Home » ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పుచ్చకాయ.. ధర ఎంతో తెలిస్తే షాకే..!!

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పుచ్చకాయ.. ధర ఎంతో తెలిస్తే షాకే..!!

by Sravanthi
Ad

ఎండాకాలంలో ఎక్కువగా మార్కెట్ లో ఉండే పండ్లలో పుచ్చకాయ ఒకటి. దీనిలో వాటర్ సోర్స్ ఎక్కువగా ఉండడం వల్ల దీన్ని ఎండాకాలం చాలా ఇష్టపడి తింటారు. అయితే ఈ పుచ్చకాయలు ఈ టెక్నాలజీ యుగంలో అన్ని కాలాల్లో దొరుకుతున్నాయి. కానీ ఎండాకాలంలో పండే పుచ్చకాయలు మాత్రమే చాలా టేస్టీగా ఉంటాయి. అయితే పుచ్చకాయ మన దగ్గర అయితే 20 నుంచి 50 వరకు ధర పలుకుతుంది. ఇంకా పెద్దది అయితే 50 నుంచి 100 వరకు అనుకుందాం. కానీ లక్షల్లో రేటు ఉండే పుచ్చకాయను మీరు ఎప్పుడైనా చూసారా.. మీరిన్నది నిజమేనండి.. దాని ధర లక్షల్లో ఉంది.. మరెక్కడో తెలుసుకుందామా..!

వేసవిలో పుచ్చకాయ తింటే దాహం తీరుస్తుంది. అయితే ఈ వాటర్ మిలాన్స్ ఎక్కువ ఎరుపు రంగులోనే ఉంటాయి. కానీ ప్రపంచం మొత్తం పన్నెండు వందల రకాలకు పైగా పుచ్చ కాయలు ఉన్నాయి. వీటి ధర కిలోకు 20 రూపాయల నుంచి వంద వరకు పలుకుతోంది. ఇందులో ముఖ్యంగా డేన్పుకే బ్లాక్ రకం పుచ్చకాయ అత్యంత ఖరీదైనది. మరి దానికి ఎందుకు అంత ధర పలుకుతుందో తెలుసుకుందామా..?

Advertisement

Advertisement

ఈ పుచ్చకాయ ఉత్తర ద్వీపం హాక్కాయిడో లో మాత్రమే లభిస్తాయి. తక్కువ పరిమాణంలో ఏడాదికి వంద యూనిట్లు మించకుండా పెరిగే ఈ పండ్లు ఇక్కడ లభించవు. అందుకే దీన్ని అత్యంత ఖరీదైన పుచ్చకాయగా అభివర్ణిస్తారు. దీన్ని వేలం వేసి మరీ విక్రయిస్తారు. అయితే 2019 750,000జపనిస్ యోన్ కు వేలంలో విక్రయించబడే ప్రపంచంలోనే అత్యధిక ఖరీదైన పుచ్చకాయ రికార్డు కొల్లగొట్టింది. కరోనా కారణంగా గత రెండు సంవత్సరాలలో ధరలు పడిపోయిన కానీ ఇది ఖరీదైన పుచ్చకాయ గానే కొనసాగుతోంది. ఇది ఇతర వాటర్ మిలన్ కంటే ఎక్కువ తీయగా, తక్కువ విత్తనాలు కలిగి ఉంటుంది.

ALSO READ:

ఎండ తీవ్ర‌త‌కు మీ శ‌రీరాన్ని యాక్టివ్‌గా మార్చే ఎన‌ర్జిటిక్ డ్రింక్ ఇదే..!

సింహాలు ముసలివయ్యక ఎందుకు ఆత్మహత్య చేసుకుంటాయి.. కారణం ఇదేనా..?

 

Visitors Are Also Reading