Home » రాష్ట్రపతిని ఎలా, ఎవరు ఎన్నుకుంటారో మీకు తెలుసా..?

రాష్ట్రపతిని ఎలా, ఎవరు ఎన్నుకుంటారో మీకు తెలుసా..?

by Sravanthi
Ad

భారతదేశంలో 15 వ రాష్ట్రపతిగా ఒరిస్సా గిరిపుత్రిక ద్రౌపది ముర్ము ఎన్నిక లాంఛనమే అని చెప్పవచ్చు. బిజెపికి తిరుగులేని మద్దతు ఉండడమే కాకుండా ఎన్డిఏ భాగస్వామ్య పక్షాలతో ముర్ము ప్రెసిడెంట్ గా ఎన్నిక కావడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇదంతా పక్కన బెడితే చాలా మందికి రాష్ట్రపతి ఎన్నికలు ఎలా జరుగుతాయి అనే విషయం తెలియదు.. సాధారణంగా సర్పంచ్ నుంచి ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికల వరకు 18 సంవత్సరాలు నిండిన ఓటుహక్కు ఉన్నవారు ఓటు వేస్తే వీళ్లు ఎన్నికవుతారు. ఇది అందరికీ తెలుసు కానీ రాష్ట్రపతి ని ఎవరు ఎన్నుకుంటారు అనేది ఓ సారి చూద్దాం.. భారత రాష్ట్రపతి ని లోక్ సభ, రాజ్యసభకు ఎన్నికైన ఎంపీలతో పాటుగా అన్ని రాష్ట్రాల అసెంబ్లీలో ఎన్నికైన ఎమ్మెల్యేలు ఓట్లు వేస్తారు. రాజ్యసభలో 233 మంది, లోక్ సభలో 543 మంది ఏంపీ లు ఉంటారు. అన్ని రాష్ట్రాల్లో కలిపి ఎమ్మెల్యేలు 4120 మంది ఉన్నారు.

Advertisement

అంటే మొత్తం రాష్ట్రపతిని ఎన్నుకునే వారి సంఖ్య 4896 మంది. రాష్ట్రపతిని ఎన్నుకునేందుకు సభ్యులందరినీ కలిపి ఎలక్ట్రోల్ కాలేజ్ మెంబర్స్ గా పిలుస్తారు. ఎంపీలు పార్లమెంటులో ఎమ్మెల్యేలు వారి వారి రాష్ట్రాల అసెంబ్లీ లలో ఓట్లు వేస్తారు. ఎంపీలకు గ్రీన్ బ్యాలెట్ స్లీప్స్, ఎమ్మెల్యేలకు పింక్ బ్యాలెట్ స్లిప్స్ ఇస్తారు. అందరూ బ్యాలెట్ పేపర్ ద్వారానే ఓటు వేయాల్సి ఉంటుంది. ఒక ఓటరు ఒక్క ఓటు కాకుండా ప్రాధాన్య క్రమంలో బరిలో ఉన్న అభ్యర్థులందరికీ నెంబర్లతో స్లిప్ మీద మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు నలుగురు అభ్యర్థులు బరిలో ఉంటే ఏ అభ్యర్థి కైతే మొదటి ప్రాధాన్యత ఓటు వేస్తారో స్లిప్ మీద ఒకటో నెంబర్ వేయాల్సి ఉంటుంది. అలాగే మిగతా అభ్యర్థులకు కూడా నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఓటు విలువ ఒక్కొక్క రాష్ట్రానికి మారుతూ ఉంటుంది. అత్యధికంగా అసెంబ్లీ పార్లమెంటు సీట్లు ఉన్న యూపి ఎలక్ట్రోరల్ కాలేజీ నెంబర్స్ ఓటు విలువ 208.

Advertisement

అతి తక్కువ స్థానాలు ఉన్న అరుణాచల్ ప్రదేశ్లో ఆ విలువ 8. తెలంగాణలో ఎలక్టోరల్ కాలేజీ నెంబర్స్ ఓటు విలువ 131. 95 అంటే 132 కు దగ్గరగా ఉంటుంది. రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు విలువను 1971 జనాభా లెక్కల ప్రకారం లెక్కిస్తారు. ఆ లెక్క ప్రకారం చూసుకుంటే 1971లో తెలంగాణ జనాభా కోటి 57 లక్షల రెండు వేల 122 . తెలంగాణ మొత్తం జనాభా 15702122 /119 ×1000 గణిస్తే వచ్చేదే తెలంగాణ ఎలక్ట్రోరల్ కాలేజ్ నెంబర్స్ ఓటు విలువ. ఇక రాష్ట్రపతి ఎన్నికల్లో మొత్తం పది లక్షల 98 వేల 903 ఓట్లు ఉంటాయి. ఇందులో సగం అంటే ఐదు లక్షల 49 వేల 442 ఓట్లు వచ్చిన అభ్యర్థి రాష్ట్రపతిగా గెలిచే అవకాశం ఉంది. ఇందులో పోలైన ఓట్లనే పరిగణలోకి తీసుకుంటారు. అందులో సగం వచ్చిన వారిదే గెలుపు. అంతకుమించి ఒక్క ఓటు తక్కువ గా వచ్చిన ఆ ఎన్నిక చెల్లదు.

ALSO READ:

Visitors Are Also Reading