Home » Bro:బ్రో మూవీలో ఆ పొలిటికల్ సీన్ ను అందుకే తొలగించారా? ఒకవేళ ఆ సీన్ ఉండుంటే?

Bro:బ్రో మూవీలో ఆ పొలిటికల్ సీన్ ను అందుకే తొలగించారా? ఒకవేళ ఆ సీన్ ఉండుంటే?

by Srilakshmi Bharathi
Published: Last Updated on
Ad

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ మల్టీ సార్టర్లుగా తెరకెక్కిన బ్రో చిత్రం ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తుంది. తమిళ సినిమా వినోదయ సీతంకు రీమేక్ గా వచ్చిన బ్రో చిత్రాన్ని తెలుగు మరియు తమిళ భాషల్లో సముద్రఖనియే దర్శకత్వం వహించారు. కాగా దర్శకుడు త్రివిక్రమ్ ఈ సినిమాలో కొన్ని మార్పులు చేసి తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా రూపొందించారు. కేవలం 21 రోజుల్లోనే ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుని అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తింది.

Advertisement

అయితే.. ఈ సినిమా విడుదల అయ్యాక మంచి టాక్ తెచ్చుకుంటోంది. ఈ సినిమాలో ఒక సాంగ్ అంబటి రాంబాబు ని ఇమిటేట్ చేస్తూ తీసారని బయట టాక్ నడుస్తోంది. ఈ విషయమై ఇప్పటికే సోషల్ మీడియాలో చాలా ట్రోలింగ్ జరిగింది. పలువురు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు దీని గురించి స్పందించిన అంబటి రాంబాబు కూడా పవన్ కళ్యాణ్ పై నేను కూడా సినిమాలు తీయిస్తా అంటూ రకరకాల పేర్లు చెప్పారు.

Advertisement

అయితే.. బ్రో సినిమాలో అసలు సిసలు పొలిటికల్ సీన్ ని తొలగించారట. బ్రో సినిమాకు మూలం అయిన వినోదయ సీతం సినిమాలో ఒక పొలిటికల్ సన్నివేశం ఉంటుంది. ఓ రాజకీయ నేత తన అనుచర గణంతో మాట్లాడుతూ.. త్వరగా ఏ విషయం చెప్పాలని, త్వరలోనే పదివేల మంది వాలంటీర్లు నా పార్టీలో చేరతారు.. నేను ఈ దేశ భవిష్యత్ నే మార్చేస్తాను, నాకు మంత్రి పదవి వస్తుంది.. అంటూ చెబుతాడు. నీవు వారితో మాట్లాడావా? అవి వస్తున్నాయా? అని మరొకరిని అడుగుతాడు. ఒక కంటైనెర్ వస్తోందని, ఫామ్ హౌస్ లో గోతిని తీయాలని చెప్తాడు. డబ్బు వచ్చాకా.. ఆ డబ్బుని భూమిలో పాతిపెట్టి, పైన టమాటా తోట వేయమని చెబుతారు. అతని అనుచరుడు అలాగే చేస్తాను అని చెప్పి.. ఇప్పటికే 21 కోట్ల రూపాయలు భూమిలో పాతిపెట్టాము వాటి గురించి ఏమిటని అడుగుతాడు. ముట్టుకోవద్దు, వాటిని ఎలెక్షన్స్ లో ఖర్చు చేయాలి అని సదరు నేత చెప్పడం తో ఈ సన్నివేశం ముగుస్తుంది. ఒకవేళ ఈ సీన్ నిజంగానే సినిమాలో ఉండుంటే.. రియాక్షన్ ఎలా ఉండేదో అని ఫాన్స్ చర్చించుకుంటున్నారు.

మరిన్ని ముఖ్యమైన వార్తలు : 

పుష్ప 2 మూవీలో తమిళ స్టార్ హీరో నటించనున్నాడా..?

జబర్దస్త్ లో ఒక్కో ఎపిసోడ్ కి ఇంద్రజ తీసుకునే రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా…?

Visitors Are Also Reading