Home » వివాహానికి ముందు అబ్బాయి, అమ్మాయి ఒకరి గురించి మరొకరు తప్పక తెలుసుకోవాల్సిన 5 విషయాలు !

వివాహానికి ముందు అబ్బాయి, అమ్మాయి ఒకరి గురించి మరొకరు తప్పక తెలుసుకోవాల్సిన 5 విషయాలు !

by AJAY
Ad

జీవితంలో అతిముఖ్య‌మైన విష‌యాల‌లో వివాహం కూడా ఒక‌టి. కాబ‌ట్టి ఎవ‌రిని పెళ్లి చేసుకోవాలి ఎందుకు పెళ్లి చేసుకోవాలి. పెళ్లి చేసుకోబోయేవారిలో ఎలాంటి క్వాలిటీలు ఉండాలి ఇలా ప్ర‌తిఒక్క‌దానిపై అవ‌గాహ‌న ఉండాలి. లేదంటే పెళ్లి పెటాకులు అయ్యే అవ‌కాశాలు ఉన్నాయి. ముఖ్యంగా పెళ్లికి ముందు అబ్బాయిలు అమ్మాయి త‌మ‌కు కాబోయేవారి గురించి ఈ ఐదు విష‌యాలు తెలుగ‌సుకోవాల‌ని మాన‌సిక నిపుణులు చెబుతున్నారు. జీవితంలో డ‌బ్బు చాలా ముఖ్య‌మైన‌ది మ‌న లైఫ్ స్టైల్ ఎలా ఉండ‌బోతుందో చెప్పేదే డ‌బ్బు.

Advertisement

ప్ర‌స్తుతం ప్ర‌తిది డ‌బ్బుతోనే ముడిప‌డి ఉంటుంది. కాబ‌ట్టి పెళ్లి చేసుకోబోతున్న‌వారు డబ్బు ఎలా ఖ‌ర్చు చేస్తారు. పొదుపు చేసే స్వ‌భావం ఉందా లేదంటే ఉన్న‌దంతా ఖ‌ర్చు చేసి ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టివేస్తారా అని ముందుగానే తెలుసుకోవాలి. వారి ఆదాయం వ్య‌యం కు సంబంధించిన వివరాలు తెలుసుకోవాలి. ప్ర‌స్తుత కాలంలో భార్య భ‌ర్త‌లు ఇద్ద‌రూ సంపాదించాల‌ని అనుకుంటున్నారు. ఆర్థికంగా ఎద‌గ‌టానికి ఇద్ద‌రూ ఉద్యోగం చేయ‌డం అవ‌స‌రం. అయితే ఈ విష‌యంలో భాగ‌స్వామి నిర్న‌యం కూడా తీసుకావాలి.

Advertisement

పెళ్లి త‌ర‌వాత వాళ్లు ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? లేదా..? అనే విషయాన్ని ముందుగానే తెలుసుకోవాలి. అంతే కాకుండా చేసుకోబోయేవారికి ఎవ‌రితో అయినా ఇత‌రులతో సంబంధాలు ఉన్నాయా..?గ‌తంలో ఏమైనా రిలేష‌న్ షిప్ లో ఉన్నారా అనే విష‌యాల‌ను కూడా తెలుసుకోవాలి. లేదంటే పెళ్లి త‌ర‌వాత వాళ్ల‌కి గ‌త జ్ఞాప‌కాలు గుర్తుకువ‌స్తే ఒక్క‌రు కాదూ ఇద్ద‌రూ బాధ‌ప‌డాల్సి వ‌స్తుంది.

పెళ్లి త‌ర‌వాత పిల్ల‌ల విష‌యంలోనూ క్లారిటీ ఉండాలి. కంత‌మంది పెళ్లి త‌ర‌వాత వెంట‌నే పిల్ల‌లు కావాల‌ని అనుకుంటే మరికొంద‌రు మాత్రం కాస్త స‌మ‌యం కావాల‌ని కోరుకుంటారు. కాబ‌ట్టి ఆ విష‌యంలో కాబోయేవారితో మాట్లాడి ముందే క్లారిటీ తెచ్చుకోవాలి. ఇక కొంత‌మంది అత్తామామ‌ల‌కు దూరంగా ఒంటరిగా ఉండాల‌ని కోరుకుంటారు. అలాంటి వారితో చాలా క‌ష్టం కాబ‌ట్టి ముందే అత్తామ‌మ పై వాళ్లు ఎలాంటి అభిప్రాయంతో ఉన్నారు అనే విష‌యాల‌ను కూడా అడిగి తెలుసుకోవాలి.

ALSO READ: డ్యామిట్ కథ అడ్డం తిరిగింది ! భర్తకి ప్రియురాలితో పెళ్లి చేసిన భార్య ఘటనలో ఊహించని ట్విస్ట్ !

Visitors Are Also Reading