చాలా మంది ఏమనుకుంటారంటే తెలుగు సినిమా పరిశ్రమను హైదరాబాద్‌కు తరలించడంలో అక్కినేని నాగేశ్వర్‌రావు చాలా కీలక పాత్ర పోషించారని అనుకుంటారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. మొదటిసారి హైదరాబాద్‌లో ఓ ఇల్లు నిర్మించుకుని ఇక్కడ సినిమా చేయడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన హీరో అక్కినేని నాగేశ్వర్‌రావు. అదేవిధంగా హైదరాబాద్‌లో తొలి స్టూడియోగా చెప్పుకునేది సారథి స్టూడియో అని చెప్పుకోవచ్చు. అక్కినేని నాగేశ్వర్‌రావు సినిమా ప్రతిపాదన రావడం కూడా అన్ని వసతులు కలిగిన సారథి స్టూడియో ఏర్పాటు చేసారని పేర్కొంటారు.
Advertisement
ముఖ్యంగా రోజులు మారాయి అనే సినిమా సారథి నిర్మించారు. సారథి ప్రారంభకులు చల్లపల్లి జమీందార్ గారి నాయకత్వంలోనే మాలపిల్ల, రైతుబిడ్డ, తాపి చాణక్య దర్శకత్వంలో రోజులు మారాయి సినిమా వచ్చింది. ఇందులో విచిత్రం ఏమిటంటే.. చల్లపల్లి జమీందార్ నిర్మాతగా వ్యవహరించిన రైతుబిడ్డ సినిమా కథ ఏమిటో కూడా అడగలేదు. రైతుబిడ్డ సినిమాకు డబ్బులు ఆయనే పెట్టి.. ఆయనే సినిమాను ఆపడం విచిత్రమనే చెప్పవచ్చు. అయిరోజు రోజులుమారాయి సినిమా శత దినోత్సవం హైదరాబాద్‌లో నిర్వహించారు.
మంత్రిగా ఉన్న కే.వీ. రంగారెడ్డి శతదినోత్సవం వేడుకలో సినిమా పరిశ్రమ హైదరాబాద్‌కు వస్తే మీకు ఏవిధమైన సదుపాయాలు కావాలన్న మేము చేస్తాం అని పేర్కొనడంతోనే చల్లపల్లి జమీందార్ హైదరాబాద్‌లో సారథి స్టూడియో నిర్మించారు. అక్కినేని నాగేశ్వరరావు రోజులు మారాయి అనే సినిమా నుంచే హైదరాబాద్‌లో సినిమా పరిశ్రమ అనే మాట మొదలైంది. ముఖ్యంగా అక్కినేని నాగేశ్వర్‌రావు తనతో సినిమాలు చేసే నిర్మాతలను హైదరాబాద్‌లోనే సినిమాలు చేద్దాం అని చెప్పి ప్రధానంగా సారథి స్టూడియోస్ కేంద్రంగా ఆయన సినిమా నిర్మాణం జరిగేది. క్రమ క్రమంగా సారథి స్టూడియో అనేది కాట్రగడ్ల వాసు గారి చేతుల్లోకి వెళ్లింది. అక్కినేని నాగేశ్వరరావుకు, కాట్రగడ్డ వాసు మధ్య చిన్న కాంట్రవర్స్ వచ్చింది. దేవదాస్ అని కృష్ణ తీసిన సినిమాకు నవయుగ వారు అనగా కాట్రగడ్డ వాసు ఫైనాన్స్ చేశారు. ఆ సినిమా విడుదలయ్యే సమయానికి అక్కినేని దేవదాస్ విడుదల చేశాడు. అక్కినేని దేవదాస్ తో పోల్చుకుని కృష్ణ దేవదాస్ సినిమా సరిగ్గా ఆడలేదని తనకు రావాల్సిన డబ్బులు వెనక్కి రాలేదనే కోపం కాట్రగడ్డ వాసుగారి మనస్సులో ఉంది.
ఆయన తనను దెబ్బ తీయడం కోసం నాగేశ్వర్‌రావు పాత దేవదాస్‌ను విడుదల చేశారని నమ్మి.. అక్కినేని నాగేశ్వర్‌రావు సారథి స్టూడియోలో కాల్లు పెడితే కాళ్లు విరగ్గొడతాం అని పేర్కొన్నారు. నాగేశ్వర్‌రావు సారథిలోకి వెళ్లలేరు. అదేవిధంగా మద్రాస్‌లోకి వెళ్లి షూటింగ్‌లు చేయలేరు. ఆ సమయంలో ఏమి చేయాలో తెలియక అన్నపూర్ణ స్టూడియో ప్రారంభించారు. ఆ స్టూడియో ప్రారంభం అయ్యేంత వరకు బెంగళూరులో షూటింగ్‌లు చేసారు. దాదాపు 6 సినిమాల వరకు బెంగళూరులో షూటింగ్ జరిగాయి. ఆ తరువాత అన్నపూర్ణ స్టూడియో ప్రారంభమైంది.
Also Read : వార్నీ…పుష్పలో ఈ డైలాగ్ ను సుకుమార్ అక్కడ నుండి కాపీ కొట్టారా..!
అక్కినేని నాగేశ్వర్‌రావు ఎక్కువగా హైదరాబాద్‌లో ఉండటం, ముఖ్యమంత్రులతో ఎక్కువ సాన్నిహిత్యాన్ని కలిగి ఉండేవాడు. ప్రభుత్వంతో ఏదైనా వ్యవహారం ఉంటే తొలుత మాట్లాడేది అక్కినేని నాగేశ్వర్‌రావు కావడం విశేషం. మిగిలిన హీరోలందరూ కొంచెం దూరంగానే ఉండేవారు. ముఖ్యంగా నందమూరి తారక రామారావు కూడా ముఖ్యమంత్రులను కలిసే కార్యక్రమాలు చేసేవాడు కాదు. ఏదైనా సమస్య ఉంటే నిర్మాతలు పరిష్కారం లేదా అక్కినేని రంగంలోకి దిగేవారు తప్ప ఏ హీరో కూడా ప్రభుత్వంతో సంప్రదించే వారు. అప్పటి ముఖ్యమంత్రులైనటువంటి కాసు బ్రహ్మనందరెడ్డి, నీలం సంజీవరెడ్డి, జలగం వెంగల్‌రావు, మర్రిచెన్నారెడ్డి, టంగుటూరి అంజయ్య ఇలా ముఖ్యమంత్రి ఎవరైనా నాగేశ్వర్‌రావు వారితో సాన్నిహిత్యంగా ఉండేవారు.
Advertisement
ఒక దశలో అక్కినేని సుడిగుండాలు, ఎస్వీ రంగారావు బాంధవ్యం సినిమాలు ఒక సమయంలో విడుదల అయ్యాయి. వాటిలో తన సినిమాకు అవార్డు వస్తుందని ఎస్వీ రంగారావు భావించారు. విచిత్రంగా అక్కినేని నాగేశ్వర్‌రావు సుడిగుండాలు సినిమాకు నంది అవార్డు ప్రకటించారు. ఏఎన్నార్ పొద్దున లేచిందంటే ముఖ్యమంత్రులతో తిరగడం వల్లనే అందువల్లనే పైరవీ చేసి తన సినిమాకు అవార్డు తెచ్చుకున్నాడు అని ఎస్వీ పేర్కొన్నారు. ఆ తరువాత ఎస్వీ రంగారావు సుడిగుండాలు సినిమా చూశారు. చూసిన తరువాత సుడిగుండాలు సినిమాకు నంది అవార్డు రావడంతో తప్పేమి లేదని పేర్కొన్నాడు. హైదరాబాద్ లో ఫిల్మ్‌నగర్ ఏర్పాటు వెనుక అక్కినేని పాత్ర కీలకమనే చెప్పవచ్చు.
టీ.అంజయ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఫిల్మ్‌నగర్ ప్రారంభమైంది. ఫిల్మ్‌నగర్ అనే పేరు డీవీఎస్ రాజు పెట్టారు. సినిమా పరిశ్రమ తరలిరావడంలో అక్కినేని నాగేశ్వర్‌రావుతో పాటు ఎన్టీఆర్ కూడా కీలక పాత్ర పోషించారని మాట్లాడుతున్నారు. వాస్తవానికి ఎన్టీఆర్ బయోఫిక్‌లో కూడా ఈ విషయం ప్రస్తావనకు వచ్చింది. హైదరాబాద్‌కు సినిమా పరిశ్రమను తీసుకెళ్లాలని ఓ సన్నివేశం ఉంటుంది. వాస్తవానికి ఎన్టీఆర్ మద్రాస్ నుంచి హైదరాబాద్ రావడానికి అంత సుముఖంగా లేడు. సినిమా పరిశ్రమను హైదరాబాద్‌కు తీసుకురావడం అనేది ఎన్టీఆర్‌కు నచ్చలేదు. మద్రాస్‌లోనే ఉంటే బెటర్ అనేది ఎన్టీఆర్ అభిప్రాయం. ముఖ్యంగా ఎన్టీఆర్ తన నిర్మాతలందరితోనూ ఒక మెమోరండం తయారుచేయించి అప్పటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మనందరెడ్డి మద్రాస్ వచ్చిన సందర్భంలో ఆయన అపాయింట్‌మెంట్ తీసుకొని నిర్మాతలతో ఒక మెమొరండం ఇప్పించారు ఎన్టీఆర్.
హైదరాబాద్‌కు సినిమా పరిశ్రమ తరలించడానికి కొంత మంది ప్రయత్నం చేస్తున్నారు. హైదరాబాద్‌కు వెళ్లితే చాలా ఖర్చవుతుంది. సినిమా పరిశ్రమ మద్రాస్ లోనే ఉంటే బెటర్. ఇక్కడ తక్కువ డబ్బులతో పని అయిపోతుంది. ఎటువంటి ఇన్‌ప్రాస్ట్రక్షర్ లేనటువంటి హైదరాబాద్‌కు సినిమా పరిశ్రమను తీసుకెళ్లడం తగదు అని ఎన్టీఆర్ తన నిర్మాతలతో మెమొరండం తయారు చేయించి ముఖ్యమంత్రికి అప్పట్లో ఇప్పించారు. అప్పట్లో ఎన్టీఆర్‌కు హైదరాబాద్‌లో కూడా ఆస్తులున్నాయి. కానీ హైదరాబాద్‌లో సినిమా పరిశ్రమ రావడానికి సుముఖత వ్యక్తం చేయలేదు.
1972లో జై ఆంధ్ర ఉద్యమం జరిగినప్పుడు సూపర్ స్టార్ కృష్ణ జై ఆంధ్ర ఉద్యమానికి మద్దతు తెలియజేస్తూ ఓ ప్రకటన ఇచ్చారు. కృష్ణ ను ఇంటికి పిలిచి ఎన్టీఆర్ మందలించారు. మద్దతు ఇవ్వాలనే విషయం మాకు తెలియదా..? మాకు ఆస్తులున్నాయి అక్కడ. పబ్లిక్ రియాక్ట్ అయితే ఏమిటి పరిస్థితి అని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో ఉన్నటువంటి మా ఆస్తులను ధ్వంసం చేస్తే పరిస్థితి ఏమిటని కృష్ణను మందలించారు ఎన్టీఆర్. ఎప్పుడు ఏమి మాట్లాడాలో కొంచెం సంయమనంతో మాట్లాడండి అని కృష్ణకు చెప్పారు ఎన్టీఆర్. జమునకు కూడా గుంటూరులో సినిమా థియేటర్ ఉండేది. జై ఆంధ్ర ఉద్యమానికి మద్దతుగా ఆమె సినిమా థియేటర్ లో షోలు నిలిపివేస్తున్నట్టు బహిరంగంగా ప్రకటించడంతో.. ఎన్టీఆర్ ఆమెతో కూడా మట్లాడారు. మొత్తానికి సినిమా పరిశ్రమ హైదరాబాద్‌కు తరలిరావడానికి ఎన్టీఆర్ వ్యతిరేకంగా ఉండేవారు. ముఖ్యంగా నాగేశ్వర్‌రావుకు సంబందించిన వారిని హైదరాబాద్ ముఠా అని కూడా పిలిచే వారట ఎన్టీఆర్.
Also Read : బాహుబలి దోశ తింటే రూ.71వేలు బహుమతి