Telugu News » Blog » సమంతకు అమ్మను అవుతా…దేవుడిలా రక్షిస్తా- రష్మిక

సమంతకు అమ్మను అవుతా…దేవుడిలా రక్షిస్తా- రష్మిక

by Bunty

తెలుగు సినిమా ఇండస్ట్రీలో దశాబ్ద కాలానికి పైగా తిరుగులేని హీరోయిన్ గా కొనసాగుతోంది సమంత. ఏం మాయ చేసావే సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి ఎంతో ఇచ్చిన అమ్మడు తాజాగా విడుదలైన యశోద వరకు ఎక్కడ కూడా విరామం తీసుకోలేదు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తన నటన, టాలెంట్ తో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. అయితే నాగచైతన్యతో విడాకుల తర్వాత మయోసైటిస్ అనే వ్యాధి బారిన పడింది. దీనిపై ఆమె ఇటీవల ప్రకటించింది. దీంతో ఆమె ఫ్యాన్స్ ఆందోళనకు గురయ్యారు.

Advertisement

అయితే, తాజాగా సమంత అనారోగ్యం గురించి మాట్లాడుతూ హీరోయిన్ రష్మిక మందన ఎమోషనల్ అయింది. రష్మిక నటించిన వారిసు మూవీ తెలుగులో వారసుడు పేరుతో జనవరి 12న రిలీజ్ కాబోతోంది. ఆ తర్వాత రోజుల వ్యవధిలోనే మిషన్ మజ్ను కూడా నేరుగా ఓటిటిలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మీడియాకి వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్న రష్మిక మందన, సమంత గురించి అడిగిన ప్రశ్నకి సమాధానం చెబుతూ ఎమోషనల్ అయింది.

Advertisement

సమంత ప్రకటించే వరకు ఆ మయోసైటీస్ వ్యాధి భారిన ఆమె పడినట్లు తనకు తెలియలేదని రష్మిక ఎమోషనల్ గా చెప్పుకొచ్చింది. సమంత మయోసైటీస్ బారిన పడినట్లు తను ప్రకటించే వరకు నాకు కూడా తెలియదు. మేము కలిసి చాలా విషయాలు మాట్లాడుకున్నా, తను ఎప్పుడూ ఆ విషయం గురించి మాటమాత్రంగా కూడా చెప్పలేదు. సమంత చాలా అందమైన, దయగల మహిళ. ఒక అమ్మలా తనని ప్రొటెక్ట్ చేయాలని అనుకుంటున్నా. జీవితంలో తను ఎన్నో సవాళ్లతో పోరాడి నిలబడింది. అందుకే సమంత అంటే అందరిలా నాకు కూడా స్ఫూర్తి అనే రష్మిక చెప్పుకొచ్చింది.

READ ALSO : Punarnavi : అనారోగ్యానికి గురైన మరో హీరోయిన్‌.. ఊపిరితిత్తుల సమస్యతో..