Telugu News » JABARDASTH : ‘జబర్దస్త్’ లో ఒక్కో ఎపిసోడ్ కి పారితోషికం ఎంతో తెలుసా ?

JABARDASTH : ‘జబర్దస్త్’ లో ఒక్కో ఎపిసోడ్ కి పారితోషికం ఎంతో తెలుసా ?

by AJAY MADDIBOINA
Published: Last Updated on

తెలుగు కామెడీ షోల‌లో జబర్దస్త్ ఒక సంచలనం. ఈ కామెడీ షో కు వచ్చిన రెస్పాన్స్ ఇప్పటివరకు ఇతర ఏ కామెడీ షో కు కూడా రాలేదనే చెప్పాలి. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో ఇప్పటి వరకు 100 ఎపిసోడ్లు పూర్తి చేసుకుంది. ఈ షో ద్వారా యాంకర్ అనసూయకు మాత్రమే కాకుండా రష్మి మరియు ఇతర కమెడియన్ లకు సైతం లైఫ్ వ‌చ్చింది అన‌డంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. అయితే ప్రస్తుతం జబర్దస్త్ కి పోటీగా అనేక కామెడీ షో లు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో జబర్దస్త్ రెమ్యూనరేషన్ లలో మార్పులు చేసినట్టు తెలుస్తోంది. ఆ వివ‌రాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Ads

ALSO READ : ఎన్టీఆర్ అన్న ఆ మాట‌తో తాను ఏమిటో నిరూపించుకున్న రామానాయుడు..!

Roja

Roja

జబర్దస్త్ ప్రారంభం నుండి జడ్జిగా వ్యవహరిస్తున్న రోజా మొన్నటి వరకు ఒక ఎపిసోడ్ కు మూడు నుంచి నాలుగు లక్షలు తీసుకునేవారట. కానీ నాగబాబు వెళ్ళిన తర్వాత ఆమె రెమ్యున‌రేష‌న్ డబల్ చేశారని స‌మాచారం. ప్రస్తుతం రోజా ఒక్కో ఎపిసోడ్ కు 8ల‌క్ష‌ల రెమ్యున‌రేషన్ తీసుకుంటున్నట్టు టాక్.

Also Read:  CM గా ఉండి NTR న‌టించిన సినిమా! షూటింగ్ స్పాట్ కే ఫైల్స్!!

ఇక నాగబాబు స్థానంలో సింగ‌ర్ మ‌ను జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. జబర్దస్త్ జడ్జిగా వ్యవహరిస్తున్న మ‌ను ప్రస్తుతం ఒక ఎపిసోడ్ కు రెండు లక్షల రెమ్యున‌రేష‌న్ తీసుకుంటున్న‌ట్టు టాక్.

jabardasth anasuya

jabardasth anasuya

జబర్దస్త్ సక్సెస్ లో అనసూయ కూడా ముఖ్యమైన పాత్ర పోషించింది. యాంకర్ అనసూయ మొన్నటి వరకు ఎపిసోడ్ కు 50 నుండి 80వేలు తీసుకునేవారట. కానీ ఇప్పుడు ఆమె రెమ్యున‌రేష‌న్ లక్ష దాటిందని సమాచారం.

Also Read: అంత ఎమోషనల్ సీన్ ని కామెడీ చేసారు కదరా ! చూస్తే నవ్వు ఆపుకోలేరు ..!

Anchor Rashmi

ఎక్స్ ట్రా జబర్దస్త్ కు యాంకర్ గా వ్యవహరిస్తున్న రష్మి కి కూడా భారీగానే రెమ్యూనరేషన్ అందుతోంది. రష్మీ ఒక ఎపిసోడ్ కు లక్షకుపైగా పుంజుకుంటుందని తెలుస్తోంది.

జబర్దస్త్ లో మోస్ట్ పాపులర్ కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్న హైపర్ ఆది టింకు ఒక ఎపిసోడ్ కు 2.5 లక్షల రేషన్ ఇస్తున్నట్టుగా సమాచారం.

sudheer

sudheer

జబర్దస్త్ ద్వారా సుధీర్ కూడా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. అయితే సుదీర్ కు అప్పట్లో 3 నుండి 3.5 లక్షల రెమ్యున‌రేష‌న్ ఇచ్చేవారట. ఇప్పుడు సుధీర్ రెమ్యున‌రేష‌న్ ను 4 లక్షల వరకు పెంచినట్టు సమాచారం.

జబర్దస్త్ ప్రారంభించినప్పటి నుండి రాకెట్ రాఘవ ఉన్నారు. కొంత మంది కమెడియన్లు షోలు మారినప్పటికీ రాఘవ మాత్రం జబర్దస్త్ లోనే స్థిరంగా ఉండి పోయారు. ఇక రాఘవ ఒక్కో ఎపిసోడ్ కు 2.5 లక్షల రెమ్యున‌రేష‌న్ ను అందుకుంటున్నార‌ట‌.


చలాకి చంటి ఒక ఎపిసోడ్ కు రెండు లక్షల రెమ్యున‌రేష‌న్ తీసుకుంటున్నారట.


You may also like