మెగాస్టార్ చిరంజీవి నటించిన జగదీకవీరుడు అతిలోక సుందరి చిత్రంలోని అబ్బనీ తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉందిరోయబ్బా.. విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన బొబ్బిలి రాజా సినిమాలోని బలపం పట్టి భామ బళ్లో అఆఇఈ నేర్చుకుంటా.. ఈ రెండు పాటలు ఎంత ఫేమస్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఇప్పటికీ ఈ పాటలు ఏదో ఓ సందర్భంలో మారు మ్రోగుతూనే ఉన్నాయి. అయితే ఈ రెండు పాటలకు ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా బాణీలను సమకూర్చారు. అప్పట్లో ఆకాశవాణిలో ఈ పాటలు వింటండేవారు.
Advertisement
1990లో వచ్చిన చిరంజీవి జగదేకవీరుడు అతిలోకసుందరి, వెంకటేష్ బొబ్బిలి రాజా సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందించాయి. ప్రముఖ నిర్మాత సి.అశ్వనిదత్, మెగాస్టార్ చిరంజీవితో ఒక సినిమా చేయాలనుకున్నారట. అందుకోసం ఓ కథను ప్రయత్నించారు. ఈ నేపథ్యంలోనే జంధ్యాల, యండమూరి వీరేంద్రనాథ్, సత్యానంద్ వంటి రచయితలు కలిసి ఓ సోషియో ఫాంటసీ స్టోరీని రెడీ చేసారు. తొలుత కథను అశ్వినీదత్, చిరంజీవిలకు వినిపించారు. కొన్ని మార్పులు చేర్పులతో ఆ కథను వారిద్దరూ ఒప్పుకున్నారు. ఇలాంటి ఫాంటసీ చిత్రానికి దర్శకుడి ఆలోచిస్తున్న క్రమంలోనే.. రాఘవేంద్రరావు అయితే ఈ చిత్రానికి న్యాయం చేయగలరని ఎంచుకున్నారు. శ్రీదేవి దేవకన్యగా బాగుంటుందని హీరోయిన్ గా తీసుకున్నారు. ఈ చిత్రం 1990 మే నెలలో విడుదలై సూపర్ హిట్ సాధించింది. ఈ చిత్రంలోని పాటలన్నీ ఓ ఊపు ఊపాయి.
Advertisement
అదేవిధంగా ప్రముఖ నిర్మాత డి.రామానాయుడు స్థాపించినటువంటి సురేష్ ప్రొడక్షన్ బ్యానర్ లో వెంకటేష్ హీరోగా ఓ చిత్రాన్ని నిర్మించాలనుకున్నారు. ఆ సినిమా కోసం పరుచూరి బ్రదర్స్ ఓ కథని సిద్ధం చేశారు. కొన్ని మార్పులు చేర్పులతో కథ ఫైనల్ అయింది. అప్పటికే సురేష్ ప్రొడక్షన్స్ లో బి.గోపాల్ కొన్ని సినిమాలను తెరకెక్కించినప్పటికీ ప్రేమకథ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలను బి.గోపాల్ చిత్రీకరించగలడా.. అనే సందేహాలను నిర్మాత వ్యక్తం చేశారు పరుచూరి బ్రదర్స్ నచ్చజెప్పడంతో బొబ్బిలిరాజా చిత్రానికి బి.గోపాల్ దర్శకత్వం చేసే అవకాశాన్ని ఇచ్చారు. అడవి నేపథ్యంలో వచ్చినటువంటి ఈ సినిమా ఆ రోజుల్లో ఘన విజయం సాధించింది. సంగీత దర్శకుడు ఇళయరాజా అందించినటువంటి పాటలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
Also Read : ప్రభాస్ తో, తారకరత్న నటించే అవకాశాన్ని మిస్సయ్యారని మీకు తెలుసా..?
ఈ రెండు సినిమాలు మంచి విజయం సాధించినప్పటికీ.. జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాని దాదాపు అందరూ చూడటంతో 29 కేంద్రాల్లో 100 రోజులు, 5 కేంద్రాల్లో 200 రోజులు నడిచింది. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని ఓడియన్ 70ఎంఎం థియేటర్ లో 365 రోజులు ప్రదర్శింపబడి రూ.6కోట్ల షేర్ వసూలు చేసి ఆల్ టైమ్ హిట్ గా నిలిచిపోయింది. ఇక అటు బొబ్బిలిరాజా చిత్రం కూడా 25 కేంద్రాల్లో 100 రోజులు, 3 కేంద్రాల్లో 200 రోజులు ప్రదర్శింపబడి రూ.5కోట్ల షేర్ వసూలు చేసింది. ఈ చిత్రం నిర్మాత డి.సురేష్ బాబు బొబ్బిలిరాజా చిత్రం ఇండస్ట్రీ హిట్ అనడంతో కాస్త వివాదం తలెత్తింది. కలెక్షన్స్ వారీగా చూసినట్టయితే.. జగదేకవీరుడు అతిలోకసుందరి చిత్రం ఒక్కటే ఆ ఏడాది ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. బొబ్బిలిరాజా, కర్తవ్యం వంటి సినిమా ఆ ఏడాది బ్లాక్ బస్టర్స్ గా నిలవడం విశేషం.
Also Read : తారకరత్న పేరుపై ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయో తెలుసా..?