Home » జైలర్ మూవీలో విలన్ వేసుకున్న ఆ షర్ట్ ని తీసేయాలని ఆదేశించిన ఢిల్లీ హైకోర్టు.. అందుకోసమేనా ?

జైలర్ మూవీలో విలన్ వేసుకున్న ఆ షర్ట్ ని తీసేయాలని ఆదేశించిన ఢిల్లీ హైకోర్టు.. అందుకోసమేనా ?

by Anji
Ad

 ఐపీఎల్ టీమ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు  జెర్సీని ఒక కాంట్రాక్ట్ కిల్లర్ ధరించి ఉన్న జెర్సీని థియేటర్లలో సెప్టెంబరు 1 నుంచి ప్రదర్శించరాదని ఢిల్లీ హైకోర్టు “జైలర్” చిత్ర నిర్మాతలకు ఆదేశాలు జారీ చేసింది. చిత్ర నిర్మాతలు RCB జట్టు జెర్సీని కించపరిచేలా ఉపయోగించారని.. ఐపీఎల్ టీమ్, రాయల్ ఛాలెంజర్స్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని విచారించిన జస్టిస్ ప్రతిభా ఎం సింగ్ ఈ తీర్పునిచ్చారు.

Advertisement

రజనీకాంత్ నటించిన ఈ చిత్రం టెలివిజన్, శాటిలైట్ లేదా ఏదైనా ఓటీటీ ప్లాట్‌ఫారమ్ లలో కూడా ఆ జెర్సీ లేకుండా విడుదల చేయాలని హైకోర్టు ఆదేశించింది.ఈ చిత్రంలో కాంట్రాక్టు కిల్లర్ జెర్సీ ధరించి ఓ మహిళ గురించి అవమానకరమైన, స్త్రీ, ద్వేషపూరిత మాటలు మాట్లాడాడని ఆర్సీబీ తరపున లాయర్ఆరోపించారు.  అనుమతి లేకుండా తమ జెర్సీని ఉపయోగించడం వల్ల తమ బ్రాండ్ ఇమేజ్, ఈక్విటి దెబ్బ తింటుందని ఐపీఎల్ టీమ్ వాదించింది. దావా దాఖలు చేసిన తరువాత. చిత్ర, నిర్మాతలు ఐపీఎల్ బృందం తమ వివాదాలను పరిష్కరించుకున్నారు.

Advertisement

విలన్ ఆర్సీబీ జెర్సీ  వేసుకొని ఉన్న సన్నివేశానలు మార్చేందుకు చిత్ర నిర్మాతలు అంగీకరించారు. నిర్మాతలు RCB జెర్సీపై ఉన్న ప్రాథమిక రంగులు, బ్రాండింగ్, డేక తొలగిస్తారు.  నిర్మాతలు ఆర్సీబీ జెర్సీపై ఉన్న ప్రాథమిక రంగులు, బ్రాండింగ్ తొలగిస్తారు. సినిమా ఇప్పటికే ఆగస్టు 10న విడుదలైంది. సెప్టెంబర్ 01, 2023 నాటికి థియేట్రికల్ వెర్షన్ లో మార్పు చేస్తామని నిర్మాతలు అంగీకరించారు. ఈ సినిమా పాజిటివ్ టాక్ విజయవంతంగా దూసుకెళ్తోంది. గత సినిమాలు రజినీకాంత్ కి ఫ్లాప్ లను మరిపించేవిధంగా జైలర్ మూవీ సూపర్ హిట్ సాధించింది. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు :

చిరంజీవిని తిట్టినందుకు నానిపై సీరియస్ అయిన ఎన్టీఆర్.. అందుకే ఆ రోజు అలా చేశారా?

మహేష్ బాబు సినీ కెరీర్ లో కాస్త ఇబ్బంది పెట్టిన సన్నివేశం.. ఏకంగా రెండు గంటల పాటు..!

Visitors Are Also Reading