ప్రపంచవ్యాప్తంగా చాలా మందిని వేధిస్తున్న సమస్య డయాబెటిస్. ఆధునిక జీవనశైలిలో మార్పులు, పనిఒత్తిడి, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా చాలామంది డయాబెటిస్ సమస్యతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే డయాబెటిస్ ఉన్నవారు తీసుకునే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. డయాబెటిస్ ఉన్నవారు వేరుశనగలను తింటే ఏమీ అవుతుందో చూద్దాం. డైయాబెటీస్ ఉన్న వారు ఇలా రక్త పరీక్ష చేయించుకోవాలి.
Advertisement
అధిక బరువుకు చెక్:
డయాబెటిస్ రోగులకు స్తూలకాయం అతిపెద్ద సమస్యగా ఉంటుంది. వేరుశెనగ తినడం వల్ల వారు అధికబరువు నుంచి ఉపశమనం పొందవచ్చు.
శరీరానికి హెల్తీ ఫ్యాట్:
వేరుశనగను పేదల బాదంగా చెప్పవచ్చు. హెల్త్ ఫ్యాట్ కు రిచ్ సోర్స్ ఇది. ఇది తినడం వల్ల గుడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది.
Advertisement
వేరుశనగలో ఉండే న్యూట్రియంట్లు వేరుశనగను అత్యంత పౌష్టిక ఆహారంగా చెప్పవచ్చు. ఇవి తినడం వల్ల శరీరానికి ప్రోటీన్లు, విటమిన్ బి-6, విటమిన్ బి-9, విటమిన్ బి కాంప్లెక్స్, ప్యాంటోతేనిక్ యాసిడ్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.
కొలెస్ట్రాల్ కు చెక్ :
వేరుశనగ తినడం వల్ల రక్తనాళికల్లో పేర్కొన్న కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఎందుకంటే ఇందులో ఫైబర్, ప్రోటీన్లు, మోనో అన్ శాష్యురేటెడ్ ఫ్యాట్ ఉంటుంది. డయాబెటిస్ రోగులకు గుండె వ్యాధుల ముప్పు ఎక్కువగా ఉంటుంది. అందుకే వేరుశెనగ తినాల్సి ఉంటుంది.
READ ALSO : Venkatesh 75 : వెంకటేష్ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ! అదిరిపోయిన ‘సైంధవ్’ గ్లింప్స్!