టాలీవుడ్ లో మరో విషాదం చోటు చేసుకుంది.. ప్రముఖ జబర్దస్త్ షో ద్వారా ఎంతో పేరు సంపాదించుకున్న మిమిక్రీ ఆర్టిస్ట్ మూర్తి మంగళవారం తుది శ్వాస విడిచారు. మిమిక్రీ తో జబర్దస్త్ కమెడియన్ గా ఒక మంచి గుర్తింపు సంపాదించుకున్న మూర్తి అతి చిన్న వయసులోనే ఇలా ఇండస్ట్రీకి దూరం అవడం దారుణం.. ఈరోజు మధ్యాహ్నం ఆయన తుది శ్వాస విడిచారని సోదరుడు అరుణ్ ధృవీకరించారు.. మిమిక్రీ తో తన కెరీర్ ను స్టార్ట్ చేసి జబర్దస్త్ లో స్థానం సంపాదించి మంచి కమెడియన్ గా పేరు తెచ్చుకున్నారు..
Advertisement
also read:వివాహానికి ముందు అబ్బాయి, అమ్మాయి ఒకరి గురించి మరొకరు తప్పక తెలుసుకోవాల్సిన 5 విషయాలు !
Advertisement
ఆయన జబర్దస్త్ షోలే కాకుండా పలు వేదికలపై ప్రదర్శనలు కూడా ఇచ్చేవారు. అలాంటి కమెడియన్ మూర్తిని ప్రాంక్రియస్ క్యాన్సర్ మహమ్మారి మింగేసింది. ఆయన గత కొన్ని సంవత్సరాలుగా ఈ వ్యాధి బారిన పడి అనేక ఇబ్బందులు పడుతున్నారు. దీనినుండి బయట పడటం కోసం అనేక ప్రయత్నాలు కూడా చేశారు. కానీ రోజు రోజు కూ ఆరోగ్యం క్షీణించడంతో చివరికి తుది శ్వాస వదిలారు. మూర్తి తన మిమిక్రీ టాలెంట్ తో ఎవరినైనా అనుకరించేవారు.
అంతేకాకుండా 2018 బుల్లితెరపై కూడా ఆయన అలరించారని చెప్పవచ్చు. ఈ క్యాన్సర్ మహమ్మారి కారణంగా తీవ్ర అనారోగ్యానికి గురై, మూడు సంవత్సరాల పాటు వైద్య ఖర్చుల కోసం లక్షల రూపాయలు ఖర్చు పెట్టాడు. ఆయన వైద్యం కోసం చాలా మంది దాతలు కూడా సహాయం అందించారు. అయినా లాభం లేకుండా పోయింది. ఈ వ్యాధి ముదిరి పోవడంతో మంగళవారం మధ్యాహ్నం హనుమకొండలో తుదిశ్వాస విడిచారు మూర్తి.
also read:ఎస్పీ బాలు లవ్ స్టోరీలో సినిమాకు మించిన ట్విస్టులు.. ఆ ఒక్క కారణంతో పారిపోయి పెళ్లి చేసుకున్నారా..?