Home » తెలంగాణ లో వాహనదారులు TS నుంచి TG కి మార్చుకోవాల్సిందేనా ? తప్పక తెలుసుకోండి !

తెలంగాణ లో వాహనదారులు TS నుంచి TG కి మార్చుకోవాల్సిందేనా ? తప్పక తెలుసుకోండి !

by Anji
Published: Last Updated on
Ad

రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు కీలక నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన ఈ భేటీలో తెలంగాణ తల్లి విగ్రహ రూపం, రాష్ట్ర అధికార చిహ్నంలో మార్పులు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. రాష్ట్ర గీతంగా అందెశ్రీ రచించిన జయ జయహే తెలంగాణను మంత్రి మండలి ఖరారు చేసింది. వాహనాల రిజిస్ట్రేషన్‌లో TS స్థానంలో TGగా మారుస్తూ కేబినెట్ తీర్మాణం చేసింది. రాష్ట్ర పేరు మార్పుతో ప్రజల్లో తమ వాహనాల నెంబర్ ప్లేట్ల విషయంలో కొత్త ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అవి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Advertisement

రాష్ట్ర ప్రజలకు తమ వాహన నెంబర్ ప్లేట్ల విషయంలో కొత్త డౌట్ మొదలైంది.. దీనిపై చర్చ నడుస్తుంది. అయితే ఇప్పటి వరకు ఉన్న అనధికార సమాచారం మేరకు టీఎస్ నెంబర్ ప్లేట్లను మర్చుకోవాల్సిన అవసరం లేదని.. ప్రభుత్వ జీవో వచ్చిన తర్వాత అప్పటి నుంచి కొత్తగా రిజిస్ట్రేషన్ అయ్యే వాహనాలకు మాత్రమే టీజీ కేటాయిస్తారని తెలుస్తోంది.  తాజాగా కేబినెట్ నిర్ణయాలపై  సీఎం రేవంత్ ట్వీట్ కూడా చేశారు. తెలంగాణ సాంస్కృతిక వారసత్వంగా జయ జయహే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర అధికారిక గీతంగా కేబినెట్‌ ప్రకటించినట్లు సీఎం రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. 

Advertisement

సీఎం  ఎక్స్‌లో ట్వీట్‌ చేస్తూ ఒక జాతి అస్థిత్వానికి చిరునామా భాష, సాంస్కృతులే వారసత్వంగా ఉంటాయని వివరించారు. సగటు తెలంగాణ ఆడబిడ్డ రూపురేఖలే తెలంగాణ తల్లి విగ్రహానికి ప్రతిరూపంగా ఉండాలని తాము భావిస్తున్నట్లు పేర్కొన్నారు. రాచరికపోకడలు లేని చిహ్నమే రాష్ట్ర అధికారిక చిహ్నంగా ఉంటుందని వెల్లడించారు. వాహన రిజిస్ట్రేషన్లలో TS బదులు ఉద్యమ సమయంలో ప్రజలు నినాదించిన TG ని తీసుకురావాలన్నది నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష అని పేర్కొన్నారు. వాటిని నెరవేరుస్తూ రాష్ట్ర కేబినెట్ లో ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించారు సీఎం రేవంత్ రెడ్డి. 

మరిన్నీ  తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading