బాహుబలి దెబ్బకు ఇండియన్ల టేస్ట్ మారిపోయింది. ఎక్కడ చూసినా ఇప్పుడు బాహుబలి ఒక ట్రెండ్‌గా మారిపోయింది. ప్రభాస్ ప్రతి దానికి ఒక బ్రాండ్ అంబాసిటర్ అయిపోయాడు. స్వతహాగా ప్రభాస్ భోజన ప్రియుడు కావడంతో ఒక హోటల్ వాళ్లు ఇప్పుడు బాహుబలి థాలి మొదలు పెట్టారు. దీనికి బహుమతి కూడా పెట్టారు. ముఖ్యంగా 30 నిమిషాల్లో ప్లేట్ ఖాళీ చేస్తే బహుమతిని అందజేస్తారు. కూర్చొని తింటే లక్ష రూపాయల బహుమతి అందజేయనున్నారు.
Also Read : జయసుధ కాఫీలో మోషన్ టాబ్లెట్స్..వారి అరాచకాలను బయటపెట్టిన నటుడు
Advertisement
తాజాగా విజయవాడకు చెందిన ఒక రెస్టారెంట్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. తమ రెస్టారెంట్లో వడ్డించే థాలిని తినగలిగే కస్టమర్లకు లక్ష రూపాయలు బహుమతిగా ఇస్తామని చెప్పింది. కూర్చొని తిని లక్ష రూపాయలు సంపాదించాలంటే నాయుడు గారి కుండ బిర్యానికి రండి అంటూ ఫేస్బుక్లో ఒక ప్రకటన ఇచ్చారు. ఆ వీడియోలో పెద్ద ప్లేట్, కుండ బిర్యానీ, రకరకాల కూరలు, స్వీట్లు, నూడిల్స్ వంటి రకరకాల వంటకాలున్నాయి. అంతేకాదు ఈ థాలిలో నాలుగు రకాల డ్రింక్స్ కూడా ఉన్నాయి.
Advertisement
Also Read : కేంద్ర బడ్జెట్ 2022: ధరలు పెరిగేవి, తగ్గేవి ఏవో తెలుసా..?
ఈ థాలిని ఎవరైనా 30 నిమిషాల్లో పూర్తి చేయగలిగితే.. లక్ష రూపాయలు గెలుచుకోవచ్చు. సోషల్ మీడియాలో షేర్ చేసిన ఈ వీడియో ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో వైరల్ అవుతుంది. ఇందులో ఐటమ్స్ చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. ఇవన్ని 30 నిమిషాల్లో ఇద్దరు వ్యక్తులు తినడం చాలా కష్టమని పలువురు పేర్కొంటున్నారు. చాలా మంది భోజన ప్రియులు ఈ థాలిని తినడానికి ప్రయత్నం చేసి విఫలం చెందుతున్నారు. కానీ ఒక యువకుడు మాత్రం బాహులి థాలిలో పెట్టిన అన్ని ఐటమ్స్ తిని రూ.లక్ష గెలుచుకోవడం విశేషం. ప్రస్తుతం ఈ పోటీలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.