Home » ఆచార్యలో యంగ్ చిరుకి సూపర్ స్టార్ కు ఉన్న లింక్ ఏంటో తెలుసా..?

ఆచార్యలో యంగ్ చిరుకి సూపర్ స్టార్ కు ఉన్న లింక్ ఏంటో తెలుసా..?

by Azhar
Ad

మెగాస్టార్ చిరంజీవి హీరోగా తాజాగా వచ్చిన సినిమా ఆచార్య. అయితే ఈ సినిమాకు కొరటాల శివ దర్శకుడు కావడం.. అలాగే ఇందులో చిరంజీవి కొడుకు రామ్ చరణ్ హీరో కావడంతో సినిమా పైన హైప్స్ ఒక్కసారిగా పెరిగిపోయాయి. కానీ సినిమా విడుదల అయిన తర్వాత డిజాస్టర్ గా మిగిలిపోయింది. సినిమాలో కొరటాల మార్క్ కనిపించలేదు అని అభిమానులు అభిప్రయపడ్డారు. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ఓ కొత్త విషయం బయటకు వచ్చింది. అదేంటంటే.. ఆచార్యలో కనిపించే యంగ్ చిరుకి సూపర్ స్టార్ మహేష్ కు ఓ లింక్ ఉంది.

Advertisement

అదేంటంటే… అయితే ఈ సినిమాలో మొదట రామ్ చరణ్ చేసిన సిద్ధ పాత్ర కోసం మహేష్ బాబును అనుకున్న విషయం తెలిసిందే. కేవలం 15 నిముషాలు ఉంటె ఈ పాత్రకు 30 కోట్ల రెమ్యునరేషన్ తో మహేష్ దగ్గరికి వెళ్లారు. అయితే సూపర్ స్టార్ కు ఈ సినిమా నచ్చకపోయిన కూడా చిరంజీవి, కొరటాల పైన ఉన్న అభిమానంతో నో చెప్పలేకపోయారు. అలాగే వెంటనే ఓకే కూడా చెప్పలేదు. అయితే మొదట సిద్ధకు మహేష్ ను అనుకున్న తర్వాత ఈ సినిమాలో కనిపించే యంగ్ చిరు పాత్ర కోసం రామ్ చరణ్ ను అనుకున్నారు.

Advertisement

కానీ ఆ తర్వాత సిద్ధ పాత్ర అదే 30 కోట్ల రెమ్యునరేషన్ తో రామ్ చరణ్ ఓకే చేసాడు. కానీ ఇందులో కేవలం 15 నిమిషాలే ఉండే సిద్ధ పాత్ర నిడివిని 45 నిమిషాలకు పెంచేశారు. ఆ తర్వాత ఆ యంగ్ చిరు పాత్ర కోసం గ్రాఫిక్స్ ను వాడుకున్నారు. ఒకవేళ ఈ సినిమాలో మహేష్ బాబే నటించి ఉంటె ఆ యంగ్ చిరు పాత్రలో రామ్ చరణ్ మనకు కనిపించేవాడు. అయితే మహేష్ ఈ సినిమాలో నటించకపోయిన మొదట తన వాయిస్ ఇచ్చిన విషయం అందరికి తెలిసిందే.

ఇవి కూడా చదవండి :

ప్లే ఆఫ్స్ కు వరుణుడు అడ్డుపడితే ఏం జరుగుతుంది..?

సచిల్ లాగే వయస్సులో పెద్దవారైన భార్యలు ఉన్న క్రికెటర్లు ఎవరో మీకు తెలుసా…?

Visitors Are Also Reading