Home » నా పక్కనే కూర్చుంటావా అంటూ చిరంజీవిని అవమానించిన నటి.. ఎవరంటే…?

నా పక్కనే కూర్చుంటావా అంటూ చిరంజీవిని అవమానించిన నటి.. ఎవరంటే…?

by Sravanthi
Ad

తెలుగు ఇండస్ట్రీలో ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా సొంత టాలెంట్ తో ఎదిగిన హీరో ఎవరైనా ఉన్నారు అంటే ముందుగా గుర్తుకు వచ్చేది మెగాస్టార్ చిరంజీవి మాత్రమే. ఆయన ఇండస్ట్రీలో స్టార్ హీరో అవ్వడమే కాకుండా ఒకానొక టైం లో ఇండస్ట్రీ ని ఏలే స్థాయికి చేరుకున్నారు. ఇంతటి ఘనత సాధించడానికి ప్రధాన కారణం ఆయన కష్టం అని చెప్పవచ్చు. అలాంటి స్టార్ హీరోని ఓ హీరోయిన్ తీవ్రంగా అవమానించింది.. మరి ఆ హీరోయిన్ ఎవరో చూద్దాం.. చిరంజీవికి ఇండస్ట్రీలో పెద్దపెద్ద దర్శకులు నిర్మాతలు దగ్గర నుంచి కూడా చాలా అవమానాలు ఎదురయ్యాయట..

Advertisement

also read;ఈ క్యూట్ పాప ఎవరో గుర్తుపట్టారా.. ఈమె ఇండస్ట్రీలో స్టార్.. అందరికీ తెలిసిన నటి..!!

కానీ వాటిని చిరంజీవి ఇన్సల్ట్ గా తీసుకోకుండా, వారి లెవల్ వారిది నా లెవల్ నాది అనుకోని వదిలేసేవారట. తన కెరియర్ మొదట్లో హీరోయిన్ మాధవి తో ఒక సినిమా చేశారు చిరు. ఆ తర్వాత మాధవి తమిళ్లో చాలా బిజీ..స్టార్ హీరోయిన్గా మారింది. ఆ టైంలోనే చిరంజీవి తనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటూ ముందుకు సాగారు. ఆ టైంలో చిరంజీవి దగ్గరికి చిన్న నిర్మాతలు కొత్త దర్శకులు మాత్రమే వచ్చేవారు. అయినా చిరంజీవి వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుంటూ గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తూ వచ్చారు. ఈ క్రమంలో మాధవి తో ఒక పెద్ద సినిమాలో చిరంజీవి హీరోగా చేస్తున్నారు. అప్పటికే చిరంజీవి ఫియట్ కారు కూడా కొన్నారు.

Advertisement

హీరో కారులో వెళ్లకుంటే బాగుండదని స్నేహితులు చెప్పడంతో డబ్బు కూడబెట్టుకుని కారు కొనుక్కున్నారు. ఒకరోజు సినిమా షూటింగ్ వేరొక చోట కావడంతో కారును మద్రాసులోనే వదిలేసి వచ్చారు చిరు. హీరో హీరోయిన్లను హోటల్లో ఉంచారట నిర్మాతలు. హీరోయిన్ మాధవికి మంచి హోటల్లో బస ఏర్పాటు చేస్తే, చిరంజీవికి మాత్రం మామూలు హోటల్లో ఏర్పాటు చేశారు. కానీ చిరంజీవి వీటిని పట్టించుకునే వారు కాదు. ఆయనకున్న ఫోకస్ అంతా సినిమా పైనే. సినిమా హిట్ అవుతుందా కాదా అని ఆలోచించే వారట. కానీ మాధవి మాత్రం మొదటి నుంచి చిరంజీవిని పట్టించుకునేది కాదట. మరీ లోతుగా చెప్పాలంటే చిరంజీవిని లెక్కలోకి కూడా తీసుకునేది కాదట. షార్ట్ వరకే నటించి ఆ తర్వాత సీరియస్ గా దూరంగా వెళ్లి కూర్చునేదట.

ఓ రోజు హోటల్ లో ఉన్న మాధవి దగ్గరికి నిర్మాత కారు పంపారు. వచ్చే దారిలో మరో హోటల్ లో ఉన్న చిరంజీవిని కూడా తీసుకురావాలని డ్రైవర్ కు చెప్పారట నిర్మాత. మొదట మాధవిని ఎక్కించుకొని చిరంజీవి బస చేస్తున్న హోటల్ కి వచ్చారు డ్రైవర్. చిరు అప్పటికే రెడీ అయి వెయిట్ చేస్తున్నారు. కారు రాగానే చిరంజీవి కారు డోర్ తీసుకొని వెనుక సీట్ లో ఉన్న మాధవి పక్కన కూర్చున్నారు. వెంటనే మాధవి మీరు ముందు సీట్లో కూర్చోండని చెప్పిందట. కానీ చిరంజీవి మరో మాట అనకుండా ముందు సీట్లోకి వెళ్లి కూర్చున్నారు. ఇక అప్పటినుంచి వెనుక మాధవి ముందు డ్రైవర్ పక్కన చిరంజీవి కూర్చొని ఉండేవారట. దీంతో హర్ట్ అయిన చిరంజీవి ఎలాగైనా బాగా సంపాదించి, దేశంలో ఉన్న ప్రతి ఖరీదైన కారును కొనాలనుకున్నారట . ఇక అదృష్టం కలిసి వచ్చి ఆ మూవీ చిరంజీవిని స్టార్ చేసింది. తర్వాత మాధవి మెగాస్టార్ ఎన్నో సినిమాల్లో నటించారు. ఆ తర్వాత ప్రతి హీరోయిన్ చిరంజీవి పక్కన చేయాలనే కలను కనే స్థాయికి ఎదిగారు.

also read;నిఖిల్ కి కోపం తెప్పించిన హీరోయిన్.. ఎందుకో తెలుసా ?

Visitors Are Also Reading