Home » చిరంజీవికి మెగాస్టార్ బిరుదు వెనుక ఉన్న క‌థ గురించి మీకు తెలుసా..?

చిరంజీవికి మెగాస్టార్ బిరుదు వెనుక ఉన్న క‌థ గురించి మీకు తెలుసా..?

by Anji
Ad

తెలుగు ఇండ‌స్ట్రీలో ఎన్టీఆర్‌, ఏఎన్నార్, కృష్ణ‌, శోభ‌న్ బాబు, కృష్ణంరాజు త‌రువాత స్వ‌యం కృషితో ఎదిగిన స్టార్ హీరో ఎవ‌ర‌న్నా ఉన్నారంటే అది చిరంజీవి అని చెప్ప‌వ‌చ్చు. అప్ప‌టికే ఎంతో మంది హీరోలు ఉన్న‌ప్ప‌టికీ త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకుని మెగాస్టార్ గా ఎదిగారు. ఇక చిరంజీవికి మెగాస్టార్ అనే బిరుదు వెనుక పెద్ద స్టోరీనే ఉంది. దాని వెనుక ఓ టాలీవుడ్ అగ్ర‌నిర్మాత ఉన్నారు.

Advertisement

టాలీవుడ్‌లో చిరంజీవిని మెగాస్టార్ ను చేసిన నిర్మాత కే.ఎస్‌.రామారావు. ఈయ‌న త‌న క్రియేటివ్ క‌మ‌ర్షియ‌ల్ బ్యాన‌ర్ లో చిరంజీవి ప‌లు సూప‌ర్ హిట్ చిత్రాల‌ను నిర్మించారు. తెలుగులో ముఖ్యంగా ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, కృష్ణ వంటి అగ్ర హీరోలు స్టార్స్ ఉన్న స‌మ‌యంలో చిరంజీవితో ప‌లు సూప‌ర్ హిట్ చిత్రాల‌ను నిర్మించారు నిర్మాత కే.ఎస్. రామారావు. చిరంజీవి-కే.ఎస్.రామారావు కాంబోలో వ‌చ్చిన మొద‌టి చిత్రం అభిలాష‌. యండ‌మూరి వీరేంద్ర‌నాథ్ న‌వ‌ల ఆధారంగా కోదండ‌రామిరెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కించిన ఈ చిత్రం టాలీవుడ్ లో సూప‌ర్ హిట్ గా నిలిచింది. వీరి కాంబినేష‌న్‌లో రెండ‌వ చిత్రం ఛాలెంజ్. ఇక మూడ‌వ చిత్రం రాక్ష‌సుడు. ఈ చిత్రం కూడా యండ‌మూరి వీరేంద్ర‌నాథ్ న‌వ‌ల ఆధారంగా కోదండ‌రామిరెడ్డి ద‌ర్శ‌క‌త్వంలోనే రూపుదిద్దుకుంది.


ఇక రాక్ష‌సుడు సినిమాతోనే చిరంజీవి త‌మ్ముడు నాగ‌బాబు న‌టుడిగా టాలీవుడ్‌కి ప‌రిచ‌య‌మ‌య్యారు. చిరంజీవి నిర్మాత కే.ఎస్.రామారావు క‌ల‌యిక‌లో వ‌చ్చిన నాలుగ‌వ చిత్రం మ‌ర‌ణ మృదంగం. ఈ చిత్రానికి కూడా ద‌ర్శ‌కుడు ఏ.కోదండ‌రామిరెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద ఓ మోస్తారు విజ‌యాన్ని మాత్ర‌మే అందుకుందని చెప్పాలి. ఈ చిత్రంలోనే తొలిసారి స్క్రీన్ పై చిరంజీవి పేరు ముందు మెగ‌స్టార్ అనే బిరుదు వ‌చ్చి చేరింది. నిర్మాత కే.ఎస్‌.రామారావు చిరంజీవికి అందించిన అరుదైన బిరుదు అనే చెప్పాలి. అప్ప‌టి వ‌ర‌కు సుప్రీం హీరో బిరుదుతో వ‌స్తున్న చిరంజీవి ఫ్యామిలీ మెగా ఫ్యామిలీగా మార‌డం వెనుక అస‌లు వ్య‌క్తి ఈయ‌నే. ఇక చిరంజీవి-కే.ఎస్.రామారావు క‌ల‌యిక‌లో వ‌చ్చిన ఐద‌వ చిత్రం స్టువ‌ర్ట్‌పురం పోలీస్ స్టేష‌న్‌. ఈ చిత్రం ర‌చ‌యిత యండ‌మూరి వీరేంద్ర‌నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కింది.

Advertisement

ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద ఆశించిన ఫ‌లితాన్నిమాత్రం అందుకోలేక‌పోయింద‌నే చెప్పాలి. ఈ చిత్రం డిజాస్ట‌ర్ త‌రువాత చిరంజీవి-కే.ఎస్‌.రామారావు క‌ల‌యిక‌తో మ‌రో చిత్రం తెర‌కెక్కలేదు. ఇందులో చిరంజీవి స‌ర‌స‌న విజ‌య‌శాంతి, నిరోషా హీరోయిన్లుగా న‌టించారు. చిరంజీవి-కే.ఎస్‌.రామారావు క‌ల‌యిక‌లో మొత్తానికి 5 చిత్రాలు తెర‌కెక్కితే మూడు చిత్రాలు స‌క్సెస్ సాధించ‌గా.. చిరంజీవిని మెగాస్టార్‌ను చేసిన మ‌ర‌ణ మృదంగం యావ‌రేజ్ గా నిలిచింది. చివ‌రి చిత్రం స్టూవ‌ర్ట్ పురం పోలీస్ స్టేష‌న్ అట్ట‌ర్ ఫ్లాప్‌గా నిలిచింది. చిరంజీవి పేరు ముందు కే.ఎస్‌.రామారావు చేర్చారు. దాదాపు 31 ఏళ్ల త‌రువాత ఇప్పుడు చిరంజీవి-కే.ఎస్‌.రామారావు కాంబోలో భోళా శంక‌ర్ సినిమా రాబోతుంది. ద‌ర్శ‌కుడు మెహ‌ర్ ర‌మేష్ తెర‌కెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతుంది. చిరంజీవి-కే.ఎస్.రామారావు కాంబోలో వ‌స్తున్న ఈ సినిమా హిట్ అవుతుందా..? లేదా అనేది తెలియాలంటే మాత్రం కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.

Also Read : 

నాగ‌చైత‌న్య‌, స‌మంత ఇంకా స్నేహ‌పూర్వ‌కంగానే ఉన్నారా..? స‌మంత ఆస‌క్తిక‌ర‌మైన కామెంట్స్..!

బ్లాక్ బ‌స్ట‌ర్ అవ్వాల్సిన “ఆరెంజ్” సినిమా ఎందుకు ఫ్లాప్ అయ్యింది..? 5 కార‌ణాలు ఇవేనా..!

 

Visitors Are Also Reading