Telugu News » Blog » తెలంగాణ లోకేష‌న్ల‌పై మ‌న‌సుపారేసుకుంటున్న ద‌ర్శ‌కులు..ఈ ప్రాంతాల్లో జోరుగా షూటింగ్లు..!

తెలంగాణ లోకేష‌న్ల‌పై మ‌న‌సుపారేసుకుంటున్న ద‌ర్శ‌కులు..ఈ ప్రాంతాల్లో జోరుగా షూటింగ్లు..!

by AJAY
Ads

ఒకప్పుడు తెలంగాణ ప్రాంతంలో సినిమా షూటింగ్ లు అతి తక్కువగా జరిగేవి. ఎక్కువగా ఆంధ్ర మరియు ఇతర రాష్ట్రాల్లోనే సినిమా షూటింగ్ లు జరిగేవి. తెలంగాణలోని హైదరాబాద్ మినహాయించి ఏ ప్రాంతంలోనూ షూటింగ్ లు జరిగింది లేదు. కానీ ఇప్పుడు దర్శకులంతా తెలంగాణలో లొకేష‌న్ల‌పైనే మనసు పారేసుకున్నారు. ఇటీవలి కాలంలో భారీ బడ్జెట్ సినిమాలు తెలంగాణలో చిత్రీకరణ జరుపుకోవడం విశేషం.

అనుష్క ప్రధాన పాత్రలో నటించిన రుద్రమదేవి సినిమాలోని ఓ సన్నివేశాన్ని కుంతల జలపాతం వద్ద చిత్రీకరించారు. కుంటాల జలపాతం ఆదిలాబాద్ జిల్లాలో ఉండగా చుట్టూ అడవులతో ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇక్కడ మరి కొన్ని సినిమాల షూటింగులు కూడా జరిగాయి. అంతే కాకుండా ఈ సినిమా ఎక్కువ భాగం షూటింగ్ ను వ‌రంగ‌ల్ జిల్లాలో పూర్తిచేశారు.

అదేవిధంగా భద్రాచలం గోదావరి పరిసర ప్రాంతాల్లో రంగస్థలం సినిమాతో పాటూ ఇతర సినిమాల షూటింగ్ లు జరిగాయి. రీసెంట్ గా బాలయ్య హీరోగా నటించిన అఖండ‌ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను మహబూబ్ న‌గ‌ర్ జిల్లాలో చిత్రీకరించారు.

అంతేకాకుండా ప్రభాస్ హీరోగా తెరకెక్కిన భారీ బడ్జెట్ సినిమా ఈ సినిమా షూటింగ్ ను పెద్దపల్లి జిల్లా లోని గోదావరిఖని బొగ్గుగనిలో చిత్రీకరించారు. ఇక ప్రస్తుతం నాని హీరోగా దసరా సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు కూడా గోదావరిఖని బొగ్గుగ‌నుల్లోనే చిత్రీకరిస్తున్నారు.


You may also like