తెలుగు ఇండస్ట్రీలో చాలామంది నటీనటుల విడాకుల వ్యవహారం అనేది ఇండస్ట్రీ మొదలు నుంచి వస్తున్న తతంగమే. ఇప్పటికి ఎంతో మంది స్టార్ నటీనటులు కూడా పెళ్లిళ్లు చేసుకుని మనస్పర్థలు వచ్చి విడిపోయి జీవితంలో ఎదిగిన వారు అనేకం.. ఇది సినిమా ఇండస్ట్రీలో చాలా కామన్ పాయింట్ గా తీసుకుంటారు. అయితే అక్కినేని ఫ్యామిలీలో స్టార్ హీరోగా ఎదిగిన కింగ్ నాగార్జున కూడా దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి వచ్చిన లక్ష్మీ ని ముందు వివాహం చేసుకొని మనస్పర్ధలు రావడంతో విడాకులు తీసుకున్న విషయం అందరికి తెలిసిందే. దీనికి ఒక ప్రత్యేకమైన కారణం ఉందని తెలుస్తోంది.. మరి అదేంటో ఒకసారి చూద్దాం. అక్కినేని నాగార్జున దగ్గుబాటి లక్ష్మి 1984 నాలుగులో పెళ్లి చేసుకున్నారు. వివాహమైన కొద్ది రోజులకు వీరి మధ్య విభేదాలు రావడంతో 1990 లో ఇద్దరు అంగీకారంతోనే విడాకులు తీసుకొని విడిపోయారు. కానీ అప్పటికే వీరిద్దరికీ అక్కినేని నాగచైతన్య జన్మించారు.
Advertisement
Advertisement
ఈ విడాకుల సమయంలో నాగార్జున చైతన్య సంరక్షణ తీసుకున్నారు. అప్పటి నుంచి ఆయనను బాగా చూసుకుంటూ ప్రస్తుతం స్టార్ హీరో హోదా సాధించడానికి నాగార్జున బ్యాక్ బోన్ గా ఉన్నారని చెప్పవచ్చు. అయితే అప్పట్లో అక్కినేని నాగార్జున లక్ష్మితో ఎందుకు విడాకులు తీసుకున్నారో ఒక విషయం బలంగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.. అదే ఏంటయ్యా అంటే దగ్గుబాటి లక్ష్మీ చిన్నప్పట్నుంచి అమెరికాలో పెరగడం వల్ల, ఆమె బాల్యం మొదలు చదువు పూర్తయ్యే వరకు అమెరికాలోనే ఉన్నది. అయితే నాగార్జునతో పెళ్లి అయిన తర్వాత అమెరికాలో వెళ్లి సెటిల్ అవుదామని నాగార్జునను చాలా ఫోర్స్ చేసేదట, కానీ దీనికి నాగార్జున ఒప్పుకోకపోవడంతో వారి మధ్య విభేదాలు మొదలయ్యాయని సమాచారం.
ఈ గొడవల కారణంగా తన సినీ భవిష్యత్తు మరియు పిల్లల భవిష్యత్తు నాశనం కాకూడదని ఇద్దరు అనుకుని విడాకులు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక అప్పటికే నాగార్జున ప్రముఖ హీరోయిన్ అక్కినేని అమలను ప్రేమించి 1992 రెండో వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత వీరిద్దరికీ అక్కినేని అఖిల్ జన్మించారు. అఖిల్ కూడా తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదగటానికి చాలా కష్టపడుతున్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం నాగార్జున గోస్టు అనే మూవీలో చేస్తున్నారు. ఈమధ్య ఆ సినిమా ట్రైలర్ విడుదలై మంచి రెస్పాన్స్ వచ్చింది.
ALSO READ:
- రాష్ట్రపతిని ఎలా, ఎవరు ఎన్నుకుంటారో మీకు తెలుసా..?
- సౌందర్య ఎక్స్పోజింగ్ చేయకపోవడానికి కారణం అదేనా..? విస్తుపోయే విషయాలు వెల్లడించిన నటి ఆమని..!