ఈ మధ్య కాలంలో దేశంలో జరుగుతున్న కొన్ని సంఘటనల గురించి వింటుంటే ఇలాంటి వారు కూడా ఉంటారా..? అని ఒకింత ఆశ్చర్యం కలుగుతుంది. కష్టపడి భార్యను చదివించి ఓ భర్త నర్సును చేయగా భార్య మాత్రం నల్లగా ఉన్నాడనే సాకు చూపుతూ అతన్ని వదిలేసింది. ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకున్న ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఉత్తరప్రదేశ్ లోని రవీంద్రపురం గ్రామంలో నివసించే అర్జున్ కి ఆరేళ్ల కిందట సవిత మౌర్య అనే యువతితో పెళ్లి జరిగింది.
Advertisement
భార్యకు చదువుపై ఆసక్తి ఉండటంతో.. అతను పేదవాడు అయినప్పటికీ అర్జున్ ఎంతో కష్టపడి ఫీజులు చెల్లించి భార్యను నర్సింగ్ చదివించాడు. అప్పులు చేసి మరీ భార్యను చదివించిన అర్జున్ భార్యకు మంచి ఉద్యోగం వస్తే.. కుటుంబ కష్టాలు తీరుతాయని సంతోషంగా జీవనం సాగించవచ్చని భావించాడు. తాను ఒకటి తలిస్తే దేవమొకటి తలచిందనే విధంగా అర్జున్ జీవితంలో ఊహించని మార్పులను చోటు చేసుకున్నాయి. అర్జున్ భార్య నర్సు ఉద్యోగం సంపాదించింది. ఉద్యోగం వచ్చిన తరువాత సవిత మరో ప్రముఖ ఆసుపత్రిలో ఉద్యోగంలో చేరడంతో ఆమె వేతనం భారీగా పెరిగిపోయింది. దీంతో తనను చాలా కష్టపడి చదివించిన భర్తను గౌరవించడానికి బదులుగా ఆ యువతి తన భర్త నల్లగా ఉన్నాడంటూ.. అతడి ముందే హేళన చేస్తూ కామెంట్స్ చేసింది.
Advertisement
నా స్టేటస్ కి నీ స్టేటస్ కి సూట్ కాదు అంటూ సూటిపోటీ మాటలతో అతన్ని బాధపెట్టేది. ప్రతీ నెల రేయింబవళ్లు శ్రమించి కష్టపడి చదివిస్తే భార్య ఇలా చేయడంతో అర్జున్ ని ఎంతో బాధపెట్టింది. ఏమి చేయాలో తెలియని దిక్కుతోచని పరిస్థితిలో మీడియాను ఆశ్రయించి.. తన గోడును వెల్లబోసుకున్నాడు. తన భార్య సక్సెస్ లో తన సక్సెస్ చూసుకున్న భర్తతో సదరు యువతి ఇంత కఠినంగా వ్యవహరించడం సరికాదని.. కామెంట్స్ వ్యక్తమవుతున్నాయి. రంగును కాకుండా సవిత గుణాన్ని చూడాలని కామెంట్స్ వినిపిస్తున్నాయి. భర్త ఆరోపణలపై సవిత ఎలా స్పందిస్తారో వేచి చూడాలి మరీ.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
Nagarjuna: ఒకప్పుడు టాలీవుడ్ ని షేక్ చేసిన ఆ జంట.. మళ్ళీ కలిసి నటిస్తున్నారా?