Telugu News » Blog » నాగ‌చైత‌న్య‌, స‌మంత ఇంకా స్నేహ‌పూర్వ‌కంగానే ఉన్నారా..? స‌మంత ఆస‌క్తిక‌ర‌మైన కామెంట్స్..!

నాగ‌చైత‌న్య‌, స‌మంత ఇంకా స్నేహ‌పూర్వ‌కంగానే ఉన్నారా..? స‌మంత ఆస‌క్తిక‌ర‌మైన కామెంట్స్..!

by Anji
Ads

నాగ‌చైత‌న్య‌, స‌మంత‌లు చాలా కాలం ప్రేమించుకుని పెళ్లి చేసుకుని వీరి విడాకులు ప్ర‌క‌టించుకున్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. మ‌రొక వైపు వీరి విడాకుల వ్య‌వ‌హారంలో కొంద‌రూ స‌మంత‌పై అస‌త్య ప్ర‌చారం చేయ‌డం.. కోర్టు వివాదాలు ఇలా చాలా సంఘ‌ట‌న‌లే జ‌రిగాయి. ఇదిలా ఉండ‌గా.. మ‌రోవైపు స‌మంత మాత్రం ఇదివ‌ర‌కంటే జోష్ తో బాలీవుడ్ లో సైతం సినిమాల‌ను చేస్తూ దూసుకెళ్తుంది. ఇక ఈ జంట అస‌లు ఎందుకు విడిపోయింద‌నే అంశంపై ఇప్ప‌టికీ కూడా క్లారిటీ రావ‌డం లేదు. సోష‌ల్ మీడియాలో మాత్రం ర‌క‌ర‌కాల రూమ‌ర్స్ వినిపిస్తున్నాయి.

Ads


ప్ర‌స్తుతం స‌మంత‌, చైత‌న్య స్నేమ పూర్వ‌కంగానే ఉన్నారా..? అనే ప్ర‌శ్న‌కు స‌మంత మాత్రం ఆస‌క్తిక‌ర‌మైన స‌మాధానం చెప్పింది. బాలీవుడ్‌లో పాపుల‌ర్ షో అయిన‌టువంటి కాఫీ విత్ క‌ర‌ణ్ ఏడో సీజ‌న్ కొన‌సాగుతోంది. ఇటీవ‌లే జాన్వీక‌పూర్, సారా అలీఖాన్ సంద‌డి చేశారు. హోస్ట్ క‌ర‌ణ్ జోహార్ అడిగిన ప‌లు ప్ర‌శ్న‌ల‌కు వారు స‌మాధానం ఇచ్చి నెట్టింట్లో పుల్ బ‌జ్ క్రియేట్ చేశారు. తాజాగా స‌మంత కాఫీ విత్ క‌రణ్ షో లో పాల్గొన్నారు. ఈ షో ఫుల్ ఎపిసోడ్ గురువారం టెలికాస్ట్ అయింది. క‌ర‌ణ్ స‌మంత‌ను ప్ర‌స్తుతం మీరు నాగ‌చైత‌న్య‌తో స్నేహ పూర్వ‌కంగానే ఉన్నారా..? అని ప్ర‌శ్నంచ‌గా.. స‌మంత దానికి ఇలా స‌మాధానం చెప్పింది. ఒక‌వేల ప్ర‌స్తుతం మ‌మ్ముల్ని ఒకే గ‌దిలో ఉంచితే మీరు క‌చ్చితంగా ప‌దునైన వ‌స్తువుల‌ను అందుబాటులో లేకుండా చూడాలి. ఇప్ప‌టిక‌ప్పుడు నా అభిప్రాయం ఇదే. ఇక భ‌విష్య‌త్ లో అయితే మేమ‌ద్ద‌రం స్నేహ పూర్వ‌కంగా మారొచ్చ‌ని చెప్పుకొచ్చింది స‌మంత‌.

Ads


స‌మంత చేసిన ఈ వ్యాఖ్య‌లు ప్ర‌స్తుతం వైర‌ల్ అవుతున్నాయి. సమంత‌కు చైత‌న్య అంటే అంత కోప‌మా అని నెట్టింట్లో అభిమానులు చ‌ర్చించుకుంటున్నారు. ఇక ఇదిలా ఉండ‌గా.. నాగ‌చైత‌న్య వ‌రుస సినిమాల‌ను లైన్ లో పెట్టారు. మ‌రోవైపు స‌మంత ప్ర‌స్తుతం విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో ఖుషీ, య‌శోద‌, శాకుంత‌లం వంటి చిత్రాల్లో న‌టిస్తున్న విష‌యం తెలిసిన‌దే. ఇక వీటితో పాటు హాలీవుడ్‌లో ఓ సినిమాలో కూడా న‌టిస్తోంది. బాలీవుడ్ లో కూడా కొన్ని సినిమాల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టు వార్త‌లు వినిపిస్తున్నాయి.

Also Read : 

Ad

బ్లాక్ బ‌స్ట‌ర్ అవ్వాల్సిన “ఆరెంజ్” సినిమా ఎందుకు ఫ్లాప్ అయ్యింది..? 5 కార‌ణాలు ఇవేనా..!