Home » గజిని మూవీకి ఫస్ట్ హీరో సూర్య కాదట.. ఎంత మంది రిజెక్ట్ చేశారంటే..?

గజిని మూవీకి ఫస్ట్ హీరో సూర్య కాదట.. ఎంత మంది రిజెక్ట్ చేశారంటే..?

by Anji
Ad

తమిళ స్టార్ హీరో సూర్య గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. ఎప్పుడూ చాలా డిఫరెంట్ క్యారెక్టర్లు చేస్తుంటాడు సూర్య. వాటిలో గజినీ మూవీతో చాలా పాపులారిటీ సంపాదించుకున్నాడు. షార్ట్ మెమొరీ లాస్ పేషెంట్, లవర్ బాయ్, బిజినెస్ మ్యాన్ ఇలా మూడు విభిన్న పాత్రల్లో నటించిన మూవీ గజిని. ఈ మూవీ తెలుగు, తమిళం రెండింటిలో సూపర్ హిట్ కలెక్షన్లు సాధించింది. సెన్షేషనల్ క్రియేట్ చేసింది. ఈ మూవీలో హీరోయిన్లుగా ఆసిన్, నయనతార అద్భుతంగా నటించారు. వాస్తవానికి ముందుగా అనుకున్నది హీరో సూర్య కాదట.. సూర్యకన్నా ముందే చాలా మంది హీరోలకు ఈ కథ వినిపించారట. వారు రిజెక్ట్ చేసిన తరువాత  సూర్య చేశారు ఈ మూవీని. ఆ హీరోలు ఎవ్వరో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

Advertisement

ఈ సినిమాని తొలుత సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేయాలనుకున్నారట మురగదాస్. హైదరాబాద్ వచ్చి మెగా నిర్మాత అల్లు అరవింద్ కి కథ చెప్పడంతో చాలా బాగుందని.. మీరు మహేష్ బాబుని ఒప్పించండి అని చెప్పారట.  కానీ మహేష్ బాబు రిజెక్ట్ చేయడంతో ఆ తరువాత పవన్ కళ్యాణ్ తో తీద్దామనుకున్నారట. అప్పటికే జానీ ఫ్లాప్ తో సతమతం అవుతున్న పవన్ ఈ సినిమాకి నో చెప్పారట. అరవింద్ ఈ సినిమా చేస్తే మాత్రం సూపర్ హిట్ అవుతుందని చెప్పడంతో తెలుగులో కుదరదు అని.. తమిళ స్టార్ హీరోల వైపు మురగదాస్ కన్నేశాడు. ఈ కథను కమల్ హాసన్ తో సహా దాదాపు 10 మందికి హీరోల వరకు వెళ్లింది. కానీ వారంతా కథ విని నో చెప్పారంట. 

Advertisement

చివరికీ తన మొదటి సినిమాలో చేసిన హీరో అజిత్ కి కూడా ఈ కథను వినిపించాడట. ఆయన ఓకే చెప్పాడట. దీంతో హ్యాపీగా ఫీల్ అయ్యాడట. వెంటనే హీరోయిన్లు ఆసిన్ శ్రియాలను, ప్రతీ నాయకుడిగా ప్రకాశ్ రాజును తీసుకొని చిత్రానికి మీరత్తల్ అనౌన్స్ చేశారట. నాలుగు రోజులు షూటించి కూడా జరిగిన తరువాత ఈ సినిమా తాను చేయనని అజిత్ చెప్పాడట. దీంత షాక్ అయిన మురగదాస్ చివరికీ ఈ కథను తీసుకెళ్లి హీరో సూర్యకి వినిపించారట. సూర్య ఓకే చెప్పడంతో ఈ మూవీని సూర్యతో పూర్తి చేశారు. సూర్య ఇందులో చాలా అద్భుతంగా నటించారు. 2005లో సినిమా షూటింగ్ ప్రారంభమై రూ.10కోట్ల బడ్జెట్ పెట్టిన ఈ మూవీ 90 రోజుల్లో పూర్తి చేశారు. 

 మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

 బాబు బాగా బిజీ మూవీ బ్యూటీ ఇప్పుడు ఎలా ఉందో చూస్తే ఆశ్చర్యపోవడం పక్కా..!

జల్సా మూవీలో సరిహద్దు రాయికి కత్తికి ఉన్న లింక్ గురించి మీకు తెలుసా ? 

Visitors Are Also Reading