Home » టాలీవుడ్ లో అక్కా చెల్లెల్లుగా న‌టించిన స్టార్ హీరోయిన్లు వీరే..!

టాలీవుడ్ లో అక్కా చెల్లెల్లుగా న‌టించిన స్టార్ హీరోయిన్లు వీరే..!

by AJAY
Ad

ల‌వ్ స్టోరీలే కాదు అక్కాచెల్లెళ్ల‌ సెంటిమెంట్ తో వ‌చ్చిన కొన్ని సినిమాలు కూడా సూప‌ర్ డూప‌ర్ హిట్లు గా నిలిచాయి. అలా వ‌చ్చిన కొన్ని సినిమాలు ఇప్ప‌టికీ ప్రేక్ష‌కుల మ‌దిలో నిలిచిపోయాయి. క‌థ బ‌లంగా ఉండి క్యారెక్ట‌ర్ కు ప్రాధాన్య‌త ఉండాలే గానీ స్టార్ హీరోయిన్ సైతం అక్కా చెల్లెల్లుగా న‌టించ‌డానికి రెడీ అయిపోతారు. అలా ఇప్ప‌టి వ‌ర‌కూ కొంత మంది స్టార్ హీరోయిన్ లు సోద‌రి పాత్ర‌ల్లో న‌టించి ఆక‌ట్టుకున్నారు. అలా సిస్ట‌ర్ రోల్స్ లో అద‌గొట్టిన భామ‌లు ఎవ‌రో ఇప్పుడు చూద్దాం….

mahesh babu

mahesh babu

మ‌హేశ్ బాబు హీరోగా అర్జున్ సినిమా తెర‌కెక్కిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ కీర్తి రెడ్డి మ‌హేశ్ బాబుకు సోద‌రిగా న‌టించి అల‌రించారు.

Advertisement

ram charan kruthi karbanda

ram charan kruthi karbanda

అంతే కాకుండా రామ్ చ‌ర‌ణ్ హీరోగా న‌టించిన బ్రూష్లీ సినిమాలో అత‌డికి అక్క పాత్ర‌లో కృతి క‌ర్బంద న‌టించి ఆకట్టుకుంది. ఈ సినిమాలో కృతి పాత్ర‌కు ఎంతో ప్రాధాన్య‌త ఉండ‌టంతో ఆమె క‌థ విన‌గానే గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేసింది.

Advertisement

rajashekar meerajasmine

rajashekar meerajasmine

ఇక అక్కా చెల్లెల్ల సెంటిమెంట్ తో వ‌చ్చిన సినిమాల్లో ప‌క్కాగా చెప్పుకోవాల్సిన సినిమా గోరింటాకు. ఈచిత్రంలో రాజ‌శేఖ‌ర్ కు చెల్లెలిగా మీరా జాస్మీన్ న‌టించింది. ఈ సినిమాలో వీరి న‌ట‌న ప్రేక్ష‌కుల‌ను కంట‌త‌డి పెట్టించి విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకుంది.

trisha srihari

trisha srihari

ఇక శ్రీహ‌రి త్రిష క‌లిసి అన్నా చెల్లెల్లుగా నువ్వొస్తానంటే నేనొంద్దంటానా సినిమాలో న‌టించారు. ఈ సినిమాలో రియ‌ల్ లైఫ్ అన్నా చెల్లెల్లు ఎలా ఉంటారో అలా న‌టించార‌ని విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకున్నారు.

devayani balakrisha

devayani balakrisha

అంతే కాకుండా చెన్న‌కేశ‌వ‌రెడ్డి సినిమాలో దేవ‌యాని బాల‌య్య‌కు చెల్లెలిగా న‌టించి ఆక‌ట్టుకుంది.

manchu vishnu kajal

manchu vishnu kajal

అదే విధంగా రీసెంట్ గా మంచు విష్ణు హీరోగా తెర‌కెక్కిన మోస‌గాళ్లు సినిమాలో కాజ‌ల్ అగ‌ర్వాల్ విష్ణుకు చెల్లెలిగా న‌టించి అంద‌ర్నీ షాక్ కు గురిచేసింది.

upendra nithya menon

upendra nithya menon

ఇక స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా న‌టించిన స‌న్ ఆఫ్ స‌త్య‌మూర్తి సినిమాలో విలన్ గా న‌టించిన ఉపేంద్ర‌కు నిత్యా మీన‌న్ చెల్లెలిగా న‌టించి ఆక‌ట్టుకుంది.

Visitors Are Also Reading