Home » RRR భీమ్లా నాయక్, పుష్ప కంటే కూడా అఖండ నే భారీ హిట్ ఎలాగంటే ?

RRR భీమ్లా నాయక్, పుష్ప కంటే కూడా అఖండ నే భారీ హిట్ ఎలాగంటే ?

by Anji
Published: Last Updated on
Ad

క‌రోనా సెకండ్ వేవ్ త‌రువాత అస‌లు థియేట‌ర్ల‌లోకి పెద్ద హీరోల సినిమాలు విడుద‌ల చేయాలా..? వ‌ద్దా..? అన్న సందేహాలు ఉన్న స‌మ‌యంలో బాల‌కృష్ణ డేర్ చేసి అఖండ‌ను థియేట‌ర్ల‌లోకి వ‌దిలేశాడు. పైగా అప్పుడు ఏపీలో టికెట్ రేట్లు కూడా త‌క్కువ‌గానే ఉన్నాయి. అవేమి ప‌ట్టించుకోకుండానే అఖండ వ‌చ్చింది. రూ.58కోట్ల ప్రీ విడుద‌ల బిజినెస్ జరుపుకున్న ఈ సినిమా ఓవ‌రాల్ గా రూ.200కోట్ల వ‌సూళ్ల‌ను కొల్ల‌గొట్టింది. ఏపీ, సీడెడ్‌, నైజాం, ఓవ‌ర్సిస్ అన్ని ఏరియాల‌లో సినిమా కొన్న వారికి భారీ లాభాలే వ‌చ్చాయి.

Advertisement

అఖండ ఇచ్చిన ధైర్యంతోనే ఆ త‌రువాత పుష్ప‌, భీమ్లానాయ‌క్‌, బంగార్రాజు, రాధేశ్యామ్‌.. ఇప్పుడు త్రిబుల్ ఆర్ ఇలా వ‌రుస‌గా పెద్ద సినిమాలు వ‌స్తున్నాయి. అఖండ త‌రువాత చాలా పెద్ద సినిమాలు వ‌చ్చాయి. కోట్లాది వ‌సూళ్లు కుమ్మేశామ‌ని చెప్పుకుంటున్నాయి. వాస్త‌వానికి ఏ సినిమా పెద్ద హిట్ అంటే.. అఖండే అని డిస్ట్రిబ్యూట‌ర్లు ఘంటాప‌థంగా చెబుతున్నారు. అందుకు వారు చెబుతున్న లెక్క‌లే పెద్ద ప్రూప్‌గా ఉంటున్నాయి. ఉదాహ‌ర‌ణ‌కు గోదావ‌రి జిల్లాలో ఓ థియేట‌ర్‌లో అఖండ నుంచి స్టార్ట్ అయి, పుష్ప‌, బంగార్రాజు, రాధేశ్యామ్‌, భీమ్లానాయ‌క్‌, ఆర్ఆర్ఆర్ అన్ని సినిమాలు విడుద‌ల‌య్యాయి. అఖండ సినిమాను రూ.2.50ల‌క్ష‌ల‌కు కొన్నారు.


ఈ చిత్రం రెండు వారాల్లోనే రూ.6.50 లక్ష‌లు రాబ‌ట్టింది. నాలుగున్న‌ర ల‌క్ష‌లు లాభం వ‌చ్చింది. పుష్ప సినిమాను రూ.5లక్ష‌ల‌కు కొంటే బ్రేక్ ఈవెన్‌తో బ‌య‌ట‌ప‌డ్డారు. సంక్రాంతికి వ‌చ్చిన బంగార్రాజును త‌క్కువ రేటుకే కొన్నా స్వ‌ల్ప న‌ష్టంతో బ‌య‌ట‌ప‌డ్డారు. అఖండ ఇచ్చిన ధైర్యంతోనే ఆ త‌రువాత పుష్ప‌, భీమ్లానాయ‌క్‌, బంగార్రాజు, రాధేశ్యామ్‌, ఇప్పుడు ఆర్ఆర్ఆర్ ఇలా వ‌రుస‌గా పెద్ద సినిమాలు వ‌స్తున్నాయి.కానీ వాస్తవానికి ఏ సినిమా పెద్ద హిట్ అంటే అఖండే అని డిస్ట్రిబ్యూట‌ర్లు చెబుతున్నారు వారు చెబుతున్న లెక్క‌లే పెద్ద ఫ్రూప్‌గా ఉంటున్నాయి.

Advertisement

భీమ్లానాయ‌క్‌కు సినిమాను రూ.5ల‌క్ష‌ల‌కు కొన్నారు. కానీ భీమ్లానాయ‌క్ ల‌క్ష న‌ష్టం వ‌చ్చింది. ప్ర‌భాస్ రాధేశ్యామ్ విడుద‌ల‌పై వీళ్ల‌కు ముందే డౌట్ ప‌ట్టుకుంది. కొనాలా వ‌ద్దా అన్న సందేహాల మ‌ధ్య‌నే సినిమాను రూ.5ల‌క్ష‌ల‌కు తీసుకున్నారు. రూ.2లక్ష‌ల న‌ష్టం. ఆర్ఆర్ఆర్ సినిమాను రూ.16లక్ష‌లు చెప్ప‌డంతో చివ‌రి వ‌ర‌కు సినిమాను వేయాలా వ‌ద్దా అనే సందిగ్దంలో ప‌డ్డారు. పెద్ద సినిమా రాజ‌మౌళి-ఎన్టీఆర్‌, చ‌ర‌న్ జాక్‌పాట్ త‌గులుతుందేమో మ‌రో బాహుబ‌లి అవుతుందేమో అనుకున్నారు. థియేట‌ర్‌లో సినిమా వేయ‌క‌పోతే అదో ప‌రువు స‌మ‌స్య చివ‌ర‌కు రూ.14లక్ష‌ల డీల్‌తో సినిమాను తీసుకొచ్చారు. క‌ట్ చేస్తే ల‌క్ష‌న్న‌ర న‌ష్టంతో బ‌య‌ట‌ప‌డుతున్నామ‌ని చెప్పారు. క‌లెక్ష‌న్ కూడా రోజుకు రూ.10వేల‌కు ప‌డిపోయింద‌ని.. వ‌రుణ్ తేజ్ గ‌ని సినిమా తేవాల‌ని అనుకున్నామ‌ని చెప్పారు. మ‌ధ్య‌లో ర‌వితేజ ఖిలాడీ కూడా పెద్ద బొక్క పెట్టింద‌ని ఈ సినిమాను రూ.1.25 ల‌క్ష‌ల‌కు కొంటే కేవ‌లం రూ.37వేలు మాత్ర‌మే వ‌చ్చాయ‌ని చెప్పారు.


గ‌ని సినిమాను కూడా రూ.2ల‌క్ష‌లు చెబుతున్నార‌ని.. క‌రోనా లాక్‌డౌన్ త‌రువాత ఏడాదిన్న‌ర పాటు థియేట‌ర్లు తెర‌వ‌లేద‌ని.. ఏదో థియేట‌ర్ల‌ను న‌డ‌పాల‌ని తాము పంతంలో ఉన్నామ‌ని.. అయితే డిస్ట్రిబ్యూట‌ర్లు ఎంత చెబితే అంత‌కే సినిమాను తీసుకురావాల్సి వ‌స్తోంద‌ని వాపోతున్నారు. బాల‌య్య అఖండ సినిమా లేక‌పోయి ఉంటే ఈ పాటికే తాము థియేట‌ర్‌ను మూసుకోవ‌డ‌మో లేదా వేరే వాళ్ల‌కు వ‌దిలేసుకోవాల్సి రావ‌డ‌మో జ‌రిగేద‌ని చెబుతున్నారు. ఈ లెక్క‌ల‌న్ని చూస్తే బాల‌య్య అఖండ మాత్ర‌మే బ్లాక్ బ‌స్ట‌ర్ మిట్ అయిన‌ట్ట‌ని చెబుతున్నారు.

Also Read :  1998లో ఉపేంద్ర డైరెక్షన్లో చిరు, అశ్వినీదత్ సినిమా ఎందుకు ఆగిపోయిందంటే ?

Visitors Are Also Reading