లండన్ బ్లూమ్స్ బెర్రీ ఇన్స్టిట్యూట్ లో చదువుతున్న నగరానికి చెందిన బసవరాజ్ శ్రావణి ఈనెల 10న ఆ**త్య చేసుకుంది. ఈ ఘటన ఆలస్యంగా బుధవారం వెలుగులోకి వచ్చింది. శ్రావణి మృతదేహం గురువారం ఉదయం హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకుంటుందని బంధువులు తెలిపారు. వరంగల్ నగరంలోని పోచమ్మ మైదాన్ ప్రాంతానికి చెందిన బసవరాజ్ విజయ, రమేష్ దంపతుల కూతురు శ్రావణి.
Advertisement
ఉన్నత విద్య నిమిత్తం లండన్ వెళ్లింది. శ్రావణి తండ్రి లారీ డ్రైవర్ కాగా… తల్లి గృహిని. బిడ్డ ఉన్నత చదువుల కోసం సొంత ఇంటిని అమ్మి మరీ విదేశాలకు పంపారు. అయితే తన కోసం తన కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటుందని భావించిన శ్రావణి ఇంతటి దారుణ నిర్ణయం తీసుకుని ఉండవచ్చని బంధువులు అభిప్రాయపడుతున్నారు. బిడ్డ భవిష్యత్తు కోసం ఇంటిని అమ్మితే ఇప్పుడు అదే బిడ్డ ప్రాణాలు తీసుకుని తమ ఆశలమే కాక భవిష్యత్తును ప్రశ్నార్ధకంగా మార్చింది అంటూ గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు శ్రావణి తల్లిదండ్రులు.
Advertisement
లండన్ లోని వరంగల్ ఎన్ఆర్ఐ ఫోరం బృందం అధ్యక్షుడు శ్రీధర్ నీల, ఫౌండర్ కిరణ్ పసునూరి, జాయింట్ సెక్రెటరీ ప్రవీణ్ బిట్ల ఉమెన్ వింగ్ సెక్రెటరీ మేరీఏలు ఇండియా ఎంబసీ అధికారులతో సంప్రదించి శ్రావణి మృతదేహాన్ని భారతదేశానికి పంపించినట్లు తెలిపారు. శ్రావణి కుటుంబం ఆర్థిక పరిస్థితులను మెరుగుపరిచేందుకు రూ. 30 లక్షలు ఆర్థిక సహా యాన్ని కూడా అందజేసినట్లు తెలిసింది.
మరి కొన్ని ముఖ్యమైన వార్తలు:
ఆ స్టార్ హీరో కోసం గజాలా… ఆత్మ*** చేసుకోబోయిందా ?
అవినాశ్‌ను బుధవారం వరకు అరెస్ట్ చేయొద్దు: హైకోర్టు\
నోటి ఉమ్ము అమ్ముతూ.. నెలకు లక్షల్లో సంపాదిస్తున్న మహిళ