Home » ఉదయ్ కిరణ్ చావుకు అసలు కారణం అదే.. కమెడీయన్ కీలక వ్యాఖ్యలు..!

ఉదయ్ కిరణ్ చావుకు అసలు కారణం అదే.. కమెడీయన్ కీలక వ్యాఖ్యలు..!

by Anji
Ad

తెలుగు బుల్లితెరపై నెంబర్ వన్ కామెడీ షో గా వెలుగొందుతూ.. సుదీర్ఘకాలంగా తన ప్రభావాన్ని చూపిస్తోంది జబర్దస్త్ కామెడీ షో. ఒక వైపు వినోదాన్ని పంచుతూనే.. మరోవైపు ఎంతో మంది ఆర్టిస్టులను అందిస్తోంది. అలా చాలా మంది జబర్దస్త్ ద్వారా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. అలా ఫేమస్ అయి సినిమా అవకాశాలను దక్కించుకున్న వారిలో షేకింగ్ శేషు ఒకరు. తనకంటూ ప్రత్యేకతను చాటుకుంటూ చాలా సినిమాల్లో ప్రేక్షకులను మెప్పించారు. ఈ తరుణంలోనే తాజాగా షేకింగ్ శేషు టాలీవుడ్  నటుడు ఉదయ్ కిరణ్ మరణం గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

 

Advertisement

గతంలో ఆయన ఓ యూట్యూబ్ కి ఛానెల్ కి ఇంటర్య్యూ ఇచ్చాడు. ఇప్పుడు అది తెగ వైరల్ అవుతోంది. ‘జబర్దస్త్ సెట్ లో నాతో అందరూ ఎంతో స్నేహంగా ఉండేవారు. సీనియర్లు అయినా నన్ను గౌరవంగా పిలుస్తుంటారు. అందరూ డాడీ, బాబాయ్ అని పిలుస్తుంటారు. జడ్జ్ లు కూడా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడేవారు. జబర్దస్త్ వల్లనే నాకు మంచి గుర్తింపు లభించింది. అక్కడ నా ప్రదర్శన చూసిన తరువాత చాలా సినిమాల్లో ఆఫర్లు వచ్చాయి. కొందరూ అయితే నా స్కిట్లు చూసి అవకాశాలు ఇస్తామని పిలిచారు. సాయి ధరమ్ తేజ్ సుప్రీమ్ సినిమాలో ఛాన్స్ కూడా అలాగే వచ్చింది. ఎన్నో సినిమాలు చేసిన జబర్దస్త్ లో పెట్టిన షేకింగ్ శేషు పేరుతోనే పిలుస్తుంటారు’ అని తెలిపారు.

Advertisement

 

ఒక దశలో అవకాశాలు రాలేదని చచ్చిపోవాలని అనిపించింది. నటించడం కోసమే ఇండస్ట్రీకి వచ్చిన వాడికి మంచి డైరెక్టర్ సినిమాలో అవకాశం రాకపోతే ఏం చేయాలి.? సంసారాన్ని పోషించలేని వాడు ఆ**త్మహత్య చేసుకుంటున్నట్లే.. గొప్ప దర్శకుల సినిమాల్లో అవకాశాలు రాకపోతే చాలా బాధగా ఉంటుంది’ అంటూ బాధను వ్యక్తం చేశారు.   తెలుగు చిత్ర పరిశ్రమలో తక్కువ సమయంలోనే స్టార్‌గా ఎదిగిన వారిలో ఉదయ్ కిరణ్ ఒకరు. ఈ యంగ్ హీరో ఆ**త్మహ**త్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఇంటర్వ్యూలో శేకింగ్ శేషు దానిపై స్పదించారు. ‘గతంలో హీరో ఉదయ్ కిరణ్‌కు అవకాశాలు రాకనే అలా చేసుకున్నాడు. ఆయన చావుకు అవకాశాలు ఇవ్వని వాళ్లే కారణం’ అంటూ సంచలన వ్యాఖ్యలనే చేశారు.  ఇప్పుడు ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

Also Read :  రావు గోపాల్ రావు మీద నాగార్జున అరవడానికి కారణం ఏంటో తెలుసా ?

 

Visitors Are Also Reading