Home » అంకాపూర్ చికెన్ ఎందుకంత ఫేమ‌స్.. ఎలా వండుతారో తెలుసా..?

అంకాపూర్ చికెన్ ఎందుకంత ఫేమ‌స్.. ఎలా వండుతారో తెలుసా..?

by Anji
Ad

సాధారాణంగా ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్క‌టి ఫేమ‌స్ ఉంటుంటుంది. హైద‌రాబాద్‌లో బిర్యాని, హ‌లీం ఎలా ఫేమ‌స్ ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర‌లేదు. అదేవిధంగా తెలంగాణ‌లో నాటుకోడి తినేవారికి అంకాపూర్ చికెన్ చాలా ఫేమ‌స్. ఇది ఎందుకు అంత‌లా ఫేమ‌స్ అయింది. దీనిలో ఉన్న సీక్రెట్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

హోట‌ల్ నిర్వ‌హాకులు దాదాపు 35 ఏండ్ల నుంచి నిజామాబాద్ జిల్లాలోని అంకాపూర్ గ్రామంలో చికెన్ వండి అమ్ముతున్నార‌ట‌. ఇక్క‌డ టేస్టీ ఉండ‌డానికి ప్ర‌ధాన కార‌ణం ఏమిటంటే.. చికెన్‌లో ఉప‌యోగించే ప్ర‌తి వ‌స్తువు సాధార‌ణంగా వాడేది. ముఖ్యంగా చికెన్‌లో అన్ని కొల‌త‌ల‌తో కూడిన వ‌స్తువుల‌ను వేస్తుంటారు. చికెన్‌, కారం, ఉప్పు, మ‌సాలా, ప‌సుపు, అల్లం, కొబ్బ‌రిపొడి, గ‌రంమ‌సాలా, ధ‌న్యాల‌పొడి అన్ని ముందుగా క‌లుపుకుంటారు. ఆ త‌రువాత స్టౌ ఆన్ చేసి నూనె పోసి రెండు ఉల్లిగ‌డ్డ‌లు వేయించిన త‌రువాత క‌లిపి పెట్టుకున్న చికెన్‌ను వేస్తారు. ఆ త‌రువాత అది ఉడికిన త‌రువాత వాట‌ర్ పోస్తారు. ఇది చాలా రుచిక‌రంగా ఉంటుంది. కొల‌తలతోపోయ‌డం, అన్నినాచుర‌ల్‌గా దంచిన మ‌సాలాల కార‌ణంగానే రుచిగా ఉంటుంద‌ని నిర్వాహ‌కులు చెబుతున్నారు.

Advertisement

Also Read :  సీరియ‌ల్ గా ETV రిజెక్ట్ చేసిన ఆ క‌థ‌! తెలుగు ఇండ‌స్ట్రీనే షేక్ చేసింది.

ముఖ్యంగా 1985లో అప్ప‌టి ప్ర‌భుత్వ అధికారులు అంకాపూర్ వ‌చ్చారు. అప్పుడు వారికి భోజ‌నం సౌక‌ర్యం లేదు. దీంతో బాజ‌న్న అనే వ్య‌క్తి తొలుత ఇక్క‌డ చికెన్ వండారు. ఆఫీస‌ర్లు దానిని రుచి చూసి ఫిదా అయిపోయారు. ఇక అప్ప‌టి నుంచి రోజు చికెన్ చేయ‌మ‌ని అధికారులు చెప్పేవారు. ఇక అప్ప‌టి నుంచి మెల్ల‌గా హోట‌ల్ ప్రారంభించారు. రెగ్యుల‌ర్‌గా అధికారులు, ఇత‌ర గ్రామ‌స్తులు అంద‌రూ అంకాపూర్ వ‌చ్చి చికెన్ తినడంతో టేస్టీగా ఉండి అది ఎంతో ఫేమ‌స్ అయింది. ఇంకెందుకు ఆల‌స్యం మీరు ఒక సారి అంకాపూర్‌కు వెళ్లి చికెన్ రుచి చూడండి.

Also Read :  సీఎం జ‌గ‌న్‌తో మంత్రి పేర్నినాని భేటి.. ఎందుకంటే..?

Visitors Are Also Reading