హైదరాబాద్ మహానగరానికి ఎంతో గొప్ప చరిత్ర ఉంది. భిన్నత్వంలో ఏకత్వానికీ ప్రతీక భాగ్యనగరం. ఎక్కడెక్కడి నుండో వచ్చి ఇక్కడ సెటిల్ అవుతూ ఉంటారు. ఇక్కడ ఎన్నో చారిత్రాత్మక కట్టడాలున్నాయి. ప్రేమకు చిహ్నాలుగా కట్టిన కట్టడాలున్నాయి. అలాంటి కట్టడాల్లో ఒకటి పురానాపూల్ బ్రిడ్జి ఒకటి. ఈ వంతెన ప్రేమకు చిహ్నంగానే నిర్మించారు.
Also Read : ఎన్టీఆర్‌కు మోసం.. ఆ రోజు రాత్రి అలా జరగడంతో మురళీ మోహన్‌కు కడుపు మండిపోయిందట.!
కులీకుతుబ్‌షా, భాగమతి ప్రేమకు గుర్తుగా ఈ మూసీ నదిపై వంతెనను నిర్మించారు. గోల్కొండ కోటలో ఉండే కులీకుత్‌బ్ షా మూసీ నదికి ఇవతల ఉండే భాగమతి ప్రేమలో పడిన తరువాత మూసీని దాటేందుకు ఇబ్బందులు వస్తున్నాయని చెప్పి ఈ వెంతెనను నిర్మించారు. 1578లో ఈ వంతెన నిర్మాణం పూర్తయింది.
హైదరాబాద్ నగరంలో నిర్మించిన తొలి వంతెన ఇదే కావడం విశేషం. అయితే ఈ వంతెనకు ప్యారానాపూల్ అని నామకరణం చేశారు. కాల క్రమేనా అది పురానాపూల్‌గా మారింది. మూసీ నదిపై నిర్మించిన ఈ వంతెన ఎన్నో ఆటుపోటులను మార్కెట్ వెలిసింది. చరిత్రకు సాక్ష్యంగా ఉన్న వంతెనను ప్రభుత్వం పట్టించుకుని పర్యాటక పరంగా అభివృద్ధి చేయాలని స్థానికులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.
Also Read : అదృష్టం అంటే ఈమెదె.. 50 ఇంటర్వ్యూల్లో ఫెయిల్.. కోటి ఫ్యాకేజీతో జాబ్..!