భారత రత్న అవార్డు గ్రహీత, పాపులర్ సింగర్ లతా మంగేష్కర్ దేశంలో అత్యున్నత స్థాయిలో హోదా సంపాదించి ఇటీవలే అనారోగ్యంతో పోరాడి ముంబైలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా లతా మంగేష్కర్ మాట్లాడిన చివరి మాటలను ఇప్పుడు తెలుసుకుందాం.
Advertisement
ఈ లోకంలో మరణాన్ని మించిన సత్యం మరేది లేదు. అత్యంత విలువైన బ్రాండ్ కారు నా ఇంటి గెరేజ్‌లో ఉంది. నేను చక్రా కుర్చిలో తిరుగుతున్నాను. విలువైన వస్త్రాలు, విలువైన అలంకార సాధనాలు, విలువైన రకరకాల పాద రక్షలు, అమూల్యమైన వస్తువులన్నీ నా ఇంట్లో పడి ఉన్నాయి. కానీ ఆసుపత్రిలో వారు ఇచ్చిన చిన్న గౌన్ వేసుకుని ఉన్నాను.
Advertisement
నా బ్యాంకు అకౌంట్‌లో చాలా డబ్బు ఉంది. కానీ నాకు ఇప్పుడు అది ఉపయోగం లేదు. నా ఇల్లు ఒక రాజభవనంలా ఉంది. కానీ నేను ఆసుపత్రిలో ఒక చిన్న పడక మీద ఉన్నాను. ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద స్టార్ హోటళ్ల అన్నింటికీ ప్రయాణం చేసేదాన్ని. ఆసుపత్రిలో ఆ టెస్ట్‌కు, ఈటెస్ట్‌కు ల్యాబ్‌లకు మారి మారి వెళ్లుతున్నాను. ఆనాడ నిత్యం శిరోజాలంకరణ వారు వచ్చి శిరోజాలు అలంకరించేవారు. ఈ నాడు నాకు శిరస్సుపై శిరోజాలే లేవు.
ప్రసిద్ధి చెందిన హోటళ్లలోని ఆహారం తింటూ ఉండే దానిని. ప్రత్యేక జెట్ విమానాల్లో ప్రపంచమంతా తిరిగేదాన్ని. కానీ నేడు ఆసుపత్రి వరండా దాకా వెళ్లడానికి ఇద్దరూ అటెండర్లు సాయం చేస్తూ ఉన్నారు. ఏమి సంపదా, వసతులు ఏవీ నాయకు సహాయపడలేదు. ఏ విధమైన ఓదార్పునివ్వలేదు. కొంత మంది ఆత్మీయుల ఆత్మీయత, ఆప్యాయత, వారి ప్రార్థనలు నాకు జీవం పోస్తున్నాయి. ఇంతేనండి జీవితం. ఎవరికీ ఏ సాయం చేయలేని ధనం, ఆస్తులు, పదవీ ఉన్నా అంత్య దశలో ఉపయోగపడని వాటికి విలువ ఇవ్వకండి. ముఖ్యంగా మంచి మనస్సు ఉన్నవారికి విలువ నిచ్చి అందరికీ స్నేహం, ఆప్యాయతా ప్రేమ చూపించండి అని మాట్లాడినట్టు ఓ మీడియా సంస్థ వెల్లడించింది.
Also Read : ఎన్టీఆర్ అన్న ఆ మాటతో తాను ఏమిటో నిరూపించుకున్న రామానాయుడు..!