Home » బ్రహ్మాస్త్ర 2, 3 విడుదల అప్పుడేనా ? క్లారిటీ ఇచ్చిన దర్శకుడు..!

బ్రహ్మాస్త్ర 2, 3 విడుదల అప్పుడేనా ? క్లారిటీ ఇచ్చిన దర్శకుడు..!

by Anji
Ad

సాధారణంగా ప్రతీ ఏడాది ఎన్నో సినిమాలు విడుదలవుతాయి. కానీ అందులో కొన్ని సినిమాలు మాత్రమే సక్సెస్ సాధిస్తాయి. గత ఏడాది సక్సెస్ సాధించిన వాటిలో అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో బాలీవుడ్ నటుడు రణ్ బీర్ కపూర్ నటించిన బ్రహ్మాస్త్ర ఒకటి. అస్త్రవర్స్ లో భాగంగా మూడు భాగాలు ఈ సినిమాను విడుదల చేయాలని భావించారు. ఫస్ట్ పార్ట్ బాలీవుడ్ కి బ్యాడ్ టైమ్ నడుస్తున్న సమయంలో విడుదల అయింది. ఈ సినిమా మంచి వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రం హిట్ అయినప్పటికీ కథ, కథనం పరంగా విమర్శలు వచ్చాయి. మంచి కథను అయాన్ అంత గ్రిప్పింగ్ గా నడిపించలేకపోయారని నెటిజన్లు కామెంట్స్ చేసారు. 

Also Read :  పశువులంటే మాకు ప్రాణం అనే డైలాగ్ జీవితాన్నే మార్చేసింది.. వైరల్ అవుతున్న కొమరం కామెంట్స్..!

Advertisement

Advertisement

ఈ సినిమా తరువాత పార్ట్ 2, పార్ట్3 గురించి సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బ్రహ్మాస్త్ర 2, బ్రహ్మాస్త్ర 3 విడుదల గురించి దర్శకుడు ఆసక్తికరమైన న్యూస్ వెల్లడించారు. ఇందుకు సంబంధించి ఓ ప్రెస్ నోట్ కూడా విడుదల చేశాడు దర్శకుడు అయాన్. ప్రముఖ ట్రేడ్ ఎనలిస్ట్, సినీ విశ్లేషకుడు తరుణ్ ఆదర్శ్ సోషల్ మీడియాలో ఆ నోట్ షేర్ చేశాడు.  బ్రహ్మాస్త్ర 2 ని 2026లో, బ్రహ్మాస్త్ర 3 ని 2027లో విడుదల చేయాలని అయాన్ నిర్ణయించుకున్నాడని తరుణ్ అందులో రాసుకొచ్చాడు. 

Also Read :  Poorna : పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్ పూర్ణ… ఫోటోలు వైరల్

Manam News

“అయాన్ విడుదల చేసిన ఆ నోట్ లో బ్రహ్మాస్త్ర ట్రయాలజీ, అస్త్రవర్స్, నా జీవితం గురించి అప్ డేట్ ఇచ్చే సమయంలో ఆసన్నమైంది. పార్ట్ 1 పై మీ ప్రేమ, ఫీడ్ బ్యాక్ ని పరిగణలోకి తీసుకున్న తరువాత పార్ట్ ల గురించి దృష్టి సారించాను. మీ అభిరుచికి తగినట్టు బ్రహ్మాస్త్ర 2, 3 స్క్రిప్ట్ పర్ఫెక్ట్ గా తయారు చేసేందుకు నాకు కొంచెం సమయం కావాలని తెలుసుకున్నాను. రెండు భాగాలను షూట్ చేసి తక్కువ గ్యాప్ లోనే విడుదల చేయాలని భావిస్తున్నాను. అందుకే ఈ విషయాన్ని మీతో పంచుకున్నాను” అని  తెలియజేశాడు.  

Also Read :  Naresh – Pavitra : ఆ కోరిక తీరాలని..ఏపీలో పవిత్ర, నరేష్ ప్రత్యేక పూజలు..!

Visitors Are Also Reading