సాధారణంగా పెళ్లికి ముందే పేరేంట్స్ అయినా వారు చాలా మంది ఉన్నారు. కొంత మంది పిల్లలు పుట్టిన తరువాత పెళ్లి చేసుకున్న వారు ఉన్నారు. అయితే ఇలాంటి వారు సెలబ్రిటీలలో మాత్రం చాలా తక్కువ అనే చెప్పాలి. ముఖ్యంగా సినీ, క్రికెటర్లు పెళ్లికి ముందే పేరెంట్స్ అయిన వారు చాలా మందే ఉన్నారు. ఈ జాబితాలో భారత క్రికెటర్ హార్దిక్ పాండ్యా కూడా ఉన్నాడు. హార్దిక్ పాండ్యా పెళ్లికి ముందే తండ్రి అయ్యాడు. పాండ్యా బాలీవుడ్ నటి నటాషా స్టాంకోవిచ్ ని జనవరి 01, 2020న దుబాయ్ లో నిశ్చితార్థం చేసుకున్నారు. పాండ్యా తన బిడ్డకు అగస్త్య అనే పేరు పెట్టారు. అదేవిధంగా ఈ జాబితాలో తాజాగా ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ స్టువర్డ్ బ్రాడ్ కూడా చేరాడు. పెళ్లి కాకుండానే బ్రాండ్ ఓ బిడ్డకి తండ్రి అయ్యాడు. ప్రస్తుతం తన బిడ్డతో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Advertisement
ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ గురించి క్రికెట్ ప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ముఖ్యంగా ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ ని ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అందుకు కారణంగా 2007లో టీ20 ప్రపంచ కప్ లో బ్రాడ్ పేరిట నెలకొన్న ఓ రికార్డు అందుకు కారణం. ప్రపంచ కప్ లో ఆమ్యాచ్ లో స్టువర్డ్ బ్రాడ్ చేసిన 19వ ఓవర్ లో యువరాజ్ లో 6 బంతుల్లో 6 సిక్సులు బాదాడు. అంతేకాదు.. 12 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించి చరిత్ర సృష్టించాడు. బ్రాడ్ ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ కి బాగా సుపరిచితుడు. అతని వ్యక్తిగత విషయానికి వస్తే కొన్నేళ్ల కిందట మోలీ కింగ్ అనే సింగర్ తో పరిచయం ఏర్పడుతుంది. కాస్తా ప్రేమకు దారి తీసింది. వారిద్దరూ కొన్నేళ్లుగా డేటింగ్ లో ఉన్నారు. ఈ క్రమంలో గతేడాది బ్రాడ్, మోలీలు నిశ్చితార్థం చేసుకున్నారు.
Advertisement
Also Read : మెస్సీ జెర్సీలో మెరిసిపోతున్న ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా ?
ఈ తరుణంలోనే ఇటీవల ఆమె గర్భవతి కూడా అయింది. ఆ విషయాన్ని మోలీ తన ఇన్ స్టాగ్రామ్ లో ఎంతో ఆనందంతో తెలిపింది. తన బేబీ బంప్ నకు సంబంధించిన ఫోటోలు వీడియోలు షేర్ చేసింది. బ్రాడ్ కూడా తాను త్వరలో తండ్రిని కాబోతున్నట్టు సంతోషాన్ని వ్యక్తం చేశాడు. ఇద్దరూ కలిసి వీడియోలు చేశారు. తాజాగా మోలీకి పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. వారిద్దరూ తమ చేతుల్లో చిన్నారిని పట్టుకొని ఫోటోలు దిగారు. తమ కూతురితో దిగిన ఫోటోలను తన ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసింది మోలీ కింగ్. దీంతో ఆ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఆ చిన్నారికి అన్నాబెల్లా బ్రాడ్ అని పేరు పెట్టారు. ఈ కొత్త ప్రపంచంలోకి స్వాగతం అన్నాబెల్లా నువ్వు రాక ముందు ఇంతటి ప్రేమను ఎప్పుడూ చూడలేదు అంటూ మోలీ తన ఇన్ స్టాలో రాసుకొచ్చింది.
Also Read : FIFA World Cup 2022 : మరో సంచలనం.. జర్మనీపై జపాన్ ఘన విజయం