కొన్ని సినిమాలు ఎంత బాగున్నా హిట్ అవ్వకుండా ఉండిపోతుంటాయి. ఆ సమయానికి ప్రేక్షకుల రిసీవింగ్ సరిగా లేకపోతే సినిమాలు ఫ్లాప్ అయిపోతుంటాయి. థియేటర్లో రిలీజ్ అయినప్పుడు ఫ్లాప్ అయ్యిన సినిమాలు తిరిగి టివిలో వచ్చినప్పుడు చూస్తే.. ఈ సినిమానే బాగుంది కదా కానీ ఎందుకు ఫ్లాప్ అయ్యింది ? అని డౌట్ వస్తుంది. అలాంటి ఓ ఐదు సినిమాల లిస్ట్ పై ఇప్పుడు ఓ లుక్ వేద్దాం.
Advertisement
1. ఖలేజా:
ఈ సినిమాకు చాలా మందే ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పటికీ టివి లో వస్తే, అతుక్కుని మరీ చూసే వారు ఉంటారు. కానీ, ఈ సినిమా థియేటర్లో రిలీజ్ అయినప్పుడు ఎందుకు ఫ్లాప్ అయ్యిందో అర్ధం కాదు. డాక్యుమెంటరీ టైపు స్క్రీన్ ప్లే లో నడిచే ఈ సినిమా ఆడియన్స్ కి త్వరగా కనెక్ట్ కాలేదు. అందుకే రిలీజ్ అయినప్పుడు ఫ్లాప్ అయ్యి.. ఆ తరువాత చాలా మందికి ఫేవరెట్ సినిమా అయిపోయింది.
2. నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్ :
ఈ సినిమా కూడా అంతే. రిలీజ్ అయినప్పుడు పెద్ద టాక్ తెచ్చుకోలేదు. కానీ.. ఇప్పటికీ ఈ సినిమాకి ఫాలోయింగ్ ఉందంటే నమ్ముతారా? ఈ సినిమా చూసి తమ స్కూల్ డేస్, కాలేజీ డేస్ ను తలుచుకోని వారు ఉండరు.
3. ఆరెంజ్:
Advertisement
ప్రేమకి సరికొత్త వెర్షన్ ను చెప్తూ వచ్చిన సినిమా ఆరంజ్. ఈ సినిమాలో రామ్ చరణ్, జెనీలియా కొత్తగా కనిపించారు. వీరి పెయిరింగ్ కూడా అదే ఫస్ట్ టైం. కొంతకాలం మాత్రమే ప్రేమిస్తా అనే కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమాను అప్పట్లో ఆడియన్స్ సరిగ్గా అర్ధం చేసుకోలేదు. దానితో అప్పట్లో ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నా తరువాత మాత్రం మంచి సినిమాగా గుర్తింపు తెచ్చుకుంది.
4. ఓంకారం:
ఇప్పటి అర్జున్ రెడ్డి, RX 100 సినిమాలు మిక్సీలో వేసి కొడితే ఓంకారం సినిమా. ఈ సినిమా అర్జున్ రెడ్డి తరహా లోనే ఉంటుంది. అప్పట్లోనే ఇటువంటి కాన్సెప్ట్ ను యాక్సెప్ట్ చేసే ఆడియన్స్ లేకపోవడంతో ఈ సినిమా ఒక ఫ్లాప్ గా నిలిచిపోయింది.
5. వేదం:
హీరో అల్లు అర్జున్ కు తాను నటించిన అన్ని సినిమాల్లోకి వేదం సినిమా ఇష్టమట. ఈ విషయాన్నీ అల్లు అర్జున్ స్వయంగా చెప్పారు. అల్లు అర్జున్ మాత్రమే కాదు, మంచు మనోజ్, స్వీటీ అనుష్క కూడా ది బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు. కానీ, ఈ సినిమాకు ఆశించినంత కలెక్షన్ రాలేదు. ఇప్పుడు టివిలో వస్తుంటే మాత్రం ఈ సినిమా ఎందుకు హిట్ అవ్వలేదబ్బా? అని అనిపిస్తుంది.
మరిన్ని ముఖ్య వార్తలు:
ఆదిపురుష్ లో హనుమంతుడిగా నటించిన దేవ్ దత్త గురించి ఎవరికీ తెలియని విషయాలు ఇవే..!
సమంత దారిలోనే లావణ్య త్రిపాఠి.. ఇదే నిజమవుతుందా ?
‘అవతార్’ అభిమానులకు చేదువార్త.. ‘అవతార్’ 3,4,5 విడుదల తేదీలలో భారీ మార్పులు..!