తారకరత్న హీరోగా సక్సెస్ కాలేకపోయినా తీసిన రెండు మూడు సినిమాలతో మంచి గుర్తింపును అయితే సాధించాడు. ఆయన సినిమాల్లో సక్సెస్ కాలేదు కాబట్టి కనీసం రాజకీయాల్లో అయినా రానిద్దామని భావించి నారా లోకేష్ తో యువగలం పాదయాత్రలో పాల్గొన్నారు.
Advertisement
Ad
Also read:చంద్రముఖి ఫేమ్ నటుడు ప్రభుకి అస్వస్థత.. వైద్యులు ఏమన్నారంటే..
పాల్గొన్న మొదటి రోజు గంటలోపే గుండెపోటుకు గురై సీరియస్ అవడంతో బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తరలించారు. అక్కడ 23 రోజులుగా చికిత్స పొందుతూ చివరికి ప్రాణాలు విడిచారు తారకరత్న. ఆయనకు గుండెపోటు వచ్చింది సీరియస్ గా ఉందని తెలియగానే అభిమానులంతా 23 రోజులుగా మా నందమూరి హీరో బతకాలని అనేక పూజలు చేశారు.
అయినా ఫలితం లేకుండా పోయింది. చివరికి ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను, ముగ్గురు పిల్లలను అనాధలను చేసి ఆయన కన్నుమూశాడు. ఆయన మరణంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో అభిమానులు ప్రజలు ఒక్కసారిగా కన్నీరు మున్నీరుగా విలపించారు. తారక రత్నకు కడసారి వీడ్కోలు పలికేందుకు వేలాది మంది అభిమానులు. తరలివచ్చారు. అశ్రునయనాల మధ్య ఆయన అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఈ తరుణంలోని తారకరత్న గురించి అనేక వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా తారకరత్న ఆస్తిపాస్తుల గురించి ఓ వార్త తెగ హల్చల్ చేస్తోంది.
ఇంతకీ తారకరత్నకు ఎన్ని కోట్ల విలువచేసే ఆస్తులు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం .. మోహన కృష్ణకు ఒక్కగాను ఒక కొడుకు తారకరత్న. ఇక మోహన్ కృష్ణ పేరు మీద రామకృష్ణ థియేటర్స్ తో పాటు , తారకరత్న థియేటర్స్ కూడా ఉన్నాయి. అంతేకాకుండా హోటల్ బిజినెస్, ఎన్నో ఇల్లు, కమర్షియల్ కాంప్లెక్స్ లు , ఎంకే ట్రేడర్స్ పేరిట మరిన్ని బిజినెస్ లు ఉన్నాయి. ఇవన్నీ కలిపితే తారకరత్న ఆస్తిపాస్తులు 1000 కోట్లకు పైగా ఉంటాయని అంచనా. అంతేకాకుండా తారక రత్న చేసుకున్న అలేఖ్య రెడ్డికి కూడా తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా 250 కోట్ల వచ్చినట్టు తెలుస్తోంది. తారకరత్న, అలేఖ్య రెడ్డి ఆస్తిపాస్తులు 1500 కోట్లకు పైగానే ఉంటుందని సమాచారం.
Advertisement
Read More For: Telugu cinema news, Telugu News