Home » వైసీపీలోని ఆ నేతలకు ఆశలు రెట్టింపు.. గుర్రం గాలిలో ఎగురొచ్చు..!

వైసీపీలోని ఆ నేతలకు ఆశలు రెట్టింపు.. గుర్రం గాలిలో ఎగురొచ్చు..!

by Anji
Ad

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఇక పార్లమెంట్ ఎన్నికలు సీజన్ ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్ లో మాత్రం అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ఒకేసారి నిర్వహించనున్నడంతో రాజకీయాలు రోజు రోజుకు వేడెక్కుతున్నాయి. అధికార వైసీపీ మార్పులు, చేర్పులు చేపడుతోంది. రెండు నెలల సమయం ఉండటంతో ఇప్పటి నుంచే ఆశావాహులుకష్టపడితే హై కమాండ్ మనస్సులో స్థానం సంపాదించలేమా..? బీ ఫారమ్ తెప్పించుకోలేమా..? కొంత మందికి మాత్రమే సిట్టింగ్ లకు టికెట్లు కేటాయిస్తున్నారు సీఎం జగన్. మిగిలిన వారికి స్థానం మార్పులు, పదవీ మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటున్నాయి.

Advertisement

పిఠాపురం వైసీపీ టికెట్‌పై సిట్టింగ్ ఎమ్మెల్యే పెండెం దొరబాబు ఇప్పటికీ ధీమాతో ఉన్నారు. ఆ స్థానంలో వంగా గీతను ఇన్‌చార్జ్‌గా నియమించింది అధిష్టానం. కానీ.. ఇన్‌చార్జ్‌లు, కోఆర్డినేటర్లందరూ అభ్యర్థులు కాబోరంటున్న దొరబాబు.. హైకమాండ్‌ను ఇరకాటంలో పడేస్తున్నారు. తన పుట్టినరోజు వేడుకల్లో జోష్‌గా పాల్గొన్నారు ఎమ్మెల్యే పెండెం దొరబాబు. క్యాడర్ నాతోనే ఉంది.. ప్రజల ఆకాంక్ష ప్రకారం తనకు జగన్ అవకాశం ఇచ్చే తీరతారు అంటూ కాన్ఫిడెంట్‌గా ఉన్నారు.

Advertisement

 

అటు.. ప్రత్తిపాడు నియోజకవర్గంలో కూడా వైసీపీ మార్పులు-చేర్పుల కాక మొదలైంది. ఇటీవల ఎమ్మెల్యే పర్వత ప్రసాద్‌కు టికెట్ నిరాకరించింది అధిష్టానం. ప్రసాద్‌ను తప్పించి మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావుని ఇన్‌చార్జిగా పంపించారు. దీన్ని దిగమింగుకోలేని ఎమ్మెల్యే పర్వత ప్రసాద్ సైలెంట్‌గా తిరుగుబాటు మొదలుపెట్టారు. వరుపుల సుబ్బారావుకి సహాయ నిరాకరణ ప్రకటించి.. ప్రజా దీవెన పేరుతో జనంలోకి వెళ్లాలని డిసైడయ్యారు. హైకమాండ్‌ మనసులో మార్పు వస్తుందని ఆశిస్తున్నారు.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading