Home » చిరంజీవిని తిట్టినందుకు నానిపై సీరియస్ అయిన ఎన్టీఆర్.. అందుకే ఆ రోజు అలా చేశారా?

చిరంజీవిని తిట్టినందుకు నానిపై సీరియస్ అయిన ఎన్టీఆర్.. అందుకే ఆ రోజు అలా చేశారా?

by Anji
Ad

జూనియర్ ఎన్టీఆర్, కొడాలి నాని వీరిద్దరి మధ్య ఉన్న బంధం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. ఎన్టీఆర్, కొడాలి నాని వీరిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్. కొడాలి నాని, జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే కాదు.. వల్లభనేని వంశీ కూడా ఎన్టీఆర్ కి బెస్ట్ ఫ్రెండ్. జూనియర్ ఎన్టీఆర్ నటించిన పలు సినిమాలకు కొడాలి నాని నిర్మాతగా వ్యవహరించారు వాస్తవానికి నందమూరి హరికృష్ణ.. కొడాలి నాని రాజకీయ ఎదుగుదలకు ఎంతో ప్రోత్సహించారు. హరికృష్ణ కుమారుడు ఎన్టీఆర్ అంటే కొడాలికి అభిమానం. వీరిద్దరి మధ్య అంత అనుబంధం ఉన్నా ఒకరి ప్రొఫెషన్ లో మరొకరూ వేలు పెట్టరు. ఎవరి ప్రొఫెషన్ వారిదే. కొడాలి నాని ప్రస్తుతం వైఎస్సార్ సీపీలో ఉన్నారు. మంత్రిగా కూడా పని చేశారు. వైసీపీలో కీలక నేతగా ఉన్నారు.

Advertisement

ఒకరకంగా చెప్పుకోవాలంటే.. వైసీపీకి కొడాలి నాని ఫైర్ బ్రాండ్ అనే చెప్పాలి. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రపంచ స్థాయి నటుడిగా RRR మూవీ ద్వారా గుర్తింపు సాధించారు. ఇప్పుడు గ్లోబల్ స్టార్ వీరిద్దరి ప్రొఫెషన్స్ వేరు అయినప్పటికీ ఇద్దరూ చాలా కలిసి మెలిసి ఉంటారు. ఇప్పటికీ కలుసుకుంటుంటారు. అంతవరకు బాగానే ఉంది. కానీ కొడాలి నాని టీడీపీని చంద్రబాబును ఆయన కొడుకు నారా లోకేష్ ను ఎంత తిట్టినా జూనియర్ ఎన్టీఆర్ మాత్రం అంతగా పట్టించుకోడు. ఇటీవలే కొడాలి నాని.. చిరంజీవిపై వివాదస్పద వ్యాఖ్యు చేసిన విషయం తెలిసిందే. వాల్తేరు వీరయ్య మూవీ 200వ రోజు వేడుకల్లో చిరంజీవి ఏపి ప్రభుత్వాన్ని ఏకి పారేశారు. మీరు ఇండస్ట్రీ మీద ఎందుకు పడుతున్నారు. మీరు అభివృద్ధి గురించి ఆలోచించండి అని క్లాస్ పీకడంతో వెంటనే వైసీపీ ఎదురుదాడికి దిగింది. కొడాలి నాని కూడా వెంటనే మెగాస్టార్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాడు. పకోడీ గాళ్లు అంటూ మీడియాముఖంగానే తిట్టేశాడు.

Advertisement

దీంతో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో పెద్ద దుమారమే లేపాయి. మెగాస్టార్ చిరంజీవిని నేరుగా ఇప్పటివరకు ఏ రాజకీయ నాయకులు తిట్టలేదు. కొడాలి తిట్టడంతో అది చర్చనీయాంశం కావడంతో వెంటనే జూనియర్ ఎన్టీఆర్ కొడాలిపై సీరియస్ అయ్యారట. అసలు నువ్వు ఎందుకు ఈ విషయంలో జోక్యం చేసుకుంటున్నావు చిరంజీవిని ఎందుకు తిట్టావు అంటూ కొడాలిపై జూనియర్ ఎన్టీఆర్ సీరియస్ అయ్యాడట. క్లాస్ కూడా పీకాడట. ఇండస్ట్రీ గురుంచి అలా తప్పుగా మాట్లాడొద్దు అని క్లాస్ పీకడంతో ఇక చేసేది లేక.. చిరంజీవిని తాను ఏం అనలేదని.. అంటూ కొడాలి మరొసారి మీడియా ముందుకు వచ్చి తను చేసిన తప్పును సరిదిద్దుకున్నాడు. ఎన్టీఆర్ వల్లనే అని ఇండస్ట్రీలో మాట్లాడుతున్నారు. ఏది ఏమైనా.. మంత్రిగా పని చేసినా ఎవ్వరి మాట వినని కొడాలి నాని.. జూనియర్ ఎన్టీఆర్ మాట బాగానే వింటున్నాడు అంటూ అటు ఇండస్ట్రీలో రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు :

 మహేష్ బాబు సినీ కెరీర్ లో కాస్త ఇబ్బంది పెట్టిన సన్నివేశం.. ఏకంగా రెండు గంటల పాటు..!

శ్రీలీలకు హీరో యశ్ బావ అవుతారనే విషయం మీకు తెలుసా ?

Visitors Are Also Reading