Home » మన దేశంలో రహస్యాలు దాగి ఉన్న దేవాలయాల గురించి మీకు తెలుసా ?  

మన దేశంలో రహస్యాలు దాగి ఉన్న దేవాలయాల గురించి మీకు తెలుసా ?  

by Anji
Ad

భారతదేశంలో కొలువై ఉన్న దేవాలయాల్లో కొన్ని రహస్యాలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి. ఇప్పటికే కొన్ని ఆలయాల్లో దాగి ఉన్న రహస్యాలు ఎవరికీ కూడా అంతుచిక్కడం లేదు. ఎవరికీ తెలియని రహస్యాలు దాగి ఉన్న గుజరాత్ లో ఉన్నటువంటి 5 దేవాలయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Advertisement

అక్షరధామ్ ఆలయం :

 Manam News

గుజరాత్ రాజధాని అయినటువంటి గాంధీనగర్ లో ఉన్న అక్షరధామ్ ఆలయం ప్రపంచంలోని అతిపెద్ద హిందూ దేవాలయాలలో ఒకటి అని చెప్పవచ్చు. భారతదేశంలో ఉన్న ఈ దేవాలయం స్వామి నారాయణకు చెందింది. అందమై ఆలయం అహ్మదాబాద్ నుంచి కేవలం 28 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. గాంధీనగర్ సెక్టార్ 20లో ఉంది.

అంబాజీ ఆలయం :

Manam News

ఈ అంబా ఆలయం గుజరాత్ లోని ప్రధాన పవిత్ర స్థలాల్లో ఒకటి. అదేవిధంగా అమ్మవారి శక్తి పీఠాల్లో ఇది ఒకటి. అంబాజీ ఆలయం అంబ, శ్రీ కృష్ణుడితో ముడిపడి ఉంది. అంబాజీ దేవాలయం అత్యంత ప్రసిద్ధ హిందూ పుణ్యక్షేత్రాల్లో ఒకటి. ఈ అందమైన ఆలయం అహ్మదాబాద్ నుంచి దాదాపు 180 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. 

ద్వారకాధీష్ ఆలయం :

Manam News

Advertisement

భారతదేశంలోని నాలుగు దేవాలయాల్లో ఒకటి అయిన ద్వారక యాత్రికుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. ద్వారకను విష్ణువు అవతారం అయిన శ్రీ కృష్ణుడు స్థాపించి పరిపాలించాడు. ద్వారకాధీష్ శ్రీ కృష్ణుడికి అంకితం చేయబడిన అత్యంత అద్భుతమైన దేవాలయాల్లో ఒకటి. ద్వారకధీష్ దేవాలయం అహ్మదాబాద్ నుంచి 441 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. 

Also Read :  వెల్లుల్లికి వారు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.. ఒకవేళ తింటే అంతే సంగతులు..!

సోమనాథ్ ఆలయం :

Manam News

భారతదేశంలోని అత్యంత పురాణ ఆలయాల్లో సోమనాథ్ ఆలయం ఒకటి. దాదాపు 12 జ్యోతిర్లింగాలలో ఇది అతి ముఖ్యమైనది. ఇది గుజరాత్ లోని వెరావల్ తీరంలో ఉంది. అహ్మదాబాద్ నుంచి 412 కిలోమీటర్ల దూరంలో ఉంది. చాలా మంది పర్యాటకులు రాజ్ కోట్ నుంచి కూడా సోమనాథ్ ని సందర్శించడానికి వస్తారు. ఈ ఆలయాన్ని గతంలో మొఘలులు చాలా సార్లు కూల్చేశారు. 

జైన గిర్నార్ ఆలయం :

Manam News

గుజరాత్ లోని జునాగఢ్ లోని గిర్నార్ పర్వతం గొప్ప మతపరమైన ప్రాముఖ్యతను కలిగి ఉంది. గిర్నార్ పర్వతంలోనే జైనుల 22వ తీర్థంకరుడు అయిన నేమినాథ్ జి తీవ్ర తపస్సు చేసి మోక్షం పొందాడు. 

Also Read : సమంతకు అమ్మను అవుతా…దేవుడిలా రక్షిస్తా- రష్మిక

Visitors Are Also Reading