సినీ హీరో మాస్ మహారాజా గురించి అందరికీ తెలిసిందే. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రవితేజ ఇప్పుడు మాస్ మహారాజా స్థాయికి ఎదిగారు. ఆయన కెరీర్ స్ట్రగుల్ గురించి ఓ హీరోయిన్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. హీరో అవ్వాలని ఆశతో సినీ రంగ ప్రవేశం చేసిన రవితేజ అంత ఈజీగా అవకాశాలు దక్కించుకోలేదు. తొలుత సినిమాల్లో అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తూ చిన్న చిన్న ఊరు పేరు లేని పాత్రలు కూడా చేస్తూ వచ్చిన ఆయన తొలిసారిగా కర్తవ్యం అనే సినిమాలో చక్రవర్తి స్నేహితునిగా కనిపించాడు. అలా ప్రారంభించి నిన్నే పెళ్లాడుతా సినిమా వరకు పలు సినిమాల్లో గుర్తింపు లేని పాత్రల్లో నటించారు.
పూర్తి స్థాయి నటుడిగా తొలి సినిమా సింధూరం. ఆ చిత్రంలో చంటి అనే పాత్రలో కనిపించారు రవితేజ. చిన్న పాత్రలు చేస్తూనే.. ఆయన నీకోసం సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమా అంతగా ఆకట్టుకోలేదు. మెగాస్టార్ చిరంజీవి నటించిన అన్నయ్య సినిమాలో చిరంజీవికి సోదరుడిగా నటించారు. ఆ సినిమ రవితేజకు మంచి పేరు తీసుకొచ్చింది. రవితేజకు ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం చిత్రం పెద్ద బ్రేక్ ఇచ్చింది. ఇడీయట్ బ్లాక్ బస్టర్‌తో ఆయన కెరీర్ మలుపు తిరిగింది. అమీర్‌పేట సినిమా ద్వారా హీరోయిన్గా పరిచయం అయిన అశ్విని ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
Advertisement
Advertisement
రవితేజ నటించిన రాజా ది గ్రేట్ సినిమాలో ఓ సాంగ్‌లో కూడా కనిపించారు. ఆ సినిమా షూటింగ్ విశేషాలను పంచుకుంటూనే రవితేజ పది రూపాయలతో రోజు అంతా ఎలా గడిపేవాడిని అనే విషయాన్ని నా వద్ద ప్రస్తావించారని చెప్పారు. రూ.10తో మధ్యాహ్నం భోజనం చేస్తే రాత్రికి భోజనం దొరకదు అని.. భావించి రాత్రి కోసం ఆ పది రూపాయలు దాచుకునే వారట. మధ్యాహ్నం పనిలో పడితే ఆకలి తెలియకుండా ఉండేది. కానీ రాత్రి వేళలో నిద్ర రావాలంటే కడుపు నిండాల్సిందే అని అందుకే పది రూపాయలు దాచుకుని మరీ రాత్రికి తినే వాడిని అని తనకు చెప్పినట్టు వివరించారు. ఎంతటి స్టార్స్ అయినా తొలుత కష్టాలు మాత్రం తప్పవు అన్నారు.
Also Read :
‘అత్తారింటికి దారేది సినిమాలో త్రివిక్రమ్ శ్రీనివాస్ మిస్ అయిన ఈ లాజిక్ గమనించారా ?
ఆచార్యలో యంగ్ చిరుకి సూపర్ స్టార్ కు ఉన్న లింక్ ఏంటో తెలుసా..?