Home » Telangana Tenth Results: పది ఫలితాలు.. ఆ స్కూళ్లలో ఎవరు పాస్ కాలేదట..!

Telangana Tenth Results: పది ఫలితాలు.. ఆ స్కూళ్లలో ఎవరు పాస్ కాలేదట..!

by Sravanthi
Ad

గత కొంతకాలంగా పదో తరగతి పరీక్షలు రాసి విద్యార్థులు రిజల్ట్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. విద్యార్థులే కాదు వారి తల్లిదండ్రులు కూడా పిల్లల రిజల్ట్ కోసం ఆత్రుతగా ఎదురుచూశారు. ఆత్రుతకు ఈరోజు ఎండ్ కార్డు పడింది. రిజల్ట్ రానే వచ్చింది. తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మే 9న ఇంటర్ ఫలితాలు విడుదల చేసి, మే 10న పది ఫలితాలు విడుదల చేసింది. ఈ తరుణంలో రాష్ట్ర వ్యాప్తంగా ఫలితాలు ఏ విధంగా వచ్చాయి, ఎంత పర్సంటేజ్ ఉందో ఇప్పుడు చూద్దాం..

also read:అందమైన అమ్మాయిని పెళ్లాడాడు..ఫస్ట్ నైట్ రోజు ఎంత దారుణం..!!

Advertisement

రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 25 పాఠశాలల్లో పాస్ పర్సంటేజ్ జీరో గా ఉన్నట్టు తెలుస్తోంది. పరీక్షల్లో మొత్తం 86.60 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా, నిర్మల్ జిల్లాలో 99 శాతం పాస్ పర్సంటేజ్ తో మొదటి స్థానంలో గెలిచింది. అలాగే59.46 శాతంతో వికారాబాద్ జిల్లా చివరి స్థానంలో నిలిచిందని చెప్పవచ్చు. అయితే జూన్ 14 నుంచి 22 వరకు అడ్వాన్సుడ్ సప్లమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు.

Advertisement

also read:80 ఏళ్లలో కూడా తండ్రి అయిన స్టార్ హీరో.. ఎన్నోసారి అంటే ?

26వ తేదీ నుంచి ఫీజ్ చెల్లించేందుకు అవకాశం కల్పిస్తున్నట్టు విద్యాశాఖ వెల్లడించింది. రీకౌంటింగ్ కోసం ప్రతి సబ్జెక్టుకు 500 రూపాయలు చెల్లించాలని వెల్లడించారు. ఇక ప్రభుత్వ పాఠశాలలో అత్యల్పంగా 72.39శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇక గురుకులాల్లో 98.25 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. అలాగే పాస్ కాని విద్యార్థులు కూడా అయోమయం చెందవద్దని మళ్లీ పరీక్షలు రాసేందుకు అవకాశం ఉందని ధైర్యంగా ఉండి ఎదుర్కోవాలని విద్యా నిపుణులు చెబుతున్నారు.

also read:Asia Cup 2023: ఆసియా కప్ 2023 నుంచి పాకిస్తాన్ ఔట్‌ ?

Visitors Are Also Reading