Home » 1998లో ఉపేంద్ర డైరెక్షన్లో చిరు, అశ్వినీదత్ సినిమా ఎందుకు ఆగిపోయిందంటే ?

1998లో ఉపేంద్ర డైరెక్షన్లో చిరు, అశ్వినీదత్ సినిమా ఎందుకు ఆగిపోయిందంటే ?

by AJAY
Ad

మెగాస్టార్ చిరంజీవి తో సినిమా చేయాలని ఎంతోమంది దర్శకులు కలలుకంటారు. ఆయన డేట్ల కోసం బడా బ్యానర్లు క్యూ కడతాయి. అయితే ఓ హీరో కమ్ విలన్ క‌మ్ దర్శకుడు మాత్రం మెగాస్టార్ తో అవకాశం వచ్చినా కూడా సినిమా చేయలేక‌పోయాడు. ఆ విషయాన్ని తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో వెల్లడించారు. అయితే ఆ హీరో క‌మ్ ద‌ర్శ‌కుడు మరెవ‌రో ఎవరో కాదు ఉపేంద్ర. కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర తెలుగులోనూ పలు సినిమాలతో ప్రేక్షకులకు సుపరిచితుడు అయ్యాడు.

Advertisement

 

గాడ్ ఈజ్ గ్రేట్ అనే డైలాగుతో ఉపేంద్ర ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. విభిన్న కథాంశాలతో డిఫరెంట్ లుక్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఉపేంద్ర ఎంతగానో ఆకట్టుకున్నారు. ఉపేంద్ర చేసిన సినిమాల‌లోని కొన్ని సన్నివేశాలు ఇప్పటికి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి అంటే ఉపేంద్రకు ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన సినిమాలకు త‌నే దర్శకత్వం వహించడంతో పాటు టాలీవుడ్ హీరోలతో కూడా ఉపేంద్ర సినిమాలు చేశారు.

Advertisement

రాజశేఖర్ తో ఉపేంద్ర ఓంకారం అనే సినిమాని తెరకెక్కించారు. ఈ సినిమా తర్వాత చిరంజీవితో సినిమా చేసే అవకాశం వచ్చింది. నిర్మాత అశ్వనీదత్ మెగాస్టార్ సినిమాతో సినిమా చేసే అవ‌కాశాన్ని ఉపేంద్ర‌కు ఇచ్చారట కానీ తనకు అదృష్టం లేక ఆ సినిమాకు చేయలేకపోయానని ఉపేంద్ర తాజాగా వెల్లడించారు. వ‌రుణ్ తేజ్ హీరోగా నటించిన గ‌ని సినిమాలో ఉపేంద్ర ముఖ్యమైన పాత్రలో నటించారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఉపేంద్ర ఈ విషయాన్ని వెల్లడించారు.

మెగాస్టార్ తో సినిమా తీసే అవకాశం మిస్ చేసుకున్నందుకు బాధపడ్డాన‌ని చెప్పారు. కానీ తాను నాగబాబుతో ఓ సినిమాలో నటించాన‌ని అన్నారు. అదేవిధంగా మెగా హీరో అల్లు అర్జున్ సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో నటించానని చెప్పారు. ఇప్పుడు గ‌ని సినిమాలో నటించే అవకాశం దక్కినందుకు సంతోషంగా ఉంద‌న్నారు.

ఇవి కూడా చదవండి: జ‌య‌సుధ నిజ జీవితానికి రాధేశ్యామ్ సినిమాకు ఉన్న లింక్ ఏమిటో తెలుసా..?

Visitors Are Also Reading