గత కొంతకాలంగా సోషల్ మీడియాలో మంచు మనోజ్, భూమా మౌనిక గురించి అనేక వార్తలు వస్తున్నాయి. వీరిద్దరూ హైదరాబాదులో కలిసి తిరగడం దేవాలయాలు దర్శించుకోవడం వల్ల వీరి మధ్య ఏదో నడుస్తుందని అందరూ వార్తలు రాశారు. అందరు అనుకున్నట్టుగానే మంచు మనోజ్ మరియు మౌనిక ప్రేమించుకొని పెళ్లి ద్వారా ఒకటయ్యారు. అయితే వీరి పెళ్లిపై కూడా కొన్ని రోజులుగా అనేక వార్తలు వచ్చాయి. చివరికి మనోజ్ అక్క మంచు లక్ష్మి తమ్ముని దగ్గరకు తీసి వీరి పెళ్లిని దగ్గర ఉండి జరిపించింది. అయితే ఈ పెళ్లికి మోహన్ బాబు రాడంటూ అనేక వార్తలు వచ్చాయి.
also read:Butta Bomma : ఓటీటీ లోకి వచ్చేసిన సూపర్ హిట్ మూవీ బుట్టబొమ్మ…ఎందులో స్ట్రీమింగ్ అంటే !
Advertisement
Advertisement
కానీ చివరికి మోహన్ బాబు పెళ్లికి అటెండ్ అయి వారిని ఆశీర్వదించారు. మరి మోహన్ బాబు రావడానికి ఎవరు మోటివేట్ చేశారో ఇప్పుడు తెలుసుకుందాం.. అయితే భూమ మౌనిక మనోజ్ ఇద్దరికీ ఇది రెండో పెళ్లి. మౌనిక టిడిపి పార్టీ కావడం, మోహన్ బాబు ఫ్యామిలీ వైసీపీకి సపోర్ట్ చేయడం, అలాగే మనోజ్ మౌనికాల పెళ్లి చేసుకోవడం మోహన్ బాబుకి ఇష్టం లేదు. దీంతో ఆయన పెళ్లికి రాడంటూ అనేక వార్తలు వచ్చాయి.
also read:Jr:NTR జాతకంలో అలా ఉందా..జ్యోతిష్యులు ఏమంటున్నారంటే..?
ఎట్టకేలకు వాటన్నిటిని తెరదించుతూ ఏకంగా మోహన్ బాబే పెళ్లి పెద్దగా మారి కొడుకును కొత్త కోడలును ఆశీర్వదించారు. ఈ క్రమంలోనే భూమ మౌనిక కన్నీరు పెట్టుకుంది. మోహన్ బాబు మనోజ్ పెళ్లికి అటెండ్ అవ్వడానికి కారణం మంచు లక్ష్మి అని తెలుస్తోంది. లక్ష్మీ తన తల్లిదండ్రులకు నచ్చచెప్పి మరీ ఒపించిందని వారిద్దరిని ఎట్టకేలకు పెళ్లికి తీసుకు వచ్చిందని ప్రస్తుతం సోషల్ మీడియాలో అనేక వార్తలు వైరల్ అవుతున్నాయి.
also read: