మనదేశంలోని లెజండరీ దర్శకులలో మణిరత్నం కూడా ఒకరు. యథార్థ సంఘటనల ఆధారంగా సృజనాత్మకతో మనిరత్నం సినిమాలు ఉంటాయి. ఆయన దర్శకత్వంలో ఎన్నో క్లాసిక్ లు వచ్చాయి. రీసెంట్ గా మణిరత్నం పొన్నియన్ సెల్వన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇదిలా ఉండగా మణిరత్న దర్శకత్వంలో వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమాల్లో ముంబాయి సినిమా కూడా ఒకటి.
Also Read: ఆదిపురుష్ సినిమాకి హిందీలో ప్రభాస్‌కి వాయిస్ ఇచ్చింది ఎవరో తెలుసా..?
Advertisement
ఈ సినిమాకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ సినిమాలోని పాటలు…సీన్లు ఇప్పటికీ వైరల్ అవుతూనే ఉంటాయి. ముంబాయి సినిమా నిజజీవితానికి అద్దం పట్టేలా ఉంటుంది. ఇక మణిరత్నం రోజా సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యాడు. ఈ సినిమాలో అరవింద్ స్వామి మధుబాల హీరోహీరోయిన్ లుగా నటించారు. ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది.
Advertisement
1993 సంవత్సరంలో జరిగిన ముంబై అల్లర్ల ఘటన పై మణిరత్నం సినిమా చేయాలని అనుకున్నారు. బాబ్రీ మసీద్ కూల్చివేడంతో రెండు వర్గాల మధ్య గొడవలు చెలరేగాయి. ఆ సమయంలో ముంబైలో దారుణమైన వాతావరణం నెలకొంది. ఆ ఘటనలు మణిరత్నం ను కదిలించాయి. ఇక ఆ ఘటనలను బేస్ చేసుకుని మణిరత్నం ముంబాయి సినిమా కథను సిద్దం చేసుకున్నాడు. అయితే ఈ సినిమా కథను మొదట హీరో విక్రమ్ కు చెప్పాడు మణిరత్నం.
కానీ విక్రమ్ ఆ సినిమా సమయంలో గడ్డం మీసం పెంచుకుని ఉన్నాడు. అయితే సినిమా కోసం గడ్డం మీసం తీసేయాలని మణిరత్నం విక్రమ్ ను కోరాడు. కానీ విక్రమ్ అందుకు నిరాకరించారట. దాంతో మణిరత్నం ఆ సినిమా కథను అరవింద్ స్వామికి చెప్పి ఒప్పించాడు. అలా తెరకెక్కిన ముంబాయి సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ అయ్యింది. ఇప్పటికీ ఈ సినిమా టీవీలో వస్తే మిస్ కాకుండా చూసేవాళ్లు ఉన్నారు.
Also Read: ఆదిపురుష్ అనుకుంటే శక్తి సినిమా తీశారు అంటూ పోస్టర్ పై ట్రోల్స్…!