Home » భీమ్లా నాయ‌క్ థియేట‌ర్ లో ఫ్యాన్స్ తో త‌మ‌న్ రచ్చ‌…వీడియో వైర‌ల్…!

భీమ్లా నాయ‌క్ థియేట‌ర్ లో ఫ్యాన్స్ తో త‌మ‌న్ రచ్చ‌…వీడియో వైర‌ల్…!

by AJAY
Ad

వ‌రుస సినిమాల‌కు సంగీతం అందిస్తూ త‌మ‌న్ ఫుల్ బిజీగా మారాడు. అల వైకుంఠ‌పురంలో సినిమాతో త‌మ‌న్ క్రేజ్ టాలీవుడ్ నుండి బాలీవుడ్ వ‌ర‌కూ పాకిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా పాట‌కు ప‌లువురు క్రికెట‌ర్లు వీడియోలు చేశారు. అంతే కాకుండా ఈ సినిమాలోని పాట‌లు శ్రోత‌ల‌కు బాగా న‌చ్చ‌డంతో ఈ ఆల్బ‌మ్ సూప‌ర్ హిట్ గా నిలిచింది. ఇక ఈ సినిమా త‌ర‌వాతే త‌మ‌న్ గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తున్నాడు.

Bheemla nayak

Advertisement

ఇక నిన్న ఎన్నో అంచనాల న‌డుమ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన భీమ్లానాయ‌క్ సినిమాకు కూడా త‌మ‌న్ స్వ‌రాలు స‌మ‌కూర్చాడు. ఈ సినిమా ఆల్బ‌మ్ కు కూడా పాజిటివ్ రెస్పాన్స్ వ‌స్తోంది. అంతే కాకుండా త‌మ‌న్ ఇచ్చిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయిందంటూ ప్ర‌శంస‌లు అందుతున్నాయి. ఇక వ‌రుస హిట్ల‌తో జోరుమీదున్న త‌మ‌న్ ఈ మ‌ధ్య డ్యాన్స్ లు కూడా చేస్తున్నారు.

Advertisement

bheemla nayak adavi thalli song

bheemla nayak adavithalli song

రీసెంట్ గా త‌మ‌న్ తాను మ్యూజిక్ అందించిన స‌ర్కారు వారి పాట సినిమాలోని క‌ళావ‌తి పాట‌కు డ్యాన్స్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైర‌ల్ అవుతోంది. ఇదిలా ఉండ‌గా త‌మన్ తాజాగా భీమ్లానాయక్ సినిమాకు వెళ్లాడు. అంతే కాకుండా థియేట‌ర్ లో లాల్ లాల్ భీమ్లా పాట వ‌స్తుండ‌గా స్కీన్ వ‌ద్ద‌కు వెళ్లి అభిమానుల‌తో క‌లిసి స్టెప్పులు వేశాడు. త‌మ‌న్ తో పాటూ సింగ‌ర్ రేవంత్ కూడా స్క్రీన్ వ‌ద్ద స్టెప్పులు వేశాడు.

ప్ర‌స్తుతం ఈ వీడియో నెట్టింట వైర‌ల్ అవుతోంది. ఇక త‌మ‌న్ భీమ్లా నాయ‌క్ పై ముందు నుండి అంచనాల‌ను పెంచుతున్న సంగ‌తి తెలిసిందే. ఇదిలా ఉంటే భీమ్లా నాయ‌క్ సినిమాకు కూడా బ్లాక్ బ‌స్ట‌ర్ టాక్ వ‌స్తోంది. అంతే కాకుండా ఈ చిత్రానికి క‌లెక్ష‌న్ ల వ‌ర్షం కురుస్తోంది. రెండో రోజు కూడా థియేట‌ర్ల వ‌ద్ద భీమ్లా నాయ‌క్ హ‌వా క‌నిపిస్తోంది.

Visitors Are Also Reading