Telugu News » Blog » నిఖిల్ కి కోపం తెప్పించిన హీరోయిన్.. ఎందుకో తెలుసా ?

నిఖిల్ కి కోపం తెప్పించిన హీరోయిన్.. ఎందుకో తెలుసా ?

by Anji
Ads

సాధారణంగా ఏ విషయంలో కామెడీ చేసినా కానీ..  ఆర్మీ, జవాన్ల విషయంలో మాత్రం ఎప్పుడూ తప్పు మాట్లాడకూడదు. వారిని హేళన చేసినట్టుగా కామెంట్స్ చేయకూడదు. ఎప్పటికప్పుడూ ఏదొక సందర్భంలో చెబుతూనే ఉంటారు. స్కూల్స్, కాలేజీ దశలోనే విద్యార్థులకు ఉపాధ్యాయులు, అధ్యాపకులు, తల్లిదండ్రులు ఏయే విషయాలపై ఎలా స్పందించాలి. 

Advertisement

Also : అక్కినేని అభిమానులని షాక్ కి గురు చేస్తున్న నాగార్జున నిర్ణయం ! మీరు సమర్థిస్తారా ?

ఎలా మాట్లాడాలి అనేవి నేర్పుతుంటారు. సామాన్యులంటే ఏం మాట్లాడిన అవి మీడియా వరకు వెళ్లకపోవచ్చు. సెలబ్రిటీ హోదాలో ఉన్నవారు ఏ మాత్రం నోరు జారినా, గౌరవించాల్సిన విషయాలను అగౌరవ పరిచినా ఎదుర్కోవాల్సిన పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ప్రస్తుతం అలాంటి పరిస్థితినే ఫేస్ చేస్తోంది బాలావుడ్ హీరోయిన్ రిచా చద్దా. ఇటీవల పాక్ ఆక్రమిత కశ్మీర్ నుంచి పాకిస్తాన్ ని వెనక్కి పంపేందుకు పూర్తి సిద్ధం అయ్యమని ప్రభుత్వం ఆర్డర్ పాస్ చేస్తే ఆపరేషన్ త్వరగా ముగిస్తాం అంటూ నార్త్ కమాండింగ్ ఇన్ చీఫ్ తెలిపారు. ఈ విషయంపై స్పందించిన స్పందించిన రిచా.. గాల్వాన్ హాయ్ చెబుతోంది అని పోస్ట్ చేసింది. దీంతో గాల్వాన్ ఘటనలో భారత సైనికులు 20 మంది మరణించారు.

Advertisement

Manam News

వాళ్ల త్యాగాన్ని అవమానపరిచే విధంగా పోస్ట్ చేయడం కరెక్ట్ కాదని.. రిచా పోస్ట్ పై మండిపోతున్నారు నెటిజన్లు. సినీ సెలబ్రిటీలు, ప్రస్తుతం రిచా చేసిన ట్వీట్ వివాదం చర్చనీయాంశంగా మారింది. రిచా ట్వీట్ ప్రత్యర్థి దేశానికి మద్దతుగా ఉన్నాయని కామెంట్స్ చేస్తూ.. ఆమెపై తీవ్ర విమర్శలు చేస్తూ వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. తాను చేసిన ట్వీట్ డిలేట్ చేసి.. తాను ఎవ్వరినీ ఉద్దేశించి ఆ ట్వీట్ చేయలేదు. ఎవరినైనా బాధించి ఉంటే క్షమించండి అని కోరింది. రిచా పోస్ట్ పై ఇప్పటికే హీరోలు మంచు విష్ణు, అక్షయ్ కుమార్ స్పందించారు. తాజాగా యంగ్ హీరో నిఖిల్ రిచా చద్దా ట్వీట్ పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. మన దేశాన్ని, మనలను కాపాడేందుకు గాల్వాన్ లో 20 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. వారి గురించి ఆలోచిస్తే ఇప్పటికీ కన్నీళ్లు ఆగవు. అలాంటి వారిని గౌరవించాలి. రాజకీయాలు మరిచిపోండి. దేశం తరువాత ఏదైనా అని తెలుసుకోండి అని రిచాపై ఫైర్ అయ్యాడు. ప్రస్తుతం నిఖిల్ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది. రిచా చద్దా వివాదంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి. 

Advertisement

Also Read :  ఆ హీరోయిన్ తో నాగ‌చైత‌న్య డేటింగ్ …? నెట్టింట వైర‌ల్ అవుతున్న ఫోటోలు..!