Telugu News » Blog » కేంద్ర బడ్జెట్ 2022: ధరలు పెరిగేవి, త‌గ్గేవి ఏవో తెలుసా..?

కేంద్ర బడ్జెట్ 2022: ధరలు పెరిగేవి, త‌గ్గేవి ఏవో తెలుసా..?

by Anji
Ads

కేంద్ర‌ప్ర‌భుత్వం మంగ‌ళ‌వారం ప్ర‌వేశ‌పెట్టిన బ‌డ్జెట్ 2022ను ఆవిష్క‌రించింది. ఈమేర‌కు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామన్‌ లోక్‌స‌భ‌లో బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్టారు. కేంద్ర బ‌డ్జెట్ ప్ర‌కారం.. కొన్ని వ‌స్తువుల ధ‌ర‌లు పెరుగ‌నున్నాయి. అదేవిధంగా కొన్ని వస్తువుల ధ‌రలు త‌గ్గ‌నున్నాయి. కొన్నింటిపై క‌స్ట‌మ్ సుంకం త‌గ్గించ‌గా.. కొన్నింటిపై క‌స్ట‌మ్ సుంకం పెంచారు. అందువ‌ల్ల ధ‌ర‌ల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి.

 

ధ‌ర‌లు త‌గ్గే వ‌స్తువుల జాబితా

మొబైల్ ఫోన్లు, మొబైల్ ఫోన్ చార్జ‌ర్లు, మొబైల్ ఫోన్ చార్జింగ్ ట్రాన్స్‌ఫార్మ‌ర్లు, వ‌జ్రాలు, ర‌త్నాలు, ప‌లు ర‌కాల ఇమిటేష‌న్ జ్యూవెల‌రీ, పెట్రోలియం ప‌రిశ్ర‌మ‌ల్లో ఉప‌యోగించే కెమిక‌ల్స్‌, మిథ‌నాల్‌, కెమెరా లైసెన్స్‌, స్టీల్ స్క్రాప్‌, వ్య‌సాయ ప‌రిక‌రాలు, దుస్తులు, పాద‌ర‌క్ష‌లు, విదేశీ యంత్రాల‌కు సంబంధించిన సామాగ్రి, తోలు వ‌స్తువులు వంటివి ఉన్నాయి.

ధ‌ర‌లు పెరిగే వ‌స్తువుల జాబితా

ఇత‌ర దేశాల నుండి దిగుమ‌తి చేసుకునే వ‌స్తువులు, విదేశీ గొడుగులు, క్రిస్టో లావాదేవీలు వంటివి పెర‌గ‌నున్నాయి.

Also Read : జయసుధ కాఫీలో మోషన్ టాబ్లెట్స్..వారి అరాచ‌కాల‌ను బ‌య‌ట‌పెట్టిన న‌టుడు

కేంద్ర ప్ర‌భుత్వం ఈ బడ్జెట్లో ప‌న్ను చెల్లింపు దారుల‌కు తీపి క‌బురు అందించింది. కొత్త ఫెసిలిటిని అందుబాటులోకి తీసుకొస్తున్న‌ట్టు వెల్ల‌డించింది. ఐటీఆర్‌లో త‌ప్పులు ఉంటే వాటిని స‌రిచేసుకోవ‌డానికి మ‌రింత గ‌డువు ఇచ్చింది. రెండేండ్ల గ‌డువు ఇస్తున్న‌ట్టు ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ తెలిపారు. సాధార‌ణంగా ప‌న్ను చెల్లింపు దారుల‌కు డిసెంబ‌ర్ 31 వ‌ర‌కు గ‌డువు ఇస్తారు. బ‌డ్జెట్ ప్ర‌తిపాద‌న ప్ర‌కారం.. చూస్తే సంబంధిత అసెస్‌మెంట్ ముగిసిన త‌రువాత రెండేండ్ల వ‌ర‌కు గ‌డువు ల‌భించ‌నున్న‌ది.


You may also like