హీరోయిన్ ప్రణిత సుభాష్ తాజాగా పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. కూతురిని పొత్తిళ్లలోకి తీసుకున్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసి ఓ శుభవార్తను అభిమానులతో పంచుకుంది. పాప పుట్టినప్పటి నుండి అంత కలగా అనిపిస్తోంది. ఈ మేరకు ప్రణీత షేర్ చేసిన ఫోటో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.
Advertisement
గత కొన్ని రోజులుగా ఎంతో క్లిష్టమైన పరిస్థితులు ఎదురయ్యాయి. కానీ మాకు పండంటి బిడ్డ పుట్టింది అని ఓ ఫోటోను షేర్ చేసింది ప్రణిత. తన బిడ్డను చూసుకుంటూ ప్రణీత ఎంతో మురిసిపోయింది. పొత్తిళ్లలో తన బిడ్డను చూసుకుంటూ ఉన్న ప్రణీత కళ్లలో మాతృత్వ ప్రేమ కనిపిస్తోంది. నాకు గైనకాలజిస్ట్ తల్లి ఉండడం నిజంగా నా అదృష్టం మానసికంగా మాత్రం ఆమెకు ఇది చాలా కష్ట సమయం. డాక్టర్ సునిల్ ఈశ్వర్, అతని టీమ్ డెలివరీ సవ్యంగా జరిగే విదంగా చూసారు. అదేవిధంగా డాక్టర్ సుబ్బు, అతని బృందానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటో లో మాత్రం పాప ముఖం కనిపించకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నది. మాతృత్వ మధురిమలతో ఉప్పొంగిపోతున్న ప్రణీతకు అభిమానులు, సెలబ్రిటీలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్తతో ప్రణీతకు గత ఏడాది పెళ్లి జరిగిన విషయం తెలిసిందే. గత ఏప్రిల్ నెలలో ప్రణీత తన ప్రెగ్నెన్సీ విషయాన్ని వెల్లడించింది. తాను టెస్టులు చేసుకున్నట్టుగా స్కానింగ్ రిపోర్టులను ప్రణీత సోషల్ మీడియాలో షేర్ చేసింది. తాను తల్లి అవుతున్నట్టుగా అందరికీ చెప్పింది. ప్రణీత సీమంతం వేడుకలు, బేబీ షవర్ ఫోటో షూట్లు ఎంతగా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ప్రణీత పండంటి బిడ్డకు జన్మినిచ్చిన సంతోషంలో ఉంది.
Also Read :
భారత కరెన్సీ నోట్లపై ఇవి ఎందుకు ఉంటాయో మీకు తెలుసా..?
పవన్ కల్యాణ్ సినిమాలో సల్మాన్‌ఖాన్.. ఆ డైరెక్టర్ క్లారిటీ..!