Home » న‌రేష్‌కు ఎన్ని కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయంటే..?

న‌రేష్‌కు ఎన్ని కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయంటే..?

by Anji
Ad

న‌రేష్‌, ప‌విత్ర లోకేష్ గ‌త కొద్ది రోజులుగా టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌. గ‌త కొద్ది నుండి తెలుగు మీడియాలో వీరిద్ద‌రి గురించి ర‌క‌ర‌కాల ప్ర‌చారాలు జ‌రుగుతున్నాయి. వీరిద్ద‌రికీ పెళ్లి జ‌రిగింద‌ని ఒక‌సారి, స‌హ‌జీవ‌న‌మ‌ని మ‌రొక ఇలా ర‌క‌ర‌కాలుగా ఎవ‌రికీ తోచిన విధంగా రూమ‌ర్స్ క్రియేట్ చేయడం.. ప‌లు క‌థ‌నాలు రావ‌డంతో సోష‌ల్ మీడియాలో వీరి ట్రెండ్ కొన‌సాగుతుంది ఇప్పుడు. ఇక న‌రేష్ భార్య ర‌మ్య కూడా తెర‌పైకి రావ‌డంతో ఈ వివాదం మ‌రింత‌గా ముదిరింది. జులై 03న న‌రేష్‌-ప‌విత్ర లోకేష్ ఉన్న హోటల్ వ‌ద్ద‌కు వెళ్లిన ర‌మ్య ర‌చ్చ చేసారు. అంతేకాదు ప‌విత్ర‌పై చెప్పుతో దాడి చేసేందుకు కూడా య‌త్నించింది. పోలీసులు దాడి చేయ‌కుండా అడ్డుకున్నారు.

 


న‌రేష్ వ్య‌వ‌హారంలో ప్ర‌స్తుతం ర‌క‌ర‌కాల వార్త‌లు వినిపిస్తున్నాయి. న‌రేష్‌కు విలువైన ఆస్తులు ఉన్నాయ‌ని అందుకే ఇదంతా జ‌రుగుతుంద‌ని, టాలీవుడ్‌లో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. వంద‌ల కోట్ల ఆస్తి ఉండ‌డం వ‌ల్ల‌నే ఇదంతా జ‌రుగుతుంద‌ని టాక్ వినిపిస్తోంది. ప్ర‌ముఖ న‌టి విజ‌య నిర్మ‌ల కుమారుడు న‌రేష్ ప‌లు తెలుగు చిత్రాల్లో హాస్య ప్ర‌ధాన పాత్ర‌లు పోషించాడు. జంధ్యాల ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ప‌లు చిత్రాల్లో న‌టించి ప్రేక్ష‌కుల‌ను మెప్పించారు. న‌రేష్ త‌ల్లి విజ‌య‌నిర్మ‌ల అప్ప‌ట్లో స్టార్ హీరోయిన్ అనే విష‌యం అంద‌రికీ తెలిసిందే. విజ‌య నిర్మ‌ల సూప‌ర్ స్టార్ కృష్ణ‌తో క‌లిసి ఎన్నో సినిమాల్లో న‌టించి ఆమె త‌న మొద‌టి భ‌ర్త‌ను వ‌దిలి కృష్ణ‌ను రెండ‌వ పెళ్లి చేసుకున్నారు. సూప‌ర్ స్టార్ కృష్ణ తొలి భార్య ఇందిరాదేవిని ఒప్పించి రెండ‌వ పెళ్లిని చేసుకున్నారు.

Advertisement

Advertisement

విజ‌య నిర్మ‌ల మ‌ర‌ణించిన త‌రువాత ఆమె ఆస్తుల‌న్ని న‌రేష్‌కు వ‌చ్చాయి. న‌రేష్ దాదాపుగా 50 ఏళ్లు నుంచి ఇండ‌స్ట్రీలో ఉంటూ ఆయ‌న కూడా బాగానే ఆస్తుల‌ను పోగుచేశారు. న‌రేష్‌కు దాదాపు 200 కోట్ల ఆస్తి ఉంటుంద‌ని స‌మాచారం. ఖ‌రీదైన కార్లు ఉన్నాయి. ఆయ‌న ద‌గ్గ‌ర నాలుగు కాస్ట్లీ కార్లున్న‌ట్టు స‌మాచారం. ఇటీవ‌లే న‌రేష్ ఖ‌రీదైన స్పోర్ట్స్ కారును కొనుగోలు చేశార‌ట‌. న‌రేష్‌కు ఖ‌రీదు అయిన ఇండ్లు కూడా ఉన్నాయి. హైద‌రాబాద్‌తో పాటు చెన్నైలో కూడా ఖ‌రీదైన ఇండ్లు, ప్లాట్లు, ఫాంహౌజ్‌లు ఉన్న‌ట్టు స‌మాచారం. ప్ర‌తి సినిమాకు దాదాపు రూ.50ల‌క్ష‌ల వ‌ర‌కు రెమ్యున‌రేష‌న్ తీసుకుంటార‌ట‌. అదేవిధంగా న‌రేష్‌కు ల‌గ్జ‌రీ కార్వాన్ కూడా ఉందంట‌. స్టార్ హీరోల రేంజ్‌లో కార్వాన్ ను మెంటైన్ చేస్తున్నారంట‌. న‌రేష్ కార్వాన్ విలువ రూ.5కోట్లు అని స‌మాచారం. ప్ర‌త్యేకంగా ఆయ‌న ముంబై నుంచి తెప్పించుకున్న‌ట్టు తెలుస్తోంది. కార్వాన్ లోప‌ల ఆయ‌న‌కు స‌క‌ల సౌక‌ర్యాలుంటాయ‌ని ఈ ఫోటోలు కూడా సొష‌ల్ మీడియాలో వైర‌ల‌య్యాయి. అందుకే ర‌మ్య ర‌ఘుప‌తి న‌రేష్‌ను వ‌దిలించుకోవ‌డానికి అంత‌గా ఇష్ట‌ప‌డ‌డం లేదు.

Also Read : 

మీనా త‌న భ‌ర్త‌పై గ‌తంలో చేసిన పోస్ట్ వైర‌ల్..అందులో ఏముందంటే..!

పొన్నియిన్ సెల్వ‌న్ నుంచి మ‌రో కొత్త లుక్‌.. విక్ర‌మ్ ఎలా ఉన్నారంటే..?

 

Visitors Are Also Reading