ్ పోస్ట్ ద్వారా ధృవీకరించింది. మంచి సినిమాలు కూడా థియేటర్స్ లో ఆడనివ్వకపోతే ఇంకా సినిమాలు థియేటర్స్ లో కాకుండా డైరెక్ట్ గా ఓటీటీలలో విడుదల చేసేందుకు ఉత్తమమైన పని అని అనుకుంటున్నారు అభిమానులు. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

హరిహరవీరమల్లు మూవీ గురించి క్లారిటీ ఇచ్చిన నిధి అగర్వాల్..!

రాజమౌళి నటించి, దర్శకత్వం వహించిన మూవీ అంతగా ఆకట్టుకోలేదనే విషయం మీకు తెలుసా ?

Visitors Are Also Reading