Home » అమ్మాయిలు అబ్బాయిల్లో చూసేది ఆ ఒక్కటి మాత్రమే.. అది మీకు ఉన్నాయా..?

అమ్మాయిలు అబ్బాయిల్లో చూసేది ఆ ఒక్కటి మాత్రమే.. అది మీకు ఉన్నాయా..?

by Sravanthi Pandrala Pandrala

ఈ మానవ సమాజంలో ఏ బంధం నిలబడాలి అన్న ప్రేమ, అనురాగం, ఆప్యాయత అనేది తప్పనిసరిగా ఉండాలి. అప్పుడప్పుడు కాస్త కోపం కూడా ఉంటే ఆ ప్రయాణం మంచిగా సాగుతుంది. ముఖ్యంగా ఒక అమ్మాయి ఒక అబ్బాయి మనసులు కలిసి ఏకతాటిపై ప్రయాణం చేయాలి అంటే వారి మధ్య ఎన్నో విషయాల్లో సఖ్యత కుదరాలి.. అలా ఉన్నప్పుడే వారి బంధం బలపడుతుంది.. ఇక చాలామంది అబ్బాయిలు, అమ్మాయిలు అంటే చులకనగా చూస్తూ దురుసుగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఒక అబ్బాయిని అమ్మాయి మెచ్చాలి అంటే కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలంటున్నారు నిపుణులు..

సమాజంలో అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిలు చాలా సున్నిత మనస్కులు.. ముఖ్యంగా అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిలు వారి యొక్క హావ భావాలను ఇతరులతో పంచుకోవడానికి ఇష్టపడరు. అంతేకాకుండా అమ్మాయిల మనసులో ఉన్న ఆలోచనలను అర్థం చేసుకోవడం చాలా కష్టం. అలాంటి ఆలోచన కలిగిన అమ్మాయిలు కొన్ని విషయాలలో మాత్రం ఆసక్తి చూపుతారు.. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. సాధారణంగా ఒక్కో అమ్మాయికి ఒక్కో విధమైన వ్యక్తిత్వం ఉంటుంది.. అలాంటి అమ్మాయిలను ఇతరులతో అస్సలు పోల్చకూడదు..

మరీ ముఖ్యంగా ఒక అమ్మాయిని మరో అమ్మాయితో పోలిస్తే వాళ్లు చాలా కోపానికి వస్తారట. దీనికి ప్రధాన కారణం అమ్మాయిలకు అసూయ ఎక్కువగా ఉంటుందట. దీనివల్ల వారి వ్యక్తిత్వాన్ని కించపరిస్తే అస్సలు ఊరుకోరు.. ముఖ్యంగా అమ్మాయిలు పొగిడితే సంతోషిస్తారు. కాబట్టి వారి పనులను మరియు వారి తెలివితేటలను,అందానికి ప్రశంసలు అందిస్తే వారు చాలా ఆనందిస్తారు. అలాగే స్త్రీలను గౌరవంగా చూడాలి. ఆడపిల్లలతో మర్యాదగా ఉండే వారిని ఎక్కువగా ఇష్టపడతారు. సాధారణంగా అమ్మాయిలు చిన్న చిన్న విషయాలకే సంతోషంగా ఉంటారు. కాబట్టి వారి చిన్న చిన్న వస్తువులను బహుమతిగా ఇవ్వడం వల్ల సంతోషంగా ఉంటారు.

also read:

Visitors Are Also Reading