Home » ట్రంప్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు..అందుకోస‌మేనా..?

ట్రంప్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు..అందుకోస‌మేనా..?

by Anji
Ad

అమెరికా అధ్యక్ష ఎన్నిక‌ల కోసం ముందు నుంచే ప్ర‌చారం ప్రారంభించాల‌ని భావిస్తున్న మాజీ అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌న‌కు గ‌డ్డు ప‌రిస్థితులు ఎదురుకాబోతున్నాయి. క్యాపిట‌ల్ హిల్ దాడి వ్య‌వ‌హారంలో ట్రంప్ చుట్టూ ఉచ్చు గ‌ట్టిగానే బిగుస్తుంద‌నే చెప్పాలి. ఆగ్ర‌హంతో ఉన్న గుంపుతో తాను కూడా చేరాల‌ని ట్రంప్ భావించారు. ఈ మేర‌కు స్ప‌ష్ట‌మైన ఆధారాలు ఉన్నాయ‌ని తాజాగా ఆదాడిపై విచార‌ణ చేప‌ట్టిన క‌మిటీ ఓ నిర్థార‌ణకు వ‌చ్చింది.

Advertisement

అప్‌డేట్ కోసం ఎదురు చూడాల‌ని విచార‌ణ క‌మిటీ స‌భ్యుడు ఆడ‌మ్ కింజింగ‌ర్ తెలిపారు. 2021, జ‌న‌వ‌రి 06 క్యాపిట‌ల్ భ‌వ‌నంపై దాడికి య‌త్నించారు. దానికి కార‌ణ‌మైన ఆగ్ర‌హ జ్వాల‌ల‌ను మాజీ అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంఫ్ ఎగ‌దోశార‌నే ఆరోప‌ణ‌లున్నాయి. ఈ ఘ‌ట‌న‌పై విచార‌ణ చేప‌ట్టిన క‌మిటీకి ఉపాధ్య‌క్షురాలిగా రిప‌బ్లిక‌న్ పార్టీ స‌భ్యురాలు లిజ్ ఛెనీ ఆరోప‌ణ‌ల‌ను ధృవీక‌రించారు. ట్రంప్ ఆ ప‌ని చేయ‌లేద‌న్న‌ది ఆమె ఆరోప‌ణ‌. ఆయ‌న హ‌యాంలో ప‌ని చేసిన అధికారుల‌తో స‌హా ఎంతో మంది ఆయ‌న‌కు వ్య‌తిరేకంగా సాక్షం చెప్పారు. ఈ వ్య‌వ‌హారంపై మ‌రో రెండు వాద‌న‌లు జ‌రుగ‌నున్నాయి. త‌ద్వారా ఇప్ప‌టిదాకా సేక‌రించిన ఆధారాల‌తో ట్రంప్ పాత్ర‌ను బ‌లంగా చూపించి ఆయ‌న‌కు ప‌క్కాగా దోషిగా నిల‌బెట్టే ప్ర‌య‌త్నాలు చేయ‌బోతుంది.

Advertisement


అధ్యక్షునిగా వైట్‌హౌస్‌లో ఆయ‌న కుటుంబ స‌భ్యులు గ‌డిపిన చివ‌రి రోజుల‌ను సైతం ప‌రిశీలించ‌నున్న‌ది. ముఖ్య‌మైన‌ డాక్యుమెంట్ల‌ను ఆయ‌న నాశ‌నం చేసార‌నే ఆరోప‌ణ‌ల మేర‌కు ఈ ప‌ని చేయ‌బోతుంది. ఓవైపు విచార‌ణ మొత్తం రాజ‌కీయ బూట‌కం అని ట్రంప్ కొట్టిపారేస్తున్నారు. మ‌రోవైపు 2024లో అద్య‌క్ష‌, ఎన్నిక‌లు జ‌రుగుతుండ‌గా.. 2020 ఓట‌మితో సంబంధం లేకుండా బ‌రిలోకి దిగుతాం అని ట్రంప్ చెబుతున్నారు. ఒక‌వేళ క్యాపిట‌ల్ భ‌వ‌నం దాడి విష‌యంలో ఏదైనా ప్ర‌తికూల తీర్పు వ‌స్తే మాత్రం పోటీకి ఆయ‌న అర్హ‌త కోల్పోవ‌డం మాత్ర‌మే కాదు. రాజ‌ద్రోహం కింద ప‌డే శిక్ష ప‌డిన అవ‌కాశాలు ఉన్నాయ‌ని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు.

Also Read : 

న‌రేష్‌కు ఎన్ని కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయంటే..?

 

Visitors Are Also Reading