Home » రిలీజ్ కు 6 సీక్వెల్స్ రెడీ ! వ‌రుస‌గా వ‌స్తున్న పార్ట్ 2 లు!!

రిలీజ్ కు 6 సీక్వెల్స్ రెడీ ! వ‌రుస‌గా వ‌స్తున్న పార్ట్ 2 లు!!

by Azhar

ఈ మ‌ధ్య టాలీవుడ్‌లో సీక్వెల్స్ హ‌వా బాగా ఎక్కువ‌యిపోయింది. ఈ ఏడాదిలో తెలుగు ప్రేక్షకుల ముందుకు అర డజనుకు పైగా సీక్వెల్స్ భారీ అంచనాలతో రాబోతున్నాయి. ముందుగా కన్నడ రాకింగ్ స్టార్ యష్ న‌టించిన చిత్రం కేజీఎఫ్‌1 కి సీక్వెల్‌గా కేజీఎఫ్‌2 చిత్రాన్ని దర్శకుడు ప్రశాంత్ నీల్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. యావత్ మాస్ అభిమానులంతా ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి మొద‌టి సినిమాలానే ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తుందా లేదా అని వేచి చూడాలి.


మంచు విష్ణు – శ్రీను వైట్ల కాంబినేషన్ లో ‘డి అండ్ డి – డబుల్ డోస్’ అనే ‘ఢీ’ సినిమా సీక్వెల్ కూడా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. 2007లో వీరి కాంబోలో వచ్చిన సూపర్ హిట్ కామెడీ ఎంటర్‌టైన‌ర్‌ ‘ఢీ’కి ఈ చిత్రం సీక్వెల్ గా ఇన్నేళ్ల తరువాత ఈ చిత్రం రావడం ఒక ర‌కంగా విశేష‌మ‌ని చెప్పాలి. ఇక అప్ప‌ట్లో ఢీ చిత్రంలోని కామెడీ మాములు కామెడీ కాదు. థియేట‌ర్‌లో ఆడియ‌న్స్ పొట్ట చెక్క‌ల‌య్యేలా న‌వ్వుతారు. బ్ర‌హ్మానందం, విష్ణు మ‌ధ్య వ‌చ్చే కామెడీ..చారీగారు న‌న్ను ఇన్‌వాల్వ్ చెయ్య‌కండి అన్న డైలాగ్ ఇప్ప‌టికీ చాలా మంది వాడుతుంటారు.

చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్ – కలర్స్ స్వాతి జంటగా నటించిన చిత్రం ‘కార్తికేయ’. ఈ చిత్రానికి సీక్వెల్ గా ‘కార్తికేయ 2’ కూడా ఈ ఏడాది రాబోతుంది. ఇందులో నిఖిల్ కి జోడీగా అనుపమ పరమేశ్వరన్ నటిస్తోంది. మొదటి భాగానికి ఏ మాత్రం తగ్గకుండా ఈ సీక్వెల్ స్క్రిప్ట్ ని రెడీ చేసాడట చందు.

అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన సూపర్ హిట్ మూవీ ‘ఎఫ్ 2’ ఫ్రాంచైజీలో ‘ఎఫ్ 3’ సినిమా రానుంది ఈ సంవత్సరం. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. ఫన్ అండ్ ఫ్రస్టేషన్ కి మోర్ ఫన్ ని జోడిస్తూ ఈ సినిమా తీస్తుండటంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

టాలెంటెడ్ యాక్టర్ అడవి శేష్ నటించిన స్పై థ్రిల్లర్ ‘గూఢచారి’ చిత్రం మంచి హిట్ కొట్టింది. దానికి సీక్వెల్ గా ‘గూఢచారి 2’ స్క్రిప్ట్ వర్క్ పూర్తి అయింది. మార్చి నుండి ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది.

‘హిట్’ సినిమాకి సీక్వెల్ ‘హిట్ 2’ కూడా రానుంది.

ఇక అక్కినేని నాగార్జున నటించిన ‘సోగ్గాడే చిన్నినాయనా’ చిత్రం కూడా ఓమాదిరి కామెడీతో బాగానే హిట్ అయింది. ప్ర‌స్తుతం దానికి సీక్వెల్‌గా బంగార్రాజు రాబోతోంది. ఈ చిత్రంలో తండ్రీ కొడుకులిద్ద‌రూ న‌టించి ప్రేక్ష‌కుల‌కు క‌నువిందు చేయ‌నున్నారు.

ఈ చిత్రంలో తండ్రీ కొడుకులిద్ద‌రూ న‌టించి ప్రేక్ష‌కుల‌కు క‌నువిందు చేయ‌నున్నారు.

Also Read: టాలీవుడ్ లో అక్కా చెల్లెల్లుగా న‌టించిన స్టార్ హీరోయిన్లు వీరే..!

Visitors Are Also Reading