Home » అదృష్టం అంటే ఈమెదె.. 50 ఇంట‌ర్వ్యూల్లో ఫెయిల్.. కోటి ఫ్యాకేజీతో జాబ్‌..!

అదృష్టం అంటే ఈమెదె.. 50 ఇంట‌ర్వ్యూల్లో ఫెయిల్.. కోటి ఫ్యాకేజీతో జాబ్‌..!

by Anji

సంప్రితి యాద‌వ్ వ‌య‌స్సు 24 సంవ‌త్స‌రాలు. కానీ ఏకంగా గూగుల్‌లో కోటి రూపాయ‌ల ఫ్యాకెజీతో సాప్ట్‌వేర్ జాబ్ కొట్టేసింది. అంత‌కు ముందు 50 ఇంట‌ర్వ్యూల్లో ఫెయిల‌యింది. అయినా కూడా త‌న సంక‌ల్పాన్ని మాత్రం వ‌ద‌ల్లేదు. రూ.1.10 కోట్ల ఫ్యాకేజీతో లండ‌న్‌లో ఉన్న గూగుల్ ఆఫీస్ కు సెలెక్ట్ అయింది. జాబ్ వ‌చ్చి రోగులు గ‌డుస్తున్నప్ప‌టికీ తాజాగా ఆమె ఎదుర్కొన్న ప‌రిస్థితుల‌ను తాజాగా మీడియాకు వెల్ల‌డించింది.

Also Read :  sampath raj : విడాకుల త‌ర‌వాతే నాకు అవ‌కాశాలు వ‌చ్చాయి…మిర్చి విల‌న్ హాట్ కామెంట్స్…!

ఇంట‌ర్వ్యూల‌కు వెళ్లిన‌ప్పుడు చాలా నెర్వ‌స్‌గా ఫీల్ అయ్యేదాన్ని కానీ నాకు త‌ల్లిదండ్రులు, క్లోజ్ ఫ్రెండ్స్ తోడున్నారు. వాళ్లే న‌న్ను ఎంక‌రేజ్ చేసారు. పెద్ద పెద్ద కంపెనీల గురించి తెలుసుకోవ‌డం కోసం చాలా స‌మ‌యం గ‌డిపారు. ఆ కంపెనీలో ఇంట‌ర్వ్యూ అంటే అది ఒక డిస్క‌ష‌న్‌లాగా ఉంటుంది. ఎక్కువ‌గా ప్రాక్టిస్ చేయ‌డం నాకు ఇంట‌ర్వ్యూల్లో కాన్పిడెన్స్‌ను ఇచ్చింది. దాదాపు 50 ఇంట‌ర్వ్యూల్లో ఫెయిల్ అయ్యాను. చివ‌రికీ స‌క్సెస్ అయ్యాన‌ని యాద‌వ్ చెప్పుకొచ్చింది.

ఢిల్లీలో 2021లో టెక్నోలాజిక‌ల్ యూనివ‌ర్సిటీ నుంచి బీటెక్ ప‌ట్టా పొందిన సంప్రీతి యాద‌వ్ సాప్ట్‌వేర్ జాబ్‌కు ట్రై చేయ‌డానికి ముందు కంటెంట్ క్రియేట‌ర్ కావాల‌ని అనుకుంది. సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సంప్రీతికి క్లాసిక‌ల్ మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. సంప్రీతి తండ్రి ఎస్‌బీఐ బ్యాంకులో ప‌ని చేస్తూ ఉంటారు. త‌న త‌ల్లి ప్ర‌భుత్వ ఉద్యోగిని.

Also Read :  పెళ్లి తర్వాత కొత్త జీవితం సింగ‌ర్ సునిత ఏమ‌న్న‌దంటే..?

Visitors Are Also Reading